Homeఅంతర్జాతీయంయాంటీ మావోయిస్టు ఆపరేషన్‌లో ట్రాన్స్‌జెండర్ కాప్స్‌- బస్తర్‌ ఫైటర్‌ ఫోర్స్‌లో కఠోర శిక్షణ

యాంటీ మావోయిస్టు ఆపరేషన్‌లో ట్రాన్స్‌జెండర్ కాప్స్‌- బస్తర్‌ ఫైటర్‌ ఫోర్స్‌లో కఠోర శిక్షణ


Anti-Maoist Operations In Chhattisgarh: మావోయిస్టులకు అడ్డగా ఉన్న బస్తర్‌ ప్రాంతంలో పోరాడే బృందాల్లో ట్రాన్స్‌జెండర్లను కూడా నియమించుకున్నారు. బస్తర్ ఫైటర్ ఫోర్స్‌లోకి తీసుకొని వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. సాధారణ పోలీసులతో కలిసి ఈ తొమ్మిది మంది దట్టమైన అడవిలోకి వెళ్లి మావోయిస్టులతో ఫైట్ చేయనున్నారు. బస్తర్ ఫైటర్స్‌ టీంలో మొత్తం 90 మంది మహిళలు ఉంటే వారిలో 9 మంది ట్రాన్స్‌జెండర్‌ కాప్‌లు ఉన్నారు. 

బస్తర్ కంచుకోట 
ఛత్తీస్‌గఢ్‌లో ఉన్న బస్తర్ అటవీ ప్రాంతం మావోయిస్టులకు కంచుకోటలా ఉంది. దట్టమైన అడవిని బేస్‌ చేసుకొని తమ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు మావోయిస్టులు. వాళ్లను ఎదుర్కోవడానికి పోలీసులు, ప్రభుత్వాలు చేయలని ప్రయత్నం లేదు. ఆధునిక సాంకేతితను కూడా ఉపయోగిస్తున్నారు. 

ఫైటర్స్ టీంలోకి ట్రాన్స్ జెండర్స్‌
మావోయిస్టులపై అవిశ్రాంతంగా పోరాటం చేస్తున్న ఫైటింగ్ టీంలోకి ఇప్పుడు ట్రాన్స్‌జెండర్స్‌ కూడా చేరారు. కాంకేర్‌ జిల్లాకు చెందిన 8 మందిని ఎంపిక చేసి ఈ టీంలో చేర్చుకున్నారు పోలీసులు. వాళ్లకు ఇప్పుడు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. అడవిలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి. ప్రతికూల పరిస్థితులను ఎలా ఎదర్కోవాల్సి ఉంటుందనే విషయాలపై తర్ఫీదు ఇస్తున్నారు.  

కఠోర శిక్షణ
దట్టమైన అడవిలో మావోయిస్టుల కోసం గాలించడం, వారితో పోరాడటం అనేది అంత సింపుల్ టాస్క్ కాదు. దీనికి కఠోర శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి టఫ్‌ టాస్క్‌ను టేకప్ చేస్తున్నారు ట్రాన్స్ జెండర్స్‌. తుపాకులు పట్టుకొని కేంద్ర బలగాలతోపాటు పరుగెత్తాలి. చెట్లు కింద పుట్ల కింద బస చేయాల్సి ఉంటుంది. ప్రమాదం ఎటు నుంచి వస్తుందో తెలియక నిత్యం అప్రమత్తంగా ఉండాలి 

అనేక అనుమానాలు 
ట్రాన్స్‌జెండర్లు ఫైర్‌ ఫైటర్‌ ఫోర్స్‌కు ఎంపికైనప్పుడు వారితోపాటు శిక్షణ ఇచ్చే పోలీసులకు కూడా చాలా అనుమానాలు ఉండేవి. అలు కఠినంగా ఉండే శిక్షణను వీళ్లు ఎంత వరకు తట్టుకోగలరు. శిక్షణ పూర్తి అయ్యే వరకు ఉంటారా లేదా అనే అనుమానం చాలా మందిలో ఉండేది. అయితే అందరి అంచనాలు తారుమారు చేస్తూ సాధారణ శిక్షణ పూర్తి చేసి పోలీస్‌ ఫోర్స్‌లోకి వచ్చారు. 

రెడీ అంటున్న ట్రాన్స్‌జెండర్స్
ఇప్పుడు వారికి మావోయిస్టు ప్రాంతాల్లో ఎదుర్కోవాల్సిన సమస్యలు, అడవిలో ఎలా ఉండాలి. దాడులు జరిగే టైంలో ఎలా అటాక్ చేయాల్సి ఉంటుంది. మావోయిస్టు కదలికను ఎలా గుర్తించాలనే విషయాలపై మరింత కఠిన శిక్షణ ఇస్తున్నారు. మొదట సెంట్రీ విధులు నిర్వహించారు. తర్వాత మావోయిస్టులతో పోరాడే దళంలోకి ఎంపిక అయ్యారు. శిక్షణ తీసుకుంటున్న ట్రాన్స్‌ జెండర్స్ అడవిలోకి వెళ్లి పోరాడేందుకు సిద్ధంగా ఉన్నారని కంకేర్‌ ఎస్పీ చెబుతున్నారు. 

పోలీసు శాఖలోకి రావడమే సంచలనం
అసలు లింగమార్పిడి వ్యక్తులను పోలీసుల శాఖలోకి తీసుకురావడమే పెద్ద సంచలనం. 2022-23లో నిర్వహించిన రిక్రూట్‌మెంట్లో వీళ్లను పోలీసు శాఖలోకి ఎంపిక చేసి చరిత్ర సృష్టించి ప్రభుత్వం. దాదాపు 21 మంది ఇలా పోలీసుల శాఖలోకి వచ్చిన ట్రాన్స్‌ జెండర్స్ బస్తర్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో విధులు నిర్వహించారు. వీరిలో ఉత్సహాంగా కాస్త దృఢంగా ఉన్న వారిని ఎంపిక చేసి మావోయిస్టులపై పోరాడే టీంలోకి తీసుుకున్నారు. అలాంటి వాళ్లే దివ్య నిషాద్, సీమా ప్రధాన్, సాను.

చాలా నేర్చుకున్నాను: దివ్య
బస్తర ప్రాంతంలో విధులు నిర్వహిస్తున్న 8 మంది కూడా మావోయిస్టు ఆపరేషన్‌ గురించి అవగాహన ఉంది. అందుకే ఈ శిక్షణ వీళ్లకు కాస్త ఈజీగానే ఉందని చెబుతున్నారు. బస్తర్‌లో ఓ పోలీస్ స్టేషన్‌లో సెంట్రీగా విధులు నిర్వహించే 25 ఏళ్ల దివ్యకు ఈ మావోయిస్టు ఆపరేషన్ శిక్షణ పెద్ద కష్టంగా లేదుంటున్నారు. అప్పుడప్పుడు అడవిలో కూంబింగ్‌కు వెళ్లేదానిని అంటున్నారు.  బరువై బ్యాగ్, వెపన్స్‌తో అన్నీ గమనిస్తూ అడవిలో తిరగడం తనకు అలవాటైపోయిందని చెబుతున్నారు. ఫైరింగ్‌లో కూడా బాగా ట్రైనింగ్ తీసుకున్నానని వివరించారు. అడవిలో సైగలతో సంభాషణ కూడా నేర్చుకున్నట్టు తెలిపారు.  

అడుగు వేస్తే భయం వేసే: దివ్య
బీఎస్‌ఎఫ్‌తో అబుజ్‌మడ్‌ అడవుల్లో తిరుగుతున్నప్పుడు మొదట్లో భయం వేసేదని చెప్పారు దివ్య. ఒక్కో అడుగు ముందుకు వేస్తున్న కొద్దీ ప్రాణం పోయేంత పని అయ్యేదని అంటున్నారు. మనం వేసే అడుగు కింద ఏ ప్రమాదమైన దాగి ఉండొచ్చు. ఏదో వైపు నుంచి తూటాల దూసుకురావచ్చు. లేదా మనల్ని అమాంతం లేపేసి చిద్రం చేసే ల్యాండ్‌మైన్స్ ఉండొచ్చు. అని తలచుకుంటే వణుకు పుట్టేదని చెప్పారు. ఇప్పుడు అవి అలవాటైపోయాయని చెప్పుకొచ్చారు. 

వారితో వెళ్లగలమా అనే అనుమానం ఉండేది: హిమాన్షి
దివ్యతో పని చేసే హిమాన్షి ఎక్స్‌పీరియన్స్‌ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంది. సెర్చ్ ఆపరేషన్ కోసం  భద్రతా దళాలతో కలిసి కాలినడకన 3-4 కొండలను దాటాల్సి ఉంటుంది. అది థ్రిల్లింగ్‌గానే ఉంటుందని చెబుతున్నారు హిమాన్షి. ఇలాంటి ఆపరేషన్స్‌కు తాము సరిపోగలమా… తమను తీసుకుంటారా అనే అనుమానాలు ఉండేవట. వారిని తీసుకొని ట్రైనింగ్ ఇవ్వడంతో ఆ డౌట్స్‌ క్లియర్ అయ్యాయి అంటున్నారు. 

సిగ్గుగా అనిపించింది: సీమా
మొదట్లో బలగాలతో తిరగడంతో కొన్ని విషయాలు చెప్పడం సిగ్గుగా ఉండేదని చెబుతున్నారు సీమా ప్రధాన్. రానురాను అలవాటైపోయిందని వివరిస్తున్నారు. ఇప్పుడు సహచరులతో చాలా నార్మల్‌గానే మాట్లాడుతున్నామని చెప్పుకొచ్చారు.  

కఠిన శిక్షణ : ఎస్పీ
ఆపరేషన్‌ టైంలో రోజుల తరబడి అడవిలో ఉండిపోవాల్సి ఉంటుంది. ఎలాంటి సౌకర్యాలు లేకుండా కేవలం కాస్త తింటూ ఆపరేషన్ కొనసాగించాల్సి ఉంటుంది. ఇలాంటి టైంలో ఎలా సర్వైవ్ అవ్వాలి… రాత్రిపూట అడవిలో ఉంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రత్యర్థులు ఎలా అటాక్ చేస్తారు లాంటి వాటిపై ట్రాన్స్‌ జెండర్స్‌కు శిక్షణ ఇస్తున్నట్టు తెలిపారు బస్త్‌ ఎస్పీ.  

బస్తర్‌ ఫైరట్స్ కింద నియాకం జరుగుతుంటేనే దేని కోసం తీసుకున్నామో వాళ్లకు తెలుసు. అలా తెలియడంతో రిక్రూట్ అయిన వాళ్లు దేనికైనా సిద్ధంగా ఉంటారని ఎల్సెలా చెప్పారు.

ప్రస్తుతం మొదటి బ్యాచ్ పోలీసులు GPS, వైర్‌లెస్ సెట్‌లు, ఆయుధ నిర్వహణ, ట్రెక్కింగ్‌ సహా వివిధ విభాగాల్లో శిక్షణ పొందుతున్నారు. డీఆర్‌జీ కమాండర్లు, పోలీసులు వారికి తర్ఫీదు ఇస్తున్నారు. ట్రాన్స్‌ జెండర్స్ ట్రైనింగ్ క్యాంపులో ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నామని పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు. వారి ప్రాధాన్యతలు తెలుసుకొని ప్రొవైడ్ చేస్తున్నామని వివరిస్తున్నారు. అయితే అడవిలో మాత్రం ప్రతిదీ అందరికీ ఒకేలా ఉంటుందని తెలిపారు.

మరిన్ని చూడండి



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments