Homeవినోదం'టిల్లు స్క్వేర్’ టీమ్‌ను ఇంటికి పిలిచి మరీ అభినందించిన చిరంజీవి - ఇది ‘అడల్ట్’ కాదు,...

‘టిల్లు స్క్వేర్’ టీమ్‌ను ఇంటికి పిలిచి మరీ అభినందించిన చిరంజీవి – ఇది ‘అడల్ట్’ కాదు, అందరూ చూడొచ్చు!


Megastar Chiranjeevi congratulated ‘Tillu Square’ Team: టాలీవుడ్ యంగ్ హీరో సిద్ధు జొన్నలగడ్డ, రింగుల జుట్టు ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ హీరో, హీరోయిన్లుగా తెరకెక్కిన తాజాగా చిత్రం ‘టిల్లు స్క్వేర్’. దర్శకుడు మల్లిక్ రామ్ ఈ సినిమాను తెరకెక్కించారు. మార్చి 29న ఈ రొమాంటిక్ కామెడీ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బ్లాక్ బస్టర్ ‘డీజే టిల్లు’కు సీక్వెల్ గా వచ్చిన ఈ చిత్రంపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ప్రేక్షకుల ఎక్స్ పెక్టేషన్స్ కు తగినట్టుగానే ఈ సినిమా అద్భుతంగా ఆకట్టుకుంటోంది. తొలి షో నుంచే ఈ చిత్రంపై పాజిటివ్ టాక్ లభించింది. సిద్ధు నేచురల్ యాక్టింగ్, అదిరిపోయే పంచులు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించాయి.

మూడు రోజుల్లో రూ. 68 కోట్లు వసూళు

బాక్సాఫీస్ దగ్గర ‘టిల్లు స్క్వేర్’ సినిమా ఓ రేంజిలో సత్తా చాటుతోంది. ఈ సినిమా విడుదలైన అన్ని చోట్లా థియేటర్ల ముందుక హౌస్ ఫుల్ బోర్డులు దర్శనం ఇస్తున్నాయి. ఇక ఈ సినిమా విడుదలైన మూడు రోజుల్లో ఏకంగా రూ. 68 కోట్లకు పైగా గ్రాస్ వసూళు చేసింది. ఈ వీకెండ్ లోగా రూ. 100 కోట్లు సాధించే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.  

‘టిల్లు స్క్వేర్’ చిత్రబృందాన్ని అభినందించిన మెగాస్టార్

తాజాగా ‘టిల్లు స్క్వేర్’ సినిమాను చూసిన మెగాస్టార్ చిరంజీవి.. చిత్రబృందంపై ప్రశంసలు కురిపించారు. సినిమా అద్భుతంగా ఉందని చెప్పడంతో పాటు ఇంటికి పిలిపించి మరీ అభినందించారు. “’టిల్లు స్క్వేర్’ సినిమా చూశాను. నాకు బాగా నచ్చింది. టీమ్ ను అభినందించాలని ఇంటికి పిలిచాను. సిద్ధు అంటే ఇంట్లో వాళ్లుందరికీ ఇష్టం. ‘డీజే టిల్లు’ తర్వాత చాలా రోజులకు ‘టిల్లు స్క్వేర్’ చేశారు. చూస్తే వావ్ అనిపించింది. ఫస్ట్ సినిమా హిట్ అయిన తర్వాత రాబోయే సినిమా మీద అంచనాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వాటిని అందుకోవాలంటే చాలా కష్టపడాలి. ఆ రేర్ ఫీట్ ను సక్సెస్ ఫుల్ గా సాధించింది ‘టిల్లు స్క్వేర్’ టీమ్. చాలా సరదాగా, చాలా ఉత్కంఠగా, నవ్వులు పూయించే ఈ సినిమా బాగా ఆకట్టుకుంది. చిత్రబృందం సమిష్టి కృషి వల్లే ఇది సాధ్యం అయ్యింది. ఈ సినిమా వెనుక సిద్దు ఒక్కడై ఉండి నడిపించాడు. నటుడిగా, కథకుడిగా మంచి ప్రతిభ కనబర్చాడు. మనస్ఫూర్తిగా అతడిని అభినందిస్తున్నాను. ఇది అడల్ట్ కంటెంట్, యూత్ కు మాత్రమే అనుకుంటున్నారు. యూనివర్సల్ గా అందరికీ నచ్చే కంటెంట్ ఉన్న సినిమా. నేను బాగా ఎంజాయ్ చేశాను. మీరు కూడా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను” అని మెగాస్టార్ చిరంజీవి వెల్లడించారు.


‘టిల్లు స్క్వేర్’ మూవీని ఫార్చూన్ ఫోర్ సినిమాస్, సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మించారు. శ్రీ చరణ్ పాకాల, రామ్ మిరియాల, థమన్ మ్యూజిక్ ఇచ్చారు. నేహా శెట్టి, ప్రిన్స్, మురళీధర్, మురళీ శర్మ కీలక పాత్రలు పోషించారు.

Read Also: వాళ్లు నన్ను ఏ పని చేసుకోనివ్వడం లేదు, ఇంట్లో గొడవలు కూడా జరుగుతున్నాయి: చిరంజీవి

మరిన్ని చూడండి





Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments