Homeవినోదందిల్ రాజు మాస్టర్ ప్లాన్... సంక్రాంతికి వస్తున్నాం ఓటీటీకి క్రేజీ డీల్, ఎన్ని కోట్లకు అమ్మారంటే

దిల్ రాజు మాస్టర్ ప్లాన్… సంక్రాంతికి వస్తున్నాం ఓటీటీకి క్రేజీ డీల్, ఎన్ని కోట్లకు అమ్మారంటే


విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన తాజా చిత్రం ‘సంక్రాంతికి వస్తున్నాం’ కలెక్షన్ల పరంగా దూకుడు చూపిస్తోంది. థియేటర్లలో పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తున్న ఈ మూవీకి రోజురోజుకూ మరింతగా కలెక్షన్లు పెరుగుతున్నాయి. అయితే ఇప్పటిదాకా సస్పెన్స్ గా ఉన్న ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ ఓటీటీ డీల్ తాజాగా సెట్ అయినట్టుగా తెలుస్తోంది. ఈ మూవీ డిజిటల్ పార్ట్నర్ ఫిక్స్ అయినట్టుగా బజ్ నడుస్తోంది.

‘సంక్రాంతికి వస్తున్నాం’ ఓటీటీ డీటెయిల్స్ 
విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘సంక్రాంతికి వస్తున్నాం’. ఈ సినిమాలో ఐశ్వర్య రాజేష్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీని నిర్మించారు. ఈ మూవీపై రిలీజ్ కు ముందే మంచి హైప్ నెలకొంది. ముఖ్యంగా పాటలు ముందుగానే సంక్రాంతి వైబ్ ను తీసుకొచ్చాయి. ఇక సంక్రాంతి బరిలో గట్టి పోటీ ఉన్నప్పటికీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమానే అంచనాలను అందుకొని, ఈ పొంగల్ విన్నర్ గా నిలిచింది. భారీ కలెక్షన్లు కొల్లగొడుతున్న ఈ మూవీ డిజిటల్ డీల్ తాజాగా క్లోజ్ అయ్యింది.

తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ డిజిటల్ పార్ట్నర్ ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ డిజిటల్ రైట్స్ డీల్ భారీ ధరకు జరిగింది. మూవీ హిట్ టాక్ తెచ్చుకోవడంతో ఈ మూవీ రైట్స్ కోసం పలు ఓటీటీ సంస్థలు పోటి పడగా, చివరకు జీ5 చేజిక్కించుకున్నట్టు తెలుస్తోంది. జీ5 ఈ మూవీ ఓటీటీ రైట్స్ ని దాదాపు రూ. 30 కోట్లకు కొనుగోలు చేసినట్టు సమాచారం. నిజానికి వెంకటేష్ కెరీర్లో ఇదే హయ్యెస్ట్ ఓటీటీ డీల్. ఇక ఈ ఓటీటీ డీల్ తో దిల్ రాజుకు లాభాల పంట పండినట్టే. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే… మూవీ రిలీజ్ కి ముందే డిజిటల్ రైట్స్ డీల్ ను దిల్ రాజు పూర్తి చేయలేదు. ఇప్పుడు సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో ఆయన జీ5కి భారీ ధరకి ‘సంక్రాంతి వస్తున్నాం’ మూవీ ఓటీటీ రైట్స్ ని అమ్మేశాడు. ఇప్పటికే థియేట్రికల్ రన్ తో భారీ లాభాలను తన ఖాతాలో వేసుకున్న దిల్ రాజుకు, ఓటీటీ రైట్స్ తో మరిన్ని లాభాలు వచ్చిపడ్డాయి. ఇదిలా ఉండగా, తాజా అప్డేట్ ప్రకారం ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ ఫిబ్రవరి రెండవ వారంలో ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. 

Also Readకుంటుకుంటూ… వీల్ ఛైర్‌లో హైదరాబాద్ నుంచి ముంబైకు రష్మిక – అంత అర్జెంటుగా ఎందుకు వెళ్లిందో తెలుసా?

వారం రోజుల్లోనే 200 కోట్లు 
ఇక ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీ భారీ కలెక్షన్లు సాధించింది. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ వీక్ డేస్ లో కూడా అదిరిపోయే హోల్డింగ్ కంటిన్యూ చేస్తూ, ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తోంది. మొదటి మూడు రోజుల్లోనే 100 కోట్లు కొల్లగొట్టిన ఈ మూవీ ఎనిమిదవ రోజు ఏకంగా 15 కోట్లు రాబట్టి, ప్రపంచవ్యాప్తంగా 8 రోజుల్లోనే రూ.218 కలెక్షన్స్ రాబట్టి, రికార్డును క్రియేట్ చేసింది. మరోవైపు ‘సంక్రాంతికి వస్తున్నాం’ మూవీతో వచ్చిన ఊహించని సక్సెస్ ని చిత్ర బృందం ఎంజాయ్ చేస్తోంది

Also Read: అఖిల్ అక్కినేని పెళ్లికి ముహూర్తం ఫిక్స్… వెడ్డింగ్ డేట్, వెన్యూ వివరాలు తెలుసా?

మరిన్ని చూడండి



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments