Homeఅంతర్జాతీయంఢిల్లీలో రోడ్లపై నడవడం అంత ప్రమాదకరమా? రాత్రి 9 నుంచి 2 గంటల వరకు అసలు...

ఢిల్లీలో రోడ్లపై నడవడం అంత ప్రమాదకరమా? రాత్రి 9 నుంచి 2 గంటల వరకు అసలు బయటకు రావద్దా?


Road Accidents Reports: ఇటీవల ఢిల్లీ గవర్నమెంట్‌ విడుదల చేసిన యాక్సిడెంట్ల స్టాటిస్టిక్స్ రాజధాని వాసులను నివ్వేర పరుస్తున్నాయి. 2022లో ఢిల్లీలో నిలువరించగలిగిన యాక్సిడెంట్ల కారణంగా ప్రతి రోజూ నలుగురు లెక్కన మృత్యు వాత పడుతున్నట్లు ప్రభుత్వం తెలిపింది. గతేడాది అంటే 2023లో ఈ సంఖ్య మరింతగా పెరిగిందని రిపోర్టులు చెబుతున్నాయి. 2022లో ఢిల్లీ రోడ్లపై యాక్సిడెంట్లలో మరణించిన వారిలో 50 శాతం మంది పాదచారులేనని తెలిపింది. ఇక మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్‌లో 45 శాతం మంది టూవీలర్స్‌ లేదా త్రీ వీలర్స్ ఉపయోగిస్తున్న వాళ్లు. కార్లు లేదా భారీ వాహనాల్లో ప్రయాణిస్తూ మృత్యువాత పడుతున్న వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. 2022 ఇయర్‌కు సంబంధించిన రోడ్‌ యాక్సిడెంట్ స్టాటిస్టిక్స్‌ను బుధవారం నాడు ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ డిపార్ట్‌మెంట్ విడుదల చేసింది. ఆ సంవత్సరంలో రోడ్లపై 15 వందల 17 యాక్సిడెంట్లు జరగగా.. అందులో 15 వందల 71 మంది మరణించారు. అంటే రోజుకు నలుగురు చొప్పున రోడ్డు ప్రమాదాల్లో మరణించారు. అంతకు ముందు ఏడాది 2021తో పోల్చితే ప్రమాదాలు 28 శాతం ఎక్కువగా నమోదైనట్లు రిపోర్టు చెబుతోంది. ఈ 15 వందల 71 మరణాల్లో 97 పర్సెంట్‌ మరణాల్లో పాదచారులు, బైక్‌ రైడర్లు, ఆటో రిక్షాలు వినియోగిస్తున్న వాళ్లే ఉన్నారు. నేషనల్ యావరేజ్‌తో పోల్చితే ఢిల్లీలోనే యాక్సిడెంట్లు ఎక్కువ జరుగుతున్నట్లు నివేదిక తెలిపింది.

రోడ్లపై చనిపోతున్న వారిలో ఎక్కువ మంది మగవాళ్లే:

2022వ ఏడాదిలో ఢిల్లీ రోడ్లపై జరిగిన ప్రతి 100 మరణాల్లో పురుషులవి ఎనభై తొమ్మిది శాతం ఉన్నట్లు అధికారులు తెలిపారు. పదకొండు శాతం మహిళలు ఉన్నారు. ఈ మగవాళ్లలో కూడా ఎక్కువగా ముప్ఫై నుంచి ముప్ఫై తొమ్మిది సంవత్సరాల వయస్సలోని వారే ఉండడం ఆందోళన కలిగించే అంశం. వీక్‌డేస్‌తో పాటు వారాంతంలో కూడా ఎక్కువగా యాక్సిడెంట్లు చోటుచేసుకుంటున్నాయని.. అందునా రాత్రి  9 గంటల నుంచి వేకువ జామున 2 గంటల మధ్య అత్యధికంగా ప్రమాదాలు చోటుచేసుకొని బాధితులు చనిపోతున్నట్లు గణాంకాలు వివరిస్తున్నాయి. రాత్రిళ్లు అధిక వేగంతో వెహికల్స్ నడపడం సహా యాక్సిడెంట్ చేసి బాధితులను పట్టించుకోకుండా వెళ్తున్న హిట్‌ అండ్ రన్‌ కేసుల కారణంగా కూడా ఫెటలిటీస్‌ ఎక్కువ నమోదవుతున్నట్లు తెలిపారు. శని, ఆదివారాలతో పాటు సోమవారాల్లో కూడా ఎక్కువగా రోడ్లపై ప్రాణాలు కోల్పోతున్నట్లు నివేదిక చెబుతోంది. చనిపోయిన వారిలో  పాదచారులు 57 శాతం, టూ వీలర్ పై వెళ్తున్న వాళ్లు 37 శాతం మంది ఉంటున్నారు. ఢిల్లీలో హిట్‌ అండ్ రన్ కేసులు సగటున ఏడాదిలో 260 ఉండగా.. వెస్ట్‌ డిస్టిక్స్‌లో 160 వరకు నమోదవుతున్నాయి. ఫుట్‌పాత్‌లు అధికంగా ఉండడం రోడ్లు దాటడానికి జీబ్రా క్రాసింగ్ వంటి సదుపాయాలు సరిపడ లేకపోవడం వల్ల ఎక్కువ మంది పాదచారులు రోడ్లు దాటే క్రమంలో చనిపోతున్నారని అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రమాదాల్లో మరణించిన వారిలో ఎక్కువ మంది ఆ కుటుంబాలకు బ్రెడ్ ఎర్నర్స్‌గా ఉన్నారు. వీరి మరణాలతో ఆ కుటుంబాలు రోడ్డున పడుతున్నట్లు నివేదిక వెల్లడించింది.

Also Read: మళ్లీ గోడమీదకు చేరిన నితీశ్‌ కుమార్! తలుపులు తెరిచేది లేదన్న లాలూ

మరిన్ని చూడండి



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments