HomeవినోదంRAPO22 కోసం వివేక్-మెర్విన్.. ఈ హిట్ కాంబో గురించిన ఇంట్రెస్టింగ్ విషయాలివే

RAPO22 కోసం వివేక్-మెర్విన్.. ఈ హిట్ కాంబో గురించిన ఇంట్రెస్టింగ్ విషయాలివే


Vivek Mervin Music for RAPO22 : యంగ్ అండ్ ఎనర్జీటిక్ హీరో రామ్ పోతినేని, గ్లామర్ డాల్ భాగ్య శ్రీ బోర్స్ ప్రధాన పాత్రల్లో వస్తోన్న RAPO22 మూవీపై ఇప్పటికే ఓ రేంజ్​లో ఎక్స్​పెక్టెషన్స్ పెరిగాయి. పి మహేశ్ బాబు ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. మైత్రీ మూవీ మేకర్స్ చిత్రాన్ని నిర్మిస్తోంది. అయితే ఈ సినిమాకు తమిళ ఇండస్ట్రీకి చెందిన మ్యూజిక్ కంపోజర్స్.. ఒకరు కాదు ఇద్దరూ ఈ సినిమాకు వర్క్ చేస్తున్నారట. 

తమిళ ఇండస్ట్రీలో సంగీత ద్వయంగా సంచలనం సృష్టించిన వివేక్ – మెర్విన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించనున్నారు. కోలీవుడ్​లో హిట్​ అయిన ఈ మ్యూజిక్ కాంబోను RAPO22 సినిమాతో తెలుగులో పరిచయం చేస్తున్నారు మైత్రీ మూవీ మేకర్స్. ఈ విషయాన్ని రామ్ పోతినేని తన సోషల్ మీడియా ద్వారా ట్వీట్ చేశారు. వీరికి వెల్కమ్ చెప్తూ.. Welcoming the “New Sound of Telugu Cinema.”
Dear 
@iamviveksiva
 & 
@mervinjsolomon
 – I’m sure our people will welcome you with both hands after listening to the magic you’re creating for #RAPO22. Here’s to a beautiful career ahead in TFI.
Love, 
#RAPO అంటూ ట్వీట్ చేశారు రామ్.



 

వివేక్-మెర్విన్ జర్నీ

వివేక్ శివ, మెర్విన్ సాల్మన్ కలిసి.. కోలివుడ్​లో వివేక్-మెర్విన్ పేరుతో మ్యూజిక్ స్టార్ట్ చేశారు. మొదటి సినిమా అయిన వడా కర్రీతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కేవలం సినిమాలకే కాకుండా వీరిద్దరూ పలు ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా చేశారు. ధనుష్ హీరోగా చేసిన పటాస్ సినిమాకు మ్యూజిక్​ని అందించారు. దానిలో చిల్ బ్రో సాంగ్ సూపర్ డూపర్ హిట్​గా నిలిచింది. ప్రభుదేవా ఆడిపాడిన గులేబా సాంగ్​ కూడా వీరి కెరీర్​లో మంచి మైల్​స్టోన్​గా నిలిచింది. కార్తీ హీరోగా చేసిన సుల్తాన్ సినిమాలోని సాంగ్స్​ కూడా వీరే చేశారు. ప్రస్తుతం RAPO22 సినిమాతో టాలీవుడ్​లోకి అడుగు పెడుతున్నారు. 

థియేటర్లలో పూనకాలే.. 

రామ్ డ్యాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పైగా అతని సినిమాల్లోని పాటలు, స్టెప్స్​కి విపరీతమైన క్రేజ్ ఉంది. భాగ్య శ్రీ బోర్సే కూడా డ్యాన్స్​ను అంతే ఈజ్​తో చేస్తుంది. అబ్బచ్చా అబ్బచ్చా సాంగ్​లో ఆమె డ్యాన్స్​కి కుర్రకారు ఫిదా అయ్యారు. అలాంటి RAPO22 సినిమాతో ఈ ఇద్దరూ డ్యాన్స్​తో రచ్చ లేపుతారనే సినీ అభిమానులు ఎదురు చూస్తున్నారు. వివేక్-మెర్విన్ వారికి అదే రేంజ్​లో హిట్​ సాంగ్స్ ఇస్తే.. థియేటర్లలో క్రేజ్ మామూలుగా ఉండదు. 

Also Read : 18 గంటల్లో సౌత్ రికార్డు కొట్టిన ‘కిస్సిక్’ – అల్లు అర్జున్, శ్రీలీల ఊరమాస్!

మరిన్ని చూడండి





Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments