Homeవినోదం‘విశ్వంభర’ సెట్స్‌లో అడుగు పెట్టిన మెగాస్టార్, రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్

‘విశ్వంభర’ సెట్స్‌లో అడుగు పెట్టిన మెగాస్టార్, రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్


Viswambhara Release Date Locked: మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘విశ్వంభర’.  ‘బింబిసార’ ఫేమ్ వశిష్ట ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం అయ్యింది. సోషియో ఫాంటసీ కథాంశంతో  పాన్ ఇండియా రేంజిలో తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. సంక్రాంతి కానుకగా విడుదల చేసిన ఈ మూవీ టైటిల్ ఆడియో ప్రేక్షకులలో మరింత క్యూరియాసిటీ పెంచేసింది. యూవీ క్రియేషన్స్ సంస్థ ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. ఈ సినిమా కోసం మెగా అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

‘విశ్వంభర’ రిలీజ్ డేట్ ప్రకటించిన మేకర్స్

తాజాగా ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ కీలక ప్రకటన చేశారు. వచ్చే సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఇప్పటికే ప్రకటించగా, తాజాగా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. వచ్చే ఏడాది (2025), జనవరి 10కి ఈ సినిమాను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. మరోవైపు మెగాస్టార్ చిరంజీవి ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అయినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఓ పోస్టర్ ను రిలీజ్ చేశారు. మండుతున్న అగ్నిగోళం నుంచి చిరంజీవి బయటకు వస్తున్నట్లు ఉన్న షాడోను చూపించారు. ఈ పోస్టర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది.

జిమ్ లో శ్రమిస్తున్న చిరంజీవి 

‘విశ్వంభర’ మూవీలో హనుమాన్ పాత్ర కీలకంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. మూడు లోకాలకు సంబంధించిన కథను ఇందులో చూపించే అవకాశం ఉంది. టైటిల్ గ్లింప్స్ ఇదే విషయాన్ని వెల్లడిస్తోంది. ఈ సినిమాలో చిరంజీవి భీమవరం దొరబాబుగా కనిపిస్తారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ ప్రతిష్టాత్మక చిత్రం కోసం చిరంజీవి కూడా చాలా కష్టపడుతున్నారు. ఈ సినిమా కోసం జిమ్ లో ప్రత్యేకంగా వర్కౌట్స్ చేస్తున్నారు. ఈ చిత్రంలోని యాక్షన్ సన్నివేశాల కోసం తన బాడీని ప్రిపేర్ చేసుకుంటున్నారు. తాజాగా ఆయన జిమ్ లో వర్కౌట్స్ చేస్తున్న వీడియో సైతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. ఈ ఏజ్ లో ఆయన పడుతున్న కష్టాన్ని చూసి అభిమానులు వారెవ్వా అంటున్నారు.  

‘విశ్వంభర’ చిత్రంలో మృణాల్ ఠాకూర్?

మరోవైపు ‘విశ్వంభర’ చిత్రంలో ‘సీతారామం’ బ్యూటీ మృణాల్ ఠాకూర్ కీలక పాత్ర పోషించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే, ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఈ సినిమాతో పాటు చిరంజీవి మరో సినిమా చేస్తున్నారు. తన కూతురు సుష్మిత గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్ మెంట్స్‌ బ్యానర్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. మలయాళం సూపర్ హిట్ మూవీ ‘బ్రో డాడీ’కి రీమేక్ గా రూపొందుతున్నట్లు తెలుస్తోంది. ఇక చిరంజీవి చివరగా ‘బోళాశంకర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా అనుకున్న స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

Read Also: ‘డెవిల్’ వీడియో సాంగ్: గ్లామర్ డోస్ పెంచేసిన బిగ్ బాస్ శుభశ్రీ – లిప్ లాక్స్, హాట్ సీన్స్‌తో షాకిచ్చిన బిగ్ బాస్ బ్యూటీ

మరిన్ని చూడండి





Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments