Homeతెలుగు రాష్ట్రాలుTG Mla Letters: తిరుమలలో తెలంగాణ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సిఫార్సు లేఖలపై దర్శనాలకు సీఎం చంద్రబాబు...

TG Mla Letters: తిరుమలలో తెలంగాణ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ సిఫార్సు లేఖలపై దర్శనాలకు సీఎం చంద్రబాబు గ్రీన్ సిగ్నల్


తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను అమోదించడంపై తెలంగాణ ప్రజాప్రతినిధులు, భక్తులు హర్షం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు, టీటీడీ చైర్మన్‌ బీఆర్‌ నాయుడుకు తెలంగాణ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌, తెలంగాణ శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి, మంత్రి కొండా సురేఖ, కాంగ్రెస్‌ నేత జగ్గారెడ్డి తదితరులు కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ సీఎం నిర్ణయంతో తెలంగాణ భక్తులకు వేంకటేశ్వరస్వామి దర్శనం మరింత సులభమవుతుందని ప్రసాద్‌కుమార్‌ అన్నారు. తెలంగాణ భక్తులకు నూతన సంవత్సర కానుకగా కొండా సురేఖ అభివర్ణించారు.



Janam kosam – www.janamkosam.com

RELATED ARTICLES

Most Popular

Recent Comments