Homeక్రీడలురాహుల్ కి షాక్.. కెప్టెన్సీ రేసు నుంచి తప్పించిన యాజమాన్యం..!! భారత స్టార్ ఆల్ రౌండరే...

రాహుల్ కి షాక్.. కెప్టెన్సీ రేసు నుంచి తప్పించిన యాజమాన్యం..!! భారత స్టార్ ఆల్ రౌండరే నూతన సారథ


KL Rahul News: భారత స్టార్ కేఎల్ రాహుల్ కి ఐపీఎల్లో షాక్ తగిలే అవకాశముంది. గతేడాది జరిగిన వేలంలో రూ.14 కోట్లు పెట్టి ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు అతడిని కొనుగోలు చేసింది. మాజీ కెప్టెన్ రిషభ్ పంత్ జట్టును వీడటంతో అతని స్థానంలో రాహుల్ జట్టు పగ్గాలు చేపడతాడని అందరూ భావించారు. అయితే తాజాగా జట్టుకు కొత్త కెప్టెన్ వస్తాడని మాజీ క్రికెటర్, కామెంటేటర్ దినేశ్ కార్తీక్ అభిప్రాయ పడ్డ్డాడు. దీంతో కేవలం స్పెషలిస్టు బ్యాటర్ గానే రాహుల్ బరిలోకి దిగబోతున్నాడని అతని ఫ్యాన్స్ నిరాశ పడుతున్నారు. ఇంతకీ ఢిల్లీకి కొత్త కెప్టెన్ గా ఎన్నికవ్వ బోతున్నది ఎవరో తెలుసా.. భారత ఆల్ రౌండర్ అక్షర్ పటేల్. ఇటీవలే టీమిండియా వైస్ కెప్టెన్ గా ప్రమోషన్ పొందిన అక్షర్.. ఐపీఎల్ 2025లో ఢిల్లీ జట్టును నడిపించనున్నట్లు సమాచారం. గత సీజన్ లో పంత్ గైర్హాజరీలో అక్షర్ ఒక మ్యాచ్ లో జట్టుకు కెప్టెన్సీ వహించాడు. 

ఈసారి కెప్టెన్సీ యోగం లేనట్లేనా..?
నిజానికి 2020 నుంచి కేఎల్ రాహుల్ కెప్టెన్ గానే ఐపీఎల్లో ఆడుతున్నాడు. 2020, 21లలో పంజాబ్ కింగ్స్ కు కెప్టెన్సీ వహించిన రాహుల్.. 2022-24 వరకు లక్నో సూపర్ జెయింట్స్ తరపున నాయకత్వం వహించాడు. అయితే ఈసారి మెగావేలంలోకి వచ్చిన అతడిని ఢిల్లీ సొంతం చేసుకుంది. ఇక ఒకవేళ అక్షర్ పగ్గాలు చేపడితే రాహుల్ కేవలం బ్యాటర్ గానే బరిలోకి దిగాల్సి ఉంటుంది. అయితే కెప్టెన్సీపై ఇప్పటివరకు స్పష్టత లేదు. మరో రెండునెలల్లో మెగాటోర్నీ ప్రారంభమవుతున్నందున త్వరలోనే ఢిల్లీ జట్టు దీనిపై ప్రకటన చేసే అవకాశముంది. ఇక అక్షర్ పటేల్  ఢిల్లీని చాలాకాలంగా అంటిపెట్టుకుని ఉంటున్నాడు. 2019 నుంచి టీమ్ తో కలిసి ట్రావెల్ చేస్తున్నాడు. ఇటీవల టీమిండియా తరపున నమ్మకమైన ఆల్ రౌండర్ గా తన ఎదిగాడు. గతేడాది టీ20 ప్రపంచకప్ సాధించిన భారత తుదిజట్టులో అక్షర్ స్థానం దక్కించుకున్నాడు. దీంతో అతడిని కెప్టెన్సీ చేసేందుకు ఢిల్లీ యాజమాన్యం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. 

మార్చి 23 నుంచి ఐపీఎల్..
ప్రపంచంలోనే ఖరీదైన లీగ్ గా పేరోందిన ఐపీఎల్ 18వ ఎడిషన్ మార్చి 23 నుంచి ప్రారంభ మవుతుందని బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా తెలిపారు. మే 25 వరకు సుదీర్ఘంగా ఈ టోర్నీ జరుగుతుందని పేర్కొన్నారు. ఇక కోల్ కతా నైట్ రౌడర్స్ డిఫెండింగ్ చాంపియన్ గా బరిలోకి దిగనుంది. గతేడాది రన్నరప్ సన్ రైజర్స్ హైదరాబాద్ ఈసారి వేలంలో తన స్క్వాడ్ ను బలోపేతం చేసుకుంది. మహ్మద్ షమీ, అభినవ్ మనోహర్, రాహుల్ చహర్, ఇషాన్ కిషన్, జైదేవ్ ఉనాద్కట్, కమిందు మెండిస్, సచిన్ బేబీ తదితర ఆటగాళ్లను కొత్తగా తన జట్టులోకి తీసుకోంది. 2016 తర్వాత రెండు సార్లు ఫైనల్లో ఓడిపోయిన సన్ రైజర్స్ ఈసారి ఎలాగైనా టైటిల్ కొట్టాలని భావిస్తోంది. 

Also Read: ICC Champions Trophy: రేపే జట్టు ప్రకటన.. అందరి కళ్లు ఆ ఇద్దరిపైనే..!! రోహిత్ కెప్టెన్సీపై స్పష్టత వచ్చే అవకాశం!

మరిన్ని చూడండి



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments