Brahmamudi Serial Today Episode: పందెంలో గెలిచిన రాజ్.. కావ్యను రిజైన్ లెటర్ లో సంతకం పెట్టి వెళ్లిపో అంటాడు. సరేనని కావ్య సంతకం చేస్తుంది. పందెంలో గెలిచిన వాళ్లు సీఈవో అవుతారు. ఓడిపోయిన వాళ్లు ఏం చేయాలో తెలుసుకదా..? ఈ కంపెనీ నుంచి వెళ్లిపోవడమే కాదు. నా జీవితంలో నుంచి శాశ్వతంగా వెళ్లిపోవాల్సిందే అని చెప్తాడు.
కావ్య: నా తల్లిదండ్రులు నన్ను ఆత్మాభిమానంతో బతికేలా పెంచారు. ఇంకొకరి దగ్గరకు వెళ్లి దేహి అని బతికేలా పెంచలేదు.
రాజ్: అయితే మరీ సంతోషం. మళ్లీ నా కంపెనీ నా చేతుల్లోకి వచ్చింది. ఈ కంపెనీకి మళ్లీ పూర్వవైభవం రాబోతుంది. ఒక్క నిమిషం వెళ్లే ముందు నీకో చిన్న అప్రిషియేషన్. అందరూ వచ్చారా..? శృతి ఎక్కడ..?
శృతి: వచ్చాను సార్
రాజ్: ఏంటి మీ మేడం వెళ్లిపోతుందని బాధపడుతున్నారా..? సరే మీ మేడంకు అందరూ ఆల్ ది బెస్ట్ చెప్పండి. ఓ బాధపడుతున్నారా..? సరే శృతి మేడంతో పాటు వీళ్లు వెళ్లిపోతారేమో అందరికీ టెర్మినేషన్ లెటర్ రెడీ చేయ్.
స్టాఫ్: ఆల్ ది బెస్ట్ మేడం.
రాజ్: ఇప్పుడు దారిలోకి వచ్చారు.
అంటూ రాజ్.. కూడా కావ్యకు బొకే ఇస్తూ ఆల్ ది బెస్ట్ చెప్తాడు. కావ్య బాధగా ఆఫీసులోంచి వెళ్లిపోతుంది. శృతి వెళ్లిపోతుంటే.. నువ్వు ఇక్కడే ఉండు ఇక నుంచి నువ్వు నా పక్కనే ఉండాలని ఇక్కడ జరిగేవన్నీ అక్కడకు అదే మీ మేడంకు కోవర్టుగా చెప్పాలంటాడు. మరోవైపు కళ్యాణ్ వెళ్లి రైటర్ లక్ష్మీకాంత్ ను కలుస్తాడు.
రైటర్: లిరిక్స్ తెచ్చావా..?
కళ్యా్ణ్: తెచ్చాను సార్..
రైటర్: నాకు తెలుసు నీకిచ్చిన అవకావం నువ్వు సద్వినియోగం చేసుకుంటావని. ఎదిగే వాళ్ల లక్షణం ఇదే. నీకు మంచి భవిష్యత్తు ఉంది. ఇలా దీవిస్తాను. మా లాంటి వాళ్ల దీవెనలు నీకు ఉపకరిస్తాయి.
కళ్యాణ్ దగ్గరకు వెళ్లి కాళ్లు పట్టుకోగానే నీలో ఉన్న సాహిత్యం పెరగాలని అది నాకే ఇవ్వాలని దీవిస్తాడు. ఇంతలో ఒక ప్రొడ్యూసర్ వస్తే కళ్యాణ్ రాసిన పాటను ఆయనకు ఇస్తూ.. ఆయనకు కాఫీ తీసుకురమ్మని కళ్యాణ్ కు చెప్తాడు. తర్వాత ప్రొడ్యూసర్ వెళ్లిపోయాక కళ్యాణ్‌కు పదివేలు ఇస్తాడు లిరిక్ రైటర్. మరో పాట రాయమని చెప్తాడు. సరే అంటాడు కళ్యాణ్. మరోవైపు కనకం కావ్య వస్తువులన్నీ సర్దుతుంది.
కనకం: చీరలు, జాకెట్లు, గాజులు, బొట్టు అన్ని సర్దేశాను. ఇంకేమౌనా మర్చిపోయానా..?
మూర్తి: ఆ మర్చిపోయావు. తను వాడుతున్న బ్రష్, నాలుక గీసుకునే బద్ద పెట్టేయ్.
కనకం: అది పెడితే బాగుంటుందా..?
మూర్తి: బాగుంటే పెట్టేస్తావా..?
కనకం: అది కాదయ్యా.. మళ్లీ అక్కడ అమ్మాయికి ఏమైనా అవసరం పడుతుందేమోనని..
మూర్తి: నువ్వు అమ్మాయిని అమెరికా పంపిచటం లేదే..అత్తారింటికి పంపిస్తున్నావు.
అని చెప్పగానే అత్తారింటికి కాబట్టే ఇంత కంగారు అంటూ కనకం అంటుంది. ఇద్దరూ కావ్య కాపురం గురించి మాట్లాడుతుంటే కావ్య డల్లుగా వస్తుంది. ఎందుకమ్మా ఈ హడావిడి అని అడగ్గానే.. నువ్వు వెళ్లి రెడీ అవు తర్వాత చెప్తాను. అనగానే కావ్య పందెంలో తను ఓడిపోయానని చెప్తుంది. అనుకున్న మాట ప్రకారం ఓడిపోయిన నేను ఆఫీసుకు కానీ.. ఆయన జీవితంలోకి వెళ్లకూడదు కదా..? అని చెప్తుంది. మూర్తి, కనకం బాధపడతారు. మా బంధం తెగిపోయింది. మీరు ఇదంతా ఒక పీడకల అనుకుని మర్చిపోండి అని లోపలికి వెళ్లిపోతుంది. కావ్యకు ఘన స్వాగతం పలకడానికి అన్ని రెడీ చేస్తుంటారు.
సుభాష్: ఏం చేస్తున్నారు అపర్ణ
అపర్ణ: ఈరోజు మన రాజ్ ఓడిపోతున్నారు కదండి.
సుభాష్: మరి ఓడిపోయేవాడికి హారతి ఇవ్వడం ఏంటి..?
అపర్ణ: కాదండి గెలిచి ఇంటికి తిరిగి వచ్చే కోడలుకు హారతి ఇవ్వాలని రెడీ చేస్తున్నాను.
ఇందిర: ఏంటి రాజ్ ఓడిపోయాడా..? మన కావ్య గెలిచిందా..?
అంటూ సంతోషంగా మాట్లాడకుంటుండగా.. రుద్రాణి వచ్చి ఏం జరుగుతుంది ఇంట్లో అప్పుడే రాజ్ ఓడిపోయిన్నట్లు మాట్లాడుతున్నారేంటి..? అంటుంది. ఇంతలో రాజ్ ఒక్కడే ఇంటికి వస్తాడు. రాజ్ ను చూసిన అందరూ అదిగో రాజ్ వచ్చాడు. అంటూ బయటకు వెళ్తారు. ఇంతలో ఇవాళ్టీ ఎపిసోడ్ అయిపోతుంది.
ALSO READ: మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!
మరిన్ని చూడండి