ఎన్‌టీఆర్ భరోసా పెన్షన్‌దారుడు మరణిస్తే భార్యకు వెంటనే వితంతు పెన్షన్ మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పెన్షన్‌దారుడు నవంబర్ 1 తరువాత మరణిస్తే మరణ ధ్రువీకరణ పత్రాన్ని పింఛనుదారుడి భార్య నవంబర్ 15 లోపు గ్రామ, వార్డు సచివాలయాలు, ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లకు అందచేస్తే, ఆమోదం పొందిన తరువాత డిసెంబర్ 1 నుంచి వితంతు పెన్షన్ మంజూరు చేస్తారు. ఒకవేళ నవంబర్ 15 తరువాత అందజేస్తే, 2025 జనవరి 1న నుంచి వితంతు పెన్షన్ మంజూరు చేస్తారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి జి. వీరపాండియన్ ఉత్తర్వులు విడుదల చేశారు.