తిరుపోరూర్: సాధారణంగా గుడికి ఎందుకు వెళతాం. మానసిక ప్రశాంతత కోసం కొందరు, మంచి ఉద్యోగం రావాలని, కుటుంబ సమస్యలు పరిష్కారం కావాలని, అంతా మంచే జరగాలని, చేపట్టిన పనిలో సాధించేలా భగవంతుడి ఆశీస్సులు కోరతాం. తమిళనాడులో ఆలయానికి వెళ్లిన ఓ భక్తుడికి వింత పరిస్థితి ఎదురైంది. పరధ్యానంలో వేశాడో, పొరపాటున జరిగిందో కానీ ఓ భక్తుడు తన ఐఫోన్‌ను హుండీలో వేశాడు. ఆ ఫోన్ దేవుడి ఖాతాలోకే వెళ్తుందని, భక్తుడికి చెందదని ఆలయ సిబ్బంది షాకిచ్చారు. ఆ వివరాలిలా ఉన్నాయి.

చెన్నైలోని అంబత్తూర్‌ వినాయకపురానికి చెందిన దినేశ్‌ అనే వ్యక్తి చెన్నై మెట్రోపాలిటన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (CMDA)లో ఉద్యోగం చేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగి అయిన దినేశ్ ఈ ఏడాది ఆగస్టులో తమిళనాడులోని తిరుపోరూర్‌లోని శ్రీ కందస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఈ క్రమంలో ఆలయ హుండీలో మొక్కులు, డబ్బులు, కానుకలకు బదులుగా విరాళాల పెట్టెలో ఓ వ్యక్తి పొరపాటున తన మొబైల్‌ను వేశాడు. పొరపాటున ఐఫోన్‌-13ప్రో హుండీలో పడిపోయిందని అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. తన తప్పిదాన్ని గుర్తించి, ఐఫోన్‌ను తిరిగి ఇవ్వాలని అధికారులను ఆశ్రయించినా ప్రయోజనం లేకపోయింది. ఆ భక్తుడి అభ్యర్థనను దేవాదాయ శాఖ అధికారులు తిరస్కరించారు.

ఆ విషయంలో ఊరట..
ఫోన్‌లోని డేటాను తిరిగి పొందడానికి ఆలయ నిర్వాహకులు దినేష్ అనే వ్యక్తిని సంప్రదించారు. బాధితుడు దినేష్ తన సమస్యను తమిళనాడు మంత్రి శేఖర్ బాబు దృష్టికి తీసుకెళ్లారు. హుండీలో వేసింది ఏదైనా దేవుడి ఖాతాలోకి వెళ్తుందని, ఆ భక్తుడు వేసిన ఐఫోన్ సైతం కానుకగా పరిగణిస్తారని అధికారులు మంత్రికి తెలిపారు. ఆలయాల్లోని హుండీలలో వేసిన వస్తువులు, ఏదైనా కానుక అయినా దేవుడికే చేరతాయని.. తిరిగి ఇవ్వడం కుదరదని మంత్రి చెప్పినట్లు పీటీఐ పేర్కొంది. అయితే కానుకలు తీసి లెక్కించే సమయంలో ఆ ఫోన్ ను గుర్తించాక.. అందులోని ఫొటోలు, డేటా లాంటివి మాత్రం రికవరీ చేసుకునే అవకాశం కల్పిస్తామని అధికారులు చెబుతున్నారు.

ఇలాంటి ఘటన జరగడం రాష్ట్రంలో ఇదే మొదటిసారి కాదు. కేరళలోని అలప్పుజకు చెందిన ఓ భక్తురాలకు ఇలాగే జరిగింది. మే 2023లో పళనిలోని శ్రీ దండయుతపాణి స్వామి దేవాలయం సందర్శించుకున్న సమయంలో పొరపాటున ఆమె 1.75 తులాల బంగారు గొలుసును పొరపాటున హుండీలో పడిపోయింది.

నైవేద్యం పెట్టేందుకు మెడలోని మాలను తీసేసరికి బంగారు గొలుసు కాస్త జారిపోయి హుండీలో పడింది. పొరపాటుగా పడిందని చెప్పి, తన తప్పిదాన్ని గుర్తించి గొలుసు తిరిగివ్వాలని ఆమె రిక్వెస్ట్ చేశారు. భక్తురాలి ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని సీసీటీవీ ఫుటేజీల ద్వారా అసలేం జరిగిందో గుర్తించారు. పొరపాటున గొలుసు జారిపోయి హుండీలో పడిపోయిందని నిర్ధారించుకున్న ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్‌ తమ ఖర్చుతో అంతే విలువ గల కొత్త బంగారు గొలుసును ఆమెకు అందించారు.

ఇన్‌స్టాలేషన్, సేఫ్‌గార్డింగ్ అండ్ అకౌంటింగ్ ఆఫ్ హుండీ రూల్స్, 1975 ప్రకారం, ఆలయంలోని హుండీలో వేసినవి ఏమైనా వారికి తిరిగి ఇవ్వకూడదు. ఒక్కసారి హుండీలోకి చేరిందంటే అది దేవుడి ఖాతాలోకి చేరుతుందని ఒక అధికారి తెలిపారు.

Also Read: Viral Video : ఈ కంపెనీలో బాస్ వస్తున్నాడంటే చాలు.. ఉద్యోగులు ఈ పని చేయాలట

Source link
పొరపాటున హుండీలో పడిన భక్తుడి ఐఫోన్, తిరిగిచ్చే ఛాన్స్ ఉందా? రూల్స్ ఏం చెబుతున్నాయి
RELATED ARTICLES