Homeతెలుగు రాష్ట్రాలుKoti Deepotsavam Day -17: కన్నుల పండుగగా.. యాదగిరీశుని కల్యాణం, కీసరగుట్ట రామలింగేశ్వర కల్యాణం

Koti Deepotsavam Day -17: కన్నుల పండుగగా.. యాదగిరీశుని కల్యాణం, కీసరగుట్ట రామలింగేశ్వర కల్యాణం


  • అంబరాన్నంటే మహాసంబరం
  • భువిపై సాక్షాత్కరించే ఇలకైలాసం
  • భక్తులందరిచేత.. మహాదేవునికి అర్చన
  • అనిర్వచనీయం.. స్వర్ణలింగోద్భవం
Koti Deepotsavam Day -17: కన్నుల పండుగగా.. యాదగిరీశుని కల్యాణం, కీసరగుట్ట రామలింగేశ్వర కల్యాణం

Koti Deepotsavam Day -17:  భక్తి, ఎన్టీవీ టీవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘కోటి దీపోత్సవం’ వేడుకలు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియంలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నవంబర్‌ 9న ఆరంభమైన ఈ దీపాల పండుగ దిగ్వజయంగా కొనసాగుతోంది. హైదరాబాద్‌ సహా రెండు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు కోటి దీపోత్సవ వేడుకకు చేరుకున్నారు. భక్తి టీవీ కోటి దీపోత్సవం 2024 నేడు చివరి రోజు వైభవోపేత వేడుకల మధ్య ముగిసింది. శంఖారావంతో ప్రారంభమైన పదిహేడవ రోజు కోటి దీపోత్సవ మహోత్సవం.. వేదపఠనంతో ప్రారంభమైంది. వరాలు అనుగ్రహించడానికి పరమేశ్వరుడు కొలువై ఉన్న ప్రాంగణంలో “ప్రదోషకాల అభిషేకం” నిర్వహించారు. భక్తి గీతాలు.. వేణు వాయిద్యం.. కోటి దీపోత్సవంలో పదిహేడవ రోజు శ్రీ దివి నరసింహ దీక్షితులు గారి ప్రవచనామృతం అందిరినీ ఆకట్టుకుంది.. వేదిక పైకి యాదగిరిగుట్ట, కీసరగుట్ట కల్యాణమూర్తుల ఆగమనం, ఈతి బాధలు తొలగించే.. శివపరివారానికి భక్తులచే కోటి రుద్రాక్షల అర్చన, మనోభీష్టాలు నెరవేర్చే యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనృసింహస్వామి కల్యాణోత్సవం.. మొట్టమొదటిసారిగా కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వరస్వామి కల్యాణోత్సవం కన్నుల పండుగగా సాగాయి.

 

కార్తిక సోమవార శుభవేళ భక్తులను అనుగ్రహించడానికి నందివాహనంపై ఆదిదంపతులు విచ్చేశారు. తమిళనాడు ధర్మపురి ఆధీనం పీఠాధిపతి శ్రీ మాసిల్లమణి దేశిగ జ్ఞానసంబంధ స్వామీజీ వారి అనుగ్రహ భాషణం భక్తులను ఆకట్టుకుంది. నేటి అతిథి ముఖ్యత అతిథిగా మంత్రులు తుమ్మల నాగేశ్వర రావు, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డిలు హాజరయ్యారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ.. ఇలా కైలాసంలో కార్తికమాసం వేళ భక్తి, ఎన్టీవీ వారు చేపుడుతున్న కోటి దీపోత్సవ కార్యక్రమం ఆధ్యాత్మికను మరింత ముందుకు తీసుకువెళ్తుందున్నారు. అలాగే.. పీఠాధిపతి, అతిథులు, ఛైర్మన్ దంపతులచే కార్తికదీపారాధన చేశారు. అంతేకాకుండా.. తమిళనాడు ధర్మపురి ఆధీనం పీఠాధిపతి శ్రీ మాసిల్లమణి దేశిగ జ్ఞానసంబంధ స్వామీజీ వారికి గురు వందనం.. మరాఠీ నృత్యం, అమ్మవార్ల నృత్యం, మహిళల డప్పు నృత్యం, పుణే డోలు వాయిద్యం, సాంస్కృతిక కదంబం (కోలాటం), మహా మంగళ హారతి దర్శనంతో కోటి దీపోత్సవ వేడుకలు ముగిశాయి.

 

 





Janam kosam – www.janamkosam.com

RELATED ARTICLES

Most Popular

Recent Comments