Sreeleela Rejected Movies : తెలుగులో శ్రీ లీలకు విపరీతమైన పాపులారిటీ ఉంది. ఆమెను చూడటం కోసం థియేటర్లకు ప్రేక్షకులు వస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. మరీ ముఖ్యంగా శ్రీ లీల డ్యాన్సులకు చాలా మంది ఫిదా అయ్యారు.
‘భగవంత్ కేసరి’ సినిమా (Bhagavanth Kesari)తో డ్యాన్సులు మాత్రమే కాదు… తనలో మంచి నటి కూడా ఉందని శ్రీ లీల ప్రూవ్ చేసుకున్నారు. ముఖ్యంగా పతాక సన్నివేశాల్లో ఆమె చేసిన యాక్షన్ సీన్లకు క్లాప్స్ పడుతున్నాయి. ఇప్పుడు శ్రీ లీల చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. డేట్స్ అడ్జస్ట్ కాని కారణంగా కొన్ని చిత్రాలను ఆమె వదులుకున్న సందర్భాలు ఉన్నాయని ఫిల్మ్ నగర్ టాక్. అయితే… శ్రీ లీల ఈ స్థాయికి రావడనికి ముందు తెలుగులో ఓ సినిమా వదులుకున్నారు. అదీ స్టార్ ప్రొడ్యూసర్ ‘దిల్’ రాజు నిర్మించిన సినిమా. ఎందుకో తెలుసా?
‘దిల్’ రాజు పరిచయం చేయాల్సిన హీరోయిన్!
శ్రీ లీల తెలుగు అమ్మాయి. అయితే… తెలుగు కంటే ముందు కన్నడలోశ్రీ లీల సినిమాలు చేశారు. తెలుగు తెరకు ఆమెను పరిచయం చేయాలని ‘దిల్’ రాజు అనుకున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ నిర్మించిన ఓ సినిమా కోసం శ్రీ లీల ఆడిషన్ కూడా ఇచ్చారు. అయితే… చివరకు వచ్చేసరికి ఆ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారని ‘నో’ చెప్పేశారు. ఎంత కష్టమైనా పడతానని, సోలో హీరోయిన్ సినిమా ఇవ్వమని ‘దిల్’ రాజుకు చెప్పేశారట! అదీ సంగతి!!
శ్రీ లీల పాటకు ‘దిల్’ రాజు కుమారుడి డ్యాన్స్!
శ్రీ లీల తమ సంస్థలో సినిమా చేయకపోయినా సరే… తన కుమార్తె హన్షితకు బాగా క్లోజ్ అయ్యిందని, త్వరలో ఆమెతో తప్పకుండా సినిమా చేస్తామని ‘దిల్’ రాజు చెప్పారు. ‘ధమాకా’లో ఆమె పాటలకు తన కుమారుడు డ్యాన్స్ చేస్తాడని కూడా చెప్పారు.
పవన్, మహేష్ కోసం పక్కన పెట్టారా?
ఇద్దరు హీరోయిన్లు ఉన్నారని ‘దిల్’ రాజు సంస్థలో సినిమాకు ‘నో’ చెప్పిన శ్రీ లీల… ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్న ‘గుంటూరు కారం’, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చేస్తున్నారు. ఆ రెండు సినిమాల్లో ఇద్దరేసి హీరోయిన్లు ఉన్నారు.
Also Read : ‘దిల్’ రాజుతో బాలకృష్ణ సెంచరీ మిస్ – అయితే అతి త్వరలో!
‘గుంటూరు కారం’లో ముందు పూజా హెగ్డే మెయిన్ హీరోయిన్ అయితే… శ్రీ లీల సెకండ్ లీడ్! ఆ తర్వాత పూజా హెగ్డే ఆ సినిమా నుంచి తప్పుకొన్నారు. ఇప్పుడు ఆమె బదులు మీనాక్షి చౌదరి వచ్చారు. ‘ఉస్తాద్ భగత్ సింగ్’లో శ్రీ లీలతో పాటు ‘ఏజెంట్’, ‘గాండీవధారి అర్జున’ ఫేమ్ సాక్షి వైద్య నటిస్తున్నారు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు కోసం ఇద్దరు హీరోయిన్లు ఉన్న సినిమా చేయకూడదనే కండిషన్ శ్రీ లీల పక్కన పెట్టిసినట్లు ఉన్నారు.
Also Read : అద్దంలో నన్ను నేను చూసుకుని గుర్తుపట్టలేదు – బాలకృష్ణ
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial