Homeఅంతర్జాతీయంఢిల్లీలో నడిరోడ్డుపై దారుణం, యువతిని నాలుగైదుసార్లు కత్తితో పొడిచి పరారీ

ఢిల్లీలో నడిరోడ్డుపై దారుణం, యువతిని నాలుగైదుసార్లు కత్తితో పొడిచి పరారీ


Viral Video: ఢిల్లీలోని ముఖర్జీ నగర్‌లో దారుణం జరిగింది. ఓ వ్యక్తి యువతిపై దాడి చేసి కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు. అక్కడే ఉన్న CC కెమెరాలో ఈ విజువల్స్ రికార్డ్ అయ్యాయి. ఈ దాడిలో ఆమెకి గాయాలయ్యాయి. ప్రస్తుతానికి ఆమెకి చికిత్స కొనసాగుతోంది. ప్రాణాపాయం ఏమీ లేదని వైద్యులు వెల్లడించారు. నిందితుడి వివరాలు సేకరించిన పోలీసులు పట్టుకునేందుకు అన్ని చోట్లా గాలిస్తున్నారు. ఆమెపై దాడి చేసిన వెంటనే అక్కడి నుంచి పారిపోయాడు నిందితుడు. రోడ్లపై బలాదూర్‌గా తిరుగుతున్నాడని విద్యార్థులు పదేపదే నిందితుడిని వెక్కిరించారు. ఎప్పటి నుంచో కక్ష పెంచుకున్న అమన్…వాళ్లపై దాడి చేయాలనుకున్నాడు. ముఖర్జీనగర్‌లో లైబ్రరీలో చదువుకునేందుకు వచ్చిన యువతిపై దాడి చేశాడు. పక్కనే కూరగాయల షాప్‌లో నుంచి కత్తి తీసుకొచ్చి పొడిచాడు. అటుగా వెళ్లే వాళ్లు వెంటనే అప్రమత్తమై నిందితుడిని అడ్డుకున్నారు. నాలుగైదు సార్లు పొడిచాడు. బాధితురాలు అక్కడే మెట్లపై పడిపోయింది. ఆ తరవాత నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. బాధితురాలిని స్థానికులు వెంటనే హాస్పిటల్‌కి తరలించారు. ఆమె ఆరోగ్యం ప్రస్తుతానికి నిలకడగానే ఉందని వైద్యులు వెల్లడించారు. 

మరిన్ని చూడండి





Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments