ఎంఎస్ ధోని..రిషభ్ పంత్. ఇద్దరూ ఇద్దరే. ధోని తన ఐడల్ అని తన స్ఫూర్తితోనే వికెట్ కీపర్ గా మారానని చాలా సార్లు చెప్పిన రిషభ్ పంత్ ఇప్పుడు ధోని రికార్డును సమం చేశాడు. బంగ్లాదేశ్ తో చెన్నై లో జరుగుతున్న మొదటి టెస్ట్ మూడోరోజు సెంచరీ బాదిన రిషభ్ పంత్ గిల్ తో కలిసి టీమిండియాను తిరుగులేని స్థితికి చేర్చాడు. రెండో ఇన్నింగ్స్ లో భారత్ 67పరుగులకే 3వికెట్లు పడిపోయిన దశలో గిల్ తో కలిసిన రిషభ్ పంత్..మరో వికెట్ పోనివ్వకుండానే టీమిండియా ను పటిష్ఠ స్థితికి చేర్చాడు. రోహిత్, కొహ్లీ, జైశ్వాల్ అయిపోయిన ఇంపాక్ట్ ను జట్టు పై పడకుండా ఇద్దరూ సెంచరీలు బాదేశారు. 176బంతుల్లో గిల్ 119 పరుగులు చేస్తే తనదైన స్టైల్ లో
ఆడిన రిషభ్ పంత్ 128బంతుల్లో 109పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. గిల్ కి ఇది ఐదో సెంచరీ అయితే పంత్ కి ఇది ఆరో సెంచరీ. ఈ క్రమంలో టెస్టు క్రికెట్ లో ఆరు సెంచరీలు చేసిన వికెట్ బ్యాటర్ గా ఉన్న ధోని రికార్డును పంత్ సమం చేశాడు. ధోని 144 ఇన్నింగ్సుల్లో ఆరు సెంచరీలు కొడితే…పంత్ 58 ఇన్నింగ్స్ ల్లోనే ఆరు సెంచరీలు కంప్లీట్ చేసి గురువు రికార్డును సమానం చేశాడు. పంత్, గిల్ ధాటికి 4వికెట్ల నష్టానికి 287 పరుగులు చేసిన భారత్ ఆ స్కోరుకే డిక్లేర్ చేసి..బంగ్లాదేశ్ కు 515 పరుగుల టార్గెట్ ఇచ్చింది. ఇంకా రెండు రోజుల సమయం ఉన్నందున బంగ్లాదేశ్ ఏం చేస్తుందో చూడాలి.
క్రికెట్ వీడియోలు
Pant Equals MS Dhoni Test Centuries | ఎంఎస్ ధోని సెంచరీల రికార్డును సమం చేసిన పంత్ | ABP Desam
మరిన్ని చూడండి