AP Village Secretariats: ఆంధ్రప్రదేశ్లో ఐదేళ్ల క్రితం వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన గ్రామ, వార్డు సచివాలయాల భవిష్యత్తుపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. సచివాలయ వ్యవస్థ ప్రక్షాళనకు రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తోంది. గత మూడు నాలుగు నెలలుగా సచివాలయ ఉద్యోగులకు ఎలాంటి విధులు లేకపోవడంతో వాటిని ప్రక్షాళన చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కేవలం పెన్షన్ల పంపిణీ మాత్రమే సచివాలయ సిబ్బంది చేస్తున్నారు. సచివాలయ వ్యవస్థ భవిష్యత్తుపై అందుబాటులో ఉన్న తాజా అప్డేట్ ఇదే..