Again Aishwarya Rai and Abhishek Bachchan Rumour Goes Viral:అనంత్ అంబానీ పెళ్లితో ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్‌ల విడాకుల వ్యవహరం బయటపడిందా? అంటే అవునే సమాధానాలు గట్టిగా వినిపిన్నాయి. పెళ్లిలో ఐశ్వర్య, అభిషేక్‌ల తీరు చూసి వీరిద్దరు విడిపోయారంటూ గుసగుసలాడుకుంటున్నారు. ఇంతకి అసలు సంగతి ఎంటంటే.. ప్రస్తుతం దేశమంత అంబానీ ఇంట పెళ్లి గురించి మాట్లాడుకుంటుంది. ముఖేష్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ-రాధిక మర్చంట్‌ల వివాహం నిన్న జూలై 12న అంగరంగ వైభవంగా జరింగింది.
ఘనంగా అనంత్ అంబానీ పెళ్లి..
జూలై 3 నుంచి మొదలైన ఈ పెళ్లి వేడుకల్లో బాలీవుడ్ సెలబ్రిటీలంతా హంగామా చేశారు. ఇక శుక్రవారం జరిగిన పెళ్లికి ఇండియన్ మూవీ సెలబ్రిటీలంతా హాజరై సందడి చేశారు. నార్త్ నుంచి సౌత్ వరకు స్టార్ సెలబ్రిటీలంతా హాజరయ్యారు. టాలీవుడ్ నుంచి మహేష్ బాబు ఫ్యామిలీ, విక్టరీ వెంకటేష్, రామ్ చరణ్ ఉపాసన దంపతులు వెళ్లారు. ఇక అంబానీ ఇంట ఎలాంటి వేడుక ఏదైనా బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ తప్పకుండ హజరవుతుంది. తాజాగా బచ్చన్ ఫ్యామిలీ మొత్తం అనంత్ -రాధిక వివాహానికి హజరయ్యారు. అయితే ఇక్కడ ఎంతోకాలంగా క్లారిటీ లేని ఓ అంశంపై స్పష్టత వచ్చిందంటున్నారు నెటిజన్లు.
కూతురు ఆరాధ్యతో ఒంటరిగా పెళ్లికి హాజరు
అదే ఐశ్వర్యరాయ్, అభిషేక్ బచ్చన్ విడాకులు. కొంతకాలంగా ఐశ్వర్య రాయ్, అభిషేక్ బచ్చన్‌ల డైవోర్స్ రూమర్స్ హాట్‌టాపిక్‌గా నిలిచాయి.వారిద్దరు విడిపోతున్నారంటూ తరచూ గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ రూమర్స్‌పై బచ్చన్ కపుల్ ఎప్పుడ స్పందించలేదు. కానీ, ఫ్యామిలీతో కలిసి దిగిన ఫోటోలు షేర్ చేస్తూ డైవోర్స వార్తలకి చెక్ పెట్టే ప్రయత్నం చేశారు. కానీ, తాజా అనంత్ అంబానీ వెడ్డింగ్‌లో జరిగిన ఓ సంఘటనతో మరోసారి ఐశ్వర్య రాయ్-అభిషేక్ విడాకులు వార్తల్లో నిలిచాయి. దీని కారణం.. ఐశ్వర్య బచ్చన్ ఫ్యామిలీతో కలిసి రాకపోవడమే. కుటుంబ సమేతంగా వచ్చిన అమితాబ్ బచ్చన్ ఫ్యామిలీ ఫోటోల్లో ఐశ్వర్య రాయ్, ఆమె కూతురు ఆరాధ్య మిస్ అయ్యారు. అంతేకాదు భార్య,కూతురు వెంట అభిషేక్ కూడా కనిపించలేదు.
#WATCH | Actor Aishwarya Rai Bachchan along with her daughter Aaradhya Bachchan arrive for Anant Ambani-Radhika Merchant wedding at Jio World Convention Centre in Mumbai pic.twitter.com/1VeCtuhe5O
— ANI (@ANI) July 12, 2024
బచ్చన్ ఫ్యామిలీతో కనిపించని ఐష్, ఆరాధ్య
ఫోటోలు కూడా వేరువేరుగా దిగారు. మొదట ఐశ్వర్య ఆరాధ్యలు రాగా.. సపరేట్‌గా కెమెరాలకు ఫోజులు ఇచ్చారు. ఆ తర్వాత అమితాబ్ తన భార్య జయ బచ్చన్, కూతురు, మనవరాలు, మనవడితో పాటు అభిషేక్ బచ్చన్‌తో వచ్చారు. వీరంతా కలిసి ఫ్యామిలీగా ఫోటోలు దిగారు. కానీ.. ఐశ్వర్య ఆరాధ్యలు మాత్రం వారితో కనిపించలేదు. ఒకే పెళ్లికి హాజరై కూడా వేరు వేరుగా రావడంతో అందరి దృష్టి బచ్చన్ ఫ్యామిలీపైనే మీదే పడింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంకేముంది ఐశ్వర్య-అభిషేక్ బచ్చన్‌ల విడాకులపై మరోసారి చర్చ మొదలైంది. వీరి వ్యవహరం చూస్తుంటే విడిపోయినట్టుగానే ఉన్నారని నెటిజన్లు తెల్చేస్తున్నారు. వీరిద్దరు విడిపోయారనడానికి ఇదే ప్రూఫ్ అంటున్నారు. మరి ఈసార ఐశ్వర్య-అభిషేక్ నుంచి ఎలాంటి క్లారిటీ వస్తుందో చూడాలి. డైవోర్స్‌ని తెల్చేస్తారా? లేక మరో ఫ్యామిలీ పిక్ షేర్ చేసి అందరిని కూల్ చేస్తారా? వెయిట్ అండ్ సీ.
Also Read: ఫ్యామిలీ, మహిళా ఆడియన్స్‌కి ఐమాక్స్ బంపర్ ఆఫర్ – ఒక టికెట్ కొంటే మరో టికెట్ ఫ్రీ, కానీ..
మరిన్ని చూడండి