తొలిరోజే రూ.200 కోట్లు
పుష్ప 2 రిలీజైన మొదటి రోజే దేశవ్యాప్తంగా రూ.180 కోట్ల వరకూ వసూళ్లని రాబట్టినట్లు తెలుస్తోంది. ఓవర్సీస్ కలెక్షన్లు కలుపుకుంటే వసూళ్లు రూ.200 కోట్లుపైమాటే. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్ప 2లో అల్లు అర్జున్ సరసన రష్మిక మంధాన నటించగా.. శ్రీలీల ఐటెం సాంగ్ చేసింది. ఫహాద్ ఫాజిల్, జగపతి బాబు, రావు రమేశ్, సునీల్, అనసూయ కీలక పాత్రలు పోషించారు. తొలిరోజే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకున్న పుష్ఫ2.. విడుదలైన అన్ని భాషల్లోనూ రికార్డు కలెక్షన్లు రాబడుతోంది.