Homeవినోదంటీఆర్పీలో 10 ప్లస్ కిందకు పడిన కార్తీక దీపం 2... ఈ వారం టాప్10 లిస్ట్ చూడండి

టీఆర్పీలో 10 ప్లస్ కిందకు పడిన కార్తీక దీపం 2… ఈ వారం టాప్10 లిస్ట్ చూడండి


Telugu TV Serials TRP Ratings This Week: తెలుగు టీవీ సీరియల్ టీఆర్పీ రేటింగ్స్ విషయానికి వస్తే ‘కార్తీక దీపం 2: నవ వసంతం’ ఎప్పుడు టాప్ ప్లేస్ లో ఉంటుంది. ఈ వారం కూడా ఆ సీరియల్ దుమ్ము దులిపింది. మొదటి స్థానంలో నిలిచింది. అయితే టీఆర్పీ పరంగా 10 కంటే తక్కువ సాధించింది. మరి, మిగతా తొమ్మిది స్థానాలలో ఏయే సీరియల్స్ ఉన్నాయి? ‘కార్తీక దీపం 2’ తరువాత టాప్ 9 సీరియల్స్ ఏవి? అనే లిస్టు చూస్తే…

డాక్టర్ బాబుకు ప్రభాకర్ కాంపిటీషన్!
గడిచిన మూడు వారాలుగా ‘కార్తీక దీపం 2 నవ వసంతం’ సీరియల్ 10 ప్లస్ టీఆర్పీ రేటింగ్ సాధిస్తూ వచ్చింది. అయితే ఈ వారం ఆ సీరియల్ టీఆర్పీ 10కి 0.01% కిందకు పడింది. 

లేటెస్ట్ వీక్ ‘కార్తీక దీపం 2’కు 9.99 టీఆర్పీ రేటింగ్ వచ్చింది. అయినా సరే దానిదే మొదటి ప్లేస్. డాక్టర్ బాబుకు బుల్లితెర మెగాస్టార్ ప్రభాకర్ స్ట్రాంగ్ కాంపిటీషన్ ఇస్తున్నారు. ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్ 9.11 టీఆర్పీ సాధించింది.

‘స్టార్ మా’ ఛానల్ వరకు మాత్రమే కాదు… ఈ వారం టాప్ 10 లిస్టులో మొదటి ఐదు స్థానాల్లో స్టార్ మా సీరియల్స్ ఉన్నాయి. ‘కార్తీక దీపం 2’, ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ తర్వాత ‘గుండె నిండా గుడిగంటలు’ (8.80), ‘ఇంటింటి రామాయణం’ (8.37), ‘చిన్ని’ (7.72) టీఆర్పీ సాధించాయి. ఆ తరువాత ‘నువ్వుంటే నా జతగా’ (6.75), ‘మగువా ఓ మగువా’ (6.50) టీఆర్పీ సాధించాయి. 

జీ తెలుగులో టాప్ రేటింగ్ సాధించిన సీరియల్స్ ఏమిటి?
జీ తెలుగు ఛానల్ సీరియల్ రేటింగ్స్ విషయానికి వస్తే… 7.16 టీఆర్పీ సాధించిన ‘మేఘ సందేశం’ మొదటి స్థానంలో నిలిచింది. ఈ వారం ఓవరాల్ టాప్ 10 లిస్ట్ చూస్తే ఈ సీరియల్ ఆరో స్థానంలో ఉంది. ఆ తర్వాత ‘జగద్ధాత్రి’ (6.83), ‘పడమటి సంధ్యారాగం’ (6.67), ‘చామంతి’ (6.71), ‘నిండు నూరేళ్ల సావాసం’ (6.61) టీఆర్పీ రేటింగ్ సాధించాయి.

Also Read‘వైఫ్ ఆఫ్’ రివ్యూ: రాత్రికొచ్చే అమ్మాయి… గంజాయి… ఎఫైర్లు… ETV Winలో కొత్త సస్పెన్స్ డ్రామా ఎలా ఉందంటే?

టెలికాస్ట్ టైమింగ్ మారిన కారణంగా ‘త్రినయని’ సీరియల్ 2.35 టీఆర్పీ రేటింగ్ మాత్రమే సాధించింది. ‘ఉమ్మడి కుటుంబం’ కూడా 2.83 టీఆర్పీ పొందింది. ఈ వారం ‘మా అన్నయ్య’ (4.61), ‘అమ్మాయి గారు’ 5.24 టీఆర్పీ సాధించాయి. 

జెమినీ టీవీ సీరియళ్లలో ఈ వారం ఒక్కటంటే ఒక్క సీరియల్ కూడా వన్ ప్లస్ టీఆర్పీ రేటింగ్ సాధించలేదు. ఈటీవీలో ‘మనసంతా నువ్వే’ (2.15), ‘రంగుల రాట్నం’ (2.04) టీఆర్పీ సాధించాయి. ‘రావోయి చందమామ’ (1.66), ‘శతమానం భవతి’ (1.42), ‘కలిసుందాం రా’ (1.15) టీఆర్పీ సొంతం చేసుకున్నాయి. మిగతా సీరియల్ టీఆర్పీ ఒకటి కంటే తక్కువగా ఉన్నాయి.

Also Read: బుక్ మై షోలో 7.5 రేటింగ్ వచ్చిన తెలుగు కామెడీ థ్రిల్లర్ – ఈ వారమే ఓటీటీలో స్ట్రీమింగ్… ఎందులోనో తెల్సా?

మరిన్ని చూడండి



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments