Homeవినోదంకలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: విహారి, సహస్రల నిశ్చితార్థంలో కనకం పెళ్లి ఫోటో..!

కలవారి కోడలు కనకమహాలక్ష్మీ సీరియల్: విహారి, సహస్రల నిశ్చితార్థంలో కనకం పెళ్లి ఫోటో..!


Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode కనకం తన తల్లిదండ్రులతో మాట్లాడి అబద్దాలు చెప్పున్నందుకు చాలా ఫీలవుతుంది. నిన్ను మోసం చేస్తున్నాననే అపరాధ భావం తట్టుకోలేకపోతున్నానని ఏడుస్తుంది. మీ అల్లుడితో జీవితం పంచుకునే అదృష్టం సహస్రకే సొంతమని అనుకుంటుంది. ఇక విహారి, సహస్రల నిశ్చితార్థానికి అన్ని ఏర్పాట్లు పూర్తి అవుతాయి. కుటుంబం మొత్తం ఒక్క దగ్గర ఉండి అందరికీ స్వాగతం పలుకుతారు. 

వచ్చిన వాళ్లు యమునను పొగుడుతారు. అది విన్న పద్మాక్షి కోపంతో రగిలిపోతుంది. యమున కోరుకోవడం వల్లే విహారి పెళ్లికి ఒప్పుకున్నాడని లేదంటే ఈ క్షణం చెప్పినా పెళ్లి ఆపేస్తాడని భక్తవత్సలం అంటారు. యమునను పొగడటం విన్న పద్మాక్షి అక్కడి నుంచి వచ్చేస్తుంది. యమున మంచి తనం అనే ముసుగుతో అందర్నీ భలే మోసం చేస్తుందని అనుకుంటుంది. అంబిక ఏమైందని అడిగితే అందరూ యమునను పొడగటం తనకు నచ్చడం లేదని అంటుంది. 

అంబిక: అక్కా యమున వదినా అమాయక ముఖం చూసి తను గొప్పదని అందరూ అనుకుంటున్నారు. అంతే
పద్మాక్షి: జనాల పిచ్చి తనం ఏంటో కానీ ఒక్కోక్కరు వచ్చి యమునను అంతతగా పొడుగుతుంటే నేను తట్టుకోలేకపోతున్నా. అసలు అది నా పక్కన నిల్చొంటేనే నాకు కంపరంగా ఉంది.
అంబిక: అక్కా కూల్ మనం తనని అసహ్యించుకుంటున్నా ఏం చేయలేం ఎందుకంటే తన వెనక విహారి ఉన్నాడు.
పద్మాక్షి: ఏమో అంబికి యమున అది ఈ ఇంట్లో ఓ పెద్ద మనిషిలా తిరుగుతుంటే నాకు చిరాకుగా ఉంది. నా కూతురి ఫంక్షన్‌లో తిరుగుతుంటే తట్టుకోలేకపోతున్నా. అది తాగే కూల్ డ్రింక్‌లో రెండు నిద్ర మాత్రలు కలిపి ఇచ్చేద్దాం ఈ ఫంక్షన్ అయిన వరకు అది మనకు కనిపించకూడదు.
అంబిక: అది నేను చూసుకుంటా అక్క. డోంట్ వర్రీ.

పంతులు విహారిని తీసుకురమ్మని అంటాడు. ఇక  పంతులు నీరు పడిపోయావని పండుని పిలిచి న్యూస్ పేపర్ తీసుకురమ్మని అంటాడు. మరోవైపు ఇంట్లో ఉన్న న్యూస్ పేపర్లకు ఫ్యాన్ గాలి తగిలి ఎగిరిపోతాయి. అందులో విహారి, కనకం పెళ్లి ఫొటో కనిపిస్తుంది. మరోవైపు విహారితో తాతయ్య, నానమ్మలు పూజ చేయిస్తారు. యమున నవ్వుతూ ఉండటం చూసి పద్మాక్షి అంబికతో ఏదో ఒకటి చేయ్ దాన్ని అలా చూస్తూ ఉండలేను అంటుంది. మరోవైపు పద్మాక్షి లక్ష్మీ ట్యాబ్లెట్స్ యమున వేసుకోలేదని వాటిని తీసుకొని బయల్దేరుతుంది. అంబిక లక్ష్మీకి అడ్డుపడి తాను ఇస్తానని తీసుకెళ్తుంది. మందులు వేయడానికి తీసుకెళ్తున్న నీటిలో ఎవరూ చూడకుండా మత్తు మందు కలిపేస్తుంది. వాటిని తీసుకొని యమునకు ఇస్తుంది. యమున ఆ నీటిని తాగేసి మందులు వేసుకుంటుంది. అంబిక చాలా సంతోష పడుతుంది. కాసేపట్లో ఓ మూలన పడుంటావని అనుకుంటుంది. పద్మాక్షితో ప్లాన్ సక్సెస్ అని అనుకుంటుంది. 

మరోవైపు లక్ష్మీ విహారి గారు చాలా మంచి వారని ఆయనకు సాయం చేయడం తప్ప మరేం తెలీదని అలాంటి వ్యక్తి కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారని ఏ ఆటంకం రాకుండా చూడమని దేవుడికి దండం పెట్టుకుంటుంది. ఇక విహారి డ్రస్ మార్చుకోవడానికి వెళ్తాడు. అప్పుడు తన చేతిలోని కంకనం పడిపోతుంది. మరో వైపు సహస్ర వస్తుంటుంది తన ఫ్రెండ్స్ సిగ్గు పడమని ప్రాక్టీస్ చేయమంటే సహస్ర రకరకాలుగా ట్రై చేస్తుంది. వాళ్లు సెటైర్లు వేస్తుంది. అయితన విహారి, సహస్రల పెళ్లి యాడ్ ఇచ్చిన పేపర్ సహస్ర దగ్గరే ఉంటుంది. కానీ సహస్ర అది చూడదు. ఇక సహస్రతో కూడా పూజ చేయిస్తారు. మరోవైపు యమునకు కళ్లు తిరుగుతాయి.దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: అమ్మాయి గారు సీరియల్: సూర్యప్రతాప్‌ని ఓడించడానికి చేతులు కలిపిన శత్రువులు.. రూప చేతిలో నామినేషన్ పేపర్లు!

మరిన్ని చూడండి



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments