Homeవినోదంమత్తు వదలరా 2 ఫస్ట్ డే కలెక్షన్స్... సాలిడ్ ఓపెనింగ్ రాబట్టిన శ్రీ సింహా, సత్య...

మత్తు వదలరా 2 ఫస్ట్ డే కలెక్షన్స్… సాలిడ్ ఓపెనింగ్ రాబట్టిన శ్రీ సింహా, సత్య – ఎన్ని కోట్లంటే


హిలేరియస్ బ్లాక్ బస్టర్ థ్రిల్లర్ మత్తు వదలరా 2 మూవీ మంచి బజ్ తో థియేటర్లలోకి వచ్చింది. అయితే చిన్న సినిమానే అయినప్పటికే ఫస్ట్ డే బాక్స్ ఆఫీస్ దుమ్ముదులిపేసింది కలెక్షన్ల పరంగా. సాలిడ్ కలెక్షన్ తో హిట్ దిశగా దూసుకెళ్తున్న ఈ సినిమా మొదటి రోజు ఎన్ని కోట్లు కొల్లగొట్టిందో ఒక లుక్కేద్దాం పదండి. 

మత్తు వదలరా 2 స్ట్రాంగ్ ఓపెనింగ్ 

కీరవాణి తనయుడు శ్రీ సింహ కోడూరి హీరోగా నటించిన మోస్ట్ అవైటింగ్ మూవీ ‘మత్తు వదలరా 2’. ఇందులో ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటించగా… సత్య, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషించారు. రితేష్ రాణా దర్శకత్వంలో తెరకెక్కిన మత్తు వదలరా 2 సెప్టెంబర్ 13 న థియేటర్లలోకి వచ్చింది. అంతకంటే ముందు మేకర్స్ ప్రమోషన్ల ద్వారా సినిమాపై మంచి హైప్ ని క్రియేట్ చేశారు. టీజర్, ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. అంతే కాకుండా జక్కన్న కూడా సినిమా ప్రమోషన్లలో పాలు పంచుకోవడంతో చిన్న సినిమానే అయినప్పటికీ అంచనాలు పెరిగాయి. కానీ మరోపక్క ఐదేళ్ల క్రితం వచ్చిన కామెడీ ఎంటర్టైనర్ మత్తు వదలరా మూవీకి సీక్వెల్ గా వస్తున్న మత్తు వదలరా 2 ఆ రేంజ్ లో ఉంటుందా? అనే అనుమానాలు కూడా ఉన్నాయి. వాటన్నింటికి ఫస్ట్ షో నుంచే సమాధానం దొరికింది. మూవీకి ప్రీమియర్స్ నుంచే పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్స్ పరంగా అదరగొట్టింది ఈ మూవీ. క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ మైత్రీ మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వారు సొంతంగా రిలీజ్ చేశారు.

తాజాగా చిత్రబృందం ఈ మూవీకి ఫస్ట్ డే ప్రపంచవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్స్ పై అఫిషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చింది. మత్తు వదలరా 2 మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ. 5.3 కోట్లు వసూలు చేసింది. అయితే మూవీకి పెట్టిన బడ్జెట్ పరంగా చూసుకుంటే ఒక చిన్న సినిమాకు ఈ రేంజ్ ఓపెనింగ్ అనేది విశేషమే. మొత్తానికి ఫస్ట్ డే సాలిడ్ ఓపెనింగ్ రాబట్టిన మత్తు వదలరా 2 ఈ వీకెండ్ భారీగా వసూళ్లు రాబట్టే అవకాశం ఉంది. 

Also Read: SSRMB29 స్టోరీ లీక్‌ – 18వ శతాబ్దం కాలంలోకి మహేష్‌ బాబు, హైదరాబాద్‌లో భారీ సెట్‌

మూవీకి కలిసి వచ్చిన లాంగ్ వీకెండ్  

ఈ చిత్రం అంతర్జాతీయంగా కూడా మంచి రెస్పాన్స్ ను దక్కించుకుంటోంది. మత్తు వదలరా 2 ఓవర్సీస్ లోనూ అడ్వాన్స్ బుకింగ్ లో అదరగొట్టింది. అలాగే అమెరికాలో మొదటి రోజు $300Kని అధిగమించి, మిలియన్ దిశగా పరుగులు తీస్తోంది. పాజిటివ్ బజ్, మౌత్ టాక్ తో మత్తు వదలారా 2 మొదటి వారాంతంలో హాఫ్ మిలియన్ వసూలు చేస్తుందని, పూర్తి రన్‌లో ఒక మిలియన్ డాలర్ల మార్కును చేరుకుంటుంది అని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల్లో 5 రోజుల లాంగ్ వీకెండ్ కలిసి రాబోతోంది. సెప్టెంబర్ 13 నుంచి 18 తేదీల వరకు పలు పండగల కారణంగా వచ్చిన హాలిడేస్ తో సినిమా కలెక్షన్స్ మరింత పుంజుకునే ఛాన్స్ ఉంది. 

Also Readఅన్నయ్యా… అన్నయ్యా… అన్నయ్యా… నీది మాములు విలనిజం కాదన్నయ్యా… ఎస్.జె. సూర్య బెస్ట్ విలన్ రోల్స్‌

మరిన్ని చూడండి





Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments