JioTV+ యొక్క ముఖ్య ఫీచర్లు:
- ఒకే సైన్ ఇన్ తో రెండు టీవీల్లో 13 కి పైగా ఓటీటీ కంటెంట్ ను చూడవచ్చు.
- ఓటీటీలు, చానల్స్ మధ్య నావిగేషన్ కోసం స్మార్ట్ రిమోట్ కంట్రోల్.
- మీ ప్రాధాన్యతల ఆధారంగా, మీరు చూసే కంటెంట్ ను పరిశీలించి, మీకు నచ్చే కంటెంట్ ను సిఫారసు చేస్తుంది.
- సులభంగా కోరుకున్న కంటెంట్ చూసేలా సెర్చ్ ఆప్షన్స్. వాయిస్ అసిస్ట్ సెర్చ్ కూడా చేయవచ్చు.
- ప్లేబ్యాక్ వేగాన్ని సర్దుబాటు చేయడానికి, గతంలో ప్రసారమైన షోలను చూడటానికి వినియోగదారులను అనుమతిస్తుంది.
వివిధ ప్లాన్లలో..
ఈ సర్వీసులు అన్ని జియో ఎయిర్ ఫైబర్ ప్లాన్లలో అందుబాటులో ఉంది. జియో ఫైబర్ (JioFiber) పోస్ట్‌పెయిడ్ కస్టమర్ల కోసం, ఇది రూ. 599 రూ. 899 లేదా అంతకంటే ఎక్కువ ప్లాన్లలోఅందుబాటులో ఉంది. JioFiber ప్రీపెయిడ్ వినియోగదారుల కోసం, ఈ సేవ రూ. 999 లేదా అంతకంటే ఎక్కువ ప్లాన్లలో అందుబాటులో ఉంది. JioTV+ యాప్ ద్వారా అందించే ఛానెల్‌లు, ఓటీటీల్లో కలర్స్ టీవీ, స్టార్ ప్లస్, జీ టీవీ వంటి ప్రముఖ నెట్‌వర్క్‌లు ఉన్నాయి. అదనంగా, Disney+ Hotstar, SonyLIV, Zee5 వంటి అగ్ర OTT ప్లాట్‌ఫారమ్‌లు చేర్చబడ్డాయి.