WhatsApp new update: ఇన్స్టాగ్రామ్ స్టోరీలకు యూజర్లు ఎలా లైక్ చేయవచ్చో అదే విధంగా వాట్సాప్ స్టేటస్ లను ‘లైక్’ చేయడానికి వీలు కల్పించే కొత్త ఫీచర్ ను వాట్సాప్ ప్రవేశపెట్టనుంది. వినియోగదారులు అప్ డేట్ చూస్తున్నప్పుడు స్క్రీన్ దిగువ ఎడమ వైపున ఉన్న హార్ట్ ఎమోజీని నొక్కడం ద్వారా స్టేటస్ అప్డేట్ ను లైక్ చేయవచ్చు. వ్యూస్ జాబితాను ఉపయోగించి స్టేటస్ ను ఎవరెవరు లైక్ చేశారో చూడటం కూడా ఇక సాధ్యమవుతుంది. చాటింగ్ ను స్టార్ట్ చేయకుండానే కాంటాక్ట్స్ తో కనెక్ట్ కావడానికి వీలు కల్పించే ఈజీ మార్గం ఇది.