Homeవినోదంకలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: పండు దగ్గర మాట తీసుకున్న లక్ష్మీ.. యమున సహస్రకి మాటిస్తుందా

కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: పండు దగ్గర మాట తీసుకున్న లక్ష్మీ.. యమున సహస్రకి మాటిస్తుందా


Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode యమున మీద సొంత వాళ్లే కుట్ర చేయడం తెలుసుకున్న లక్ష్మీ తానే యమునను కాపాడుకోవాలని అందుకైనా తనని వదిలి వెళ్లనని అనుకుంటుంది. కనకం వెనకే విహారి నిల్చొని ఉంటాడు. దగ్గరకు వెళ్లి చూడబోతే నర్స్ విహారిని పిలుస్తుంది. దాంతో విహారి అటు తిరిగే సరికి లక్ష్మీ విహారిని చూసి అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఇక విహారి వినాయకుడి దగ్గరకు వెళ్లి లక్ష్మీ వల్లే తన తల్లికి ప్రమాదం తప్పిందని దేవుడితో చెప్పుకోవడం లక్ష్మీ వింటుంది. 

విహారి: లక్ష్మీ అమ్మకి రెండు సార్లు కాపాడింది. ఇప్పుడొకసారి నేను లక్ష్మీకి చాలా రుణ పడిపోయాను. లక్ష్మీకి థ్యాంక్స్ చెప్పాలి. 
పండు: ఇంటి దగ్గర.. లక్ష్మమ్మ గుండెను తొలిచేసిన బాధ లోపల ఉన్నా పైకి బాధ చూపించడం లేదు కదమ్మా. నీ మెడలో తాళి కట్టిన వాడు వేరు మనిషితో నిశ్చితార్థం చేయించుకుంటూ పెళ్లికి సిద్ధమైన నీకు బాధ అనిపించడం లేదామ్మా.
లక్ష్మీ: బాధ ఉన్నా తగ్గించే మందు లేదు పండు అన్న. నేను ఏదో జన్మలో చేసుకున్న అదృష్టం వల్ల ఏడడుగులు వేసుకున్నా ఈ జన్మకి అది చాలు. నా వల్ల విహారి బాబుకి నా తల్లిదండ్రులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోవాలి అదే నా ఆశ. ఇప్పుడు వాళ్లు ఏ నమ్మకంతో ఉన్నారో వాళ్లని జీవితాంతం అదే నమ్మకంలో ఉంచుతా. అన్న నీకు తెలిసిన ఈ నిజం ఎవరికీ చెప్పనని మాటివ్వు.

పండు మాట ఇవ్వడం చారుకేశవ చూస్తాడు. పండుని పిలిచి మీరిద్దరూ ఇక్కడేం చేస్తున్నారని అడుగుతాడు. నిశ్చితార్థం గురించి మాట్లాడుతున్నానని పండు చెప్తాడు. అవన్నీ మీకు ఎందుకని పని వాళ్లు పని వాళ్లులా ఉండండి అని అంటాడు. మరోవైపు అంబిక సుభాష్‌ని కలుస్తుంది. సుభాష్‌ చేతికి కట్టు ఉండటం చూసిన అంబిక ఏమైందని అని అడిగితే ప్రాజెక్ట్ ఇవ్వలేదు డబ్బు ఇవ్వలేదు కాబట్టి వాళ్లు కొట్టి వెళ్లిపోయారని అంటాడు. వాళ్లు రేపో మాపో మీ ఇంటికి వచ్చి విహారిని నిలదీసేలా ఉన్నారని అప్పుడు మన నిజస్వరూపం తెలిసిపోతుందని అంటాడు. దాంతో అంబిక వాళ్లకి ఫోన్ చేసి సుభాష్ మీద ఎందుకు దాడి చేశారని అడుగుతుంది. ఢీల్ చేసింది అంబిక తప్పకుండా ఇస్తుందని అంటాడు. నెల రోజులు గడువు ఇస్తున్నామని ఈలోపు ప్రాజెక్ట్ అయినా డబ్బు అయినా ఇవ్వమని అంటాడు. విహారి అన్ని బిజినెస్‌ల్లో ఇన్వాల్వ్ అయితే అంతే సంగతి అని అంబికి అంటుంది. విహారిని పైకి పంపేయాలను అనుకుంటారు. అందుకు ఏదో ఒకటి చేయాలని అంటుంది. 

లక్ష్మీ యమున దగ్గరకు వెళ్లి ఇక నుంచి నేనే ట్యాబ్లెట్స్ ఇస్తానని  అంటుంది. ఏం కావాలి అన్నా నన్ను మాత్రమే అడగమని అంటుంది. దాంతో యమున ఇంకా ఎవరినీ అడగొద్దా ఎందుకు ఏమైంది అని అడుగుతుంది. లక్ష్మీ కవర్ చేస్తుంది. ఇంతలో కాదాంబరి, సహస్ర అక్కడికి వస్తారు. కాదాంబరి యమునతో పని దాని మాటలు వినడం తెలుసుకానీ ఇంట్లో సక్రమంగా నడుచుకోవడం తెలీదని తమరి వల్ల నిశ్చితార్థం ఆగిపోయిందని అంటుంది. ఇక పెళ్లి చేసే ఉద్దేశం ఉందా లేదా చెప్పమని అంటుంది. ఆ పెళ్లి కోసం నేను ఎంతో ఎదురు చూస్తున్నానని యమున అంటుంది. సహస్ర మాత్రం తేనే పూసిన మాటలు బాగానే చెప్తున్నారు కానీ సమయానికి బాగానే ఇబ్బంది పెడుతున్నారని అంటుంది. మీ వల్ల నా ఆశలన్నీ నాశనం అయిపోయానని అంటుంది. నిశ్చితార్థం ఆగిపోవడానికి మీరే కారణం అని అంటుంది. అందరూ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేక ఇబ్బంది పడ్డానని అంటుంది. ఈ సారి ఎలాంటి అడ్డు రానివ్వను దగ్గరుండి నేనే నిశ్చితార్థం జరిపిస్తాను అని మాటివ్వమని సహస్ర యమునని అడుగుతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read:  సత్యభామ సీరియల్: సత్యకి గన్ గురి పెట్టిన రుద్ర.. నందినిని గదిలో లాక్ చేసి హర్షతో మైత్రి రొమాన్స్!

మరిన్ని చూడండి



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments