Homeస్పెషల్ స్టోరీబౌలింగ్‌లో వరుణ్, అర్షదీప్ మెరుపులు - మొదటి టీ20లో భారత లక్ష్యం ఎంతంటే?

బౌలింగ్‌లో వరుణ్, అర్షదీప్ మెరుపులు – మొదటి టీ20లో భారత లక్ష్యం ఎంతంటే?


IND Vs BAN 1st Innings Highlights: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న మొదటి టీ20 మ్యాచ్‌లో భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. దీంతో బంగ్లాదేశ్ జట్టు 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 105 పరుగులకే పరిమితం అయింది. బంగ్లాదేశ్ బ్యాటర్లలో మెహదీ హసన్ మిరాజ్ (35 నాటౌట్: 32 బంతుల్లో, మూడు ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, అర్షదీప్ సింగ్ మూడేసి వికెట్లు పడగొట్టాడు. భారత జట్టు విజయానికి 120 బంతుల్లో 128 పరుగులు చేయాలి.

బౌలింగ్ తీసుకున్న భారత్…
ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మొదట బౌలింగ్ తీసుకున్నాడు. కెప్టెన్ నిర్ణయానికి బౌలర్లు చక్కగా న్యాయం చేశారు. ముఖ్యంగా అర్షదీప్ సింగ్ తన వరుస ఓవర్లలో ఓపెనర్లు పర్వేజ్ హుస్సేన్ ఎమాన్ (8: 9 బంతుల్లో, ఒక సిక్సర్), లిట్టన్ దాస్‌లను (4: 2 బంతుల్లో, ఒక ఫోర్) అవుట్ చేసి బంగ్లాదేశ్‌ను కష్టాల్లోకి నెట్టాడు.

ఆ తర్వాత కూడా బంగ్లాదేశ్ కష్టాలు గట్టెక్కలేదు. తౌహిద్ హృదయ్ (12: 18 బంతుల్లో, రెండు ఫోర్లు), మహ్మదుల్లా (1: 2 బంతుల్లో), జాకీర్ అలీలను (8: 6 బంతుల్లో, ఒక ఫోర్) భారత బౌలర్లు కేవలం మూడు ఓవర్ల వ్యవధిలో అవుట్ చేశారు. దీంతో బంగ్లాదేశ్ కేవలం 57 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది. అనంతరం బంగ్లాదేశ్ జట్టు కెప్టెన్ నజ్ముల్ హొస్సేన్ శాంటో (27: 25 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్), మెహదీ హసన్ మిరాజ్ (35 నాటౌట్: 32 బంతుల్లో, మూడు ఫోర్లు) కలిసి ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టే ప్రయత్నం చేశారు. ఆరో వికెట్‌కు 18 పరుగులు జోడించిన అనంతరం నజ్ముల్ హొస్సేన్ శాంటోను వాషింగ్టన్ సుందర్ పెవిలియన్ బాట పట్టించారు.

ఈ దశలో రిషద్ హుస్సేన్ (11: 5 బంతుల్లో, ఒక ఫోర్, ఒక సిక్సర్), టస్కిన్ అహ్మద్‌లతో (12: 13 బంతుల్లో, ఒక ఫోర్) కలిసి మెహదీ హసన్ చివర్లో కొన్ని విలువైన పరుగులు జోడించాడు. దీంతో బంగ్లాదేశ్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి పరుగులు చేసింది. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, అర్షదీప్‌ సింగ్‌లకు మూడేసి వికెట్లు దక్కాయి. మిగిలిన బౌలర్లలో హార్దిక్ పాండ్యా, మయాంక్ యాదవ్, వాషింగ్టన్ సుందర్ తలో వికెట్ పడగొట్టారు.

బంగ్లాదేశ్ తుది జట్టు
లిట్టన్ దాస్ (వికెట్ కీపర్), పర్వేజ్ హుస్సేన్ ఎమాన్, నజ్ముల్ హొస్సేన్ శాంటో, తౌహిద్ హృదయ్, మహ్మదుల్లా, జాకీర్ అలీ, మెహదీ హసన్ మిరాజ్, రిషద్ హొస్సేన్, టస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, షోరిఫుల్ ఇస్లామ్

భారత్ తుది జట్టు
అభిషేక్ శర్మ, సంజు శామ్సన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), నితీష్ కుమార్ రెడ్డి, హార్దిక్ పాండ్యా, రియాన్ పరాగ్, రింకూ సింగ్, వాషింగ్టన్ సుందర్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, మయాంక్ యాదవ్

మరిన్ని చూడండి





Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments