PV Sindhu Marriage | హైదరాబాద్: భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు పెళ్లిపీటలు ఎక్కారు. రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్‌లో ఆదివారం పీవీ సింధు, వెంకట దత్తసాయి వివాహం ఘనంగా జరిగింది. ఉదయ్‌పూర్‌లో ఆదివారం రాత్రి 11.20 గంటలకు వెంకట దత్తసాయితో కలిసి ఏడడుగులు వేసి వివాహ బంధంలోకి అడుగుపెట్టారు పీవీ సింధు. ఈ వేడుకకు ఇరు కుటుంబాల సభ్యులతో పాటు కొందరు ప్రముఖ అతిథులు మాత్రమే హాజరయ్యారు. హైదరాబాద్‌కు చెందిన వెంకట దత్తసాయి పోసిడెక్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. హైదరాబాద్ లో డిసెంబర్ 24న పీవీ సింధు మ్యారేజ్ రిసెప్షన్ ఏర్పాటు చేస్తామని ఆమె కుటుంబసభ్యులు ఇటీవల వెల్లడించారు.

పీవీ సింధు భర్త వెంకట దత్త సాయి ఎవరంటే..
పీవీ సింధు పెళ్లికూతురు కాబోతోందని ఇటీవల తెలిసిన తరువాత అంతా ఆమెకు కాబోయే భర్త ఎవరు అని ఆసక్తిగా చూశారు. సింధు భర్త వెంకట దత్త సాయి ప్రస్తుతం పొసిడెక్స్‌ టెక్నాలజీ ఈడీగా కొనసాగుతున్నారు. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఆదివారం రాత్రి పీవీ సింధు, వెంకట దత్తసాయి వివాహం ఘనంగా జరిగింది.

View this post on Instagram

A post shared by PV Sindhu (@pvsindhu1)

ఫౌండేషన్ ఆఫ్ లిబరల్ అండ్ మేనేజ్‌మెంట్ ఎడ్యుకేషన్ సంస్థ నుంచి లిబరల్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్/ లిబరల్ స్టడీస్‌లో డిప్లొమా పూర్తి చేశారు వెంకట దత్తా సాయి. ఫ్లేమ్ యూనివర్శిటీ బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ నుంచి 2018లో బీబీఏ అకౌంటింగ్, ఫైనాన్స్ పూర్తి చేశారు. బెంగుళూరులోని ఇంటర్నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నుంచి డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్‌లో ఆయన మాస్టర్స్ డిగ్రీ చేశారు. జేఎస్‌డబ్ల్యూలో సమ్మర్ ఇంటర్న్‌గా, కన్సల్టెంట్‌గా పని చేశారు. 2019 నుంచి పోసిడెక్స్‌లో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా సేవలు అందిస్తున్నారు. కొన్ని సెకన్లలో మీరు పొందే లోన్ లేదా క్రెడిట్ కార్డ్ రావడంపై తాను చేసిన ప్రయత్నాలు నేడు ఫలితాన్ని ఇస్తున్నాయని తన లింక్డ్‌ఇన్ ప్రొఫైల్‌లో వెంకట దత్తసాయి రాసుకున్నారు.

డబుల్ ఒలింపియన్ పీవీ సింధు..
ఒలింపిక్ క్రీడలలో రెండు పతకాలు నెగ్గిన అరుదైన భారత క్రీడాకారిణిగా పీవీ సింధు నిలిచారు. 2016 రియో ఒలింపిక్స్‌లో రజతం, 2020 టోక్యో ఒలింపిక్స్ లో కాంస్యంతో మెరిశారు సింధు. అందుకు ఆమె డబుల్ ఒలింపియన్ అయ్యారు. 2019లో ఒక స్వర్ణంతో సహా 5 ప్రపంచ ఛాంపియన్‌షిప్ పతకాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. 2017లో అత్యున్నత ప్రపంచ ర్యాంకింగ్ 2ని సాధించారు. ఇటీవల జరిగిన సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ 2024 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో పీవీ సింధు ఛాంపియన్ గా నిలిచారు.

Source link