తాము కేంద్రంలో అధికారంలోకి రాగానే సమ్మక్క సారక్క జాతరను జాతీయ పండుగగా ప్రకటిస్తామని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ హామీ ఇచ్చారు. ములుగు సభలో మాట్లాడిన రాహుల్.. తెలంగాణలో జరగబోయే ఎన్నికల్లో దొరల తెలంగాణకు ప్రజల తెలంగాణకు మధ్య జరుగుతున్నాయని అన్నారు. రాజకీయ పార్టీలు నష్టం జరిగే నిర్ణయాలు తీసుకోవని, లాభ నష్టాలు పక్కన పెట్టి.. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు చేసింది కాంగ్రెస్ అని ఆయన వ్యాఖ్యానించారు. కేసీఆర్ చాలా హామీలు ఇచ్చారని, దళితులకు భూములు ఇస్తా అన్నారు..మోసం చేశారన్నారు. మిమ్మల్ని అడుగుతున్న ఎంత మందికి భూమి వచ్చింది ..? అందరికి ఉద్యోగాలు అన్నారు.. ఇచ్చాడా..? అని ఆయన ప్రశ్నించారు.
అంతేకాకుండా.. ‘కాళేశ్వరం ప్రాజెక్టు లో లక్ష కోట్లు దొంగిలించారు. డబుల్ బెడ్ రూమ్ ఎంత వరకు వచ్చాయి. లక్ష రుణమాఫీ రైతులకు ఇచ్చాడా ..? కర్ణాటక.. చత్తీస్ ఘడ్ .. రాజస్థాన్ లో ఇచ్చిన హామీలు ఆమలు చేశాం. రాజస్థాన్ లో ఉచిత వైద్యం ఇస్తామని..25 లక్షల వరకు ఉచిత వైద్యం ఇస్తుంది రాజస్థాన్. రాజస్థాన్ లో వరికి మద్దతు ధర ఎక్కువ ఇస్తున్నాం. కర్ణాటకలో ఇచ్చిన ఐదు గ్యారంటీ లు అమలు చేశాం. ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచిత ప్రయాణం చేస్తున్నారు. కావాలంటే వెళ్లి చూడండి. మేము ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం. పోడు భూములు మీ హక్కు.. పోడు భూములు మీవి..మీకు ఇస్తాం.. అసైన్డ్ భూములు మీవి మీకు ఇస్తాం.. అడవి భూములు హక్కు లు ఇచ్చింది కాంగ్రెస్.. సమ్మక్క సారలమ్మ జాతర జాతీయ ఉత్సవాలు గా చేస్తాం.. కుంభమేళా తరహాలో సమ్మక్క సారలమ్మ గిరిజన ఉత్సవాలు జాతీయ స్థాయిలో గుర్తిస్తాం..
బీజేపీ తెలంగాణ లో ఒడిపోయింది.. బీజేపీ.. బీఆర్ఎస్ గెలవాలని కోరుకుంటుంది.. ఎంఐఎం కూడా వీళ్లిద్దరి తో కలిసి ఉంది. బీజేపీ ఏం కోరితే.. పార్లమెంట్ లో రైతు చట్టాలకు మద్దతు పలికింది బీఆర్ఎస్. జీఎస్టీకి మద్దతు ఇచ్చింది. గుర్తు పెట్టుకోండి. కాంగ్రెస్ ని ఓడించడం కోసం బీజేపీ..బీఆర్ఎస్.. ఎంఐఎం ఒక్కటి అయ్యాయి. కేసీఆర్ మీద ed కేసు లేదు..సీబీఐ కేసు లేదు. కనీసం ఐటీ నోటీసు కూడా లేదు. ప్రతిపక్ష నేతలపై కేసులు పెట్టింది మోడీ. నాపై కేసులు పెట్టారు.. ఎంపీ సీటు లేకుండా చేయాలని చూశారు. బీఆర్ఎస్ కి ఓటు వేస్తే..బీజేపీ ఓటు వేసినట్టే. గుర్తు పెట్టుకోండి. కాంగ్రెస్‌కి మద్దతు పలకండి.’ అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.