లాస్ట్ డేట్
ఈ పోస్ట్ లకు జనవరి 20వ తేదీ నుంచి ఫిబ్రవరి 19వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డ్ నుంచి 10వ తరగతి లేదా తత్సమాన విద్యార్హత సాధించి ఉండాలి. దాంతో పాటు, ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఇన్‌స్ట్రుమెంట్ మెకానిక్, మిల్‌రైట్/ మెయింటెనెన్స్ మెకానిక్, మెకానిక్ ట్రేడ్‌లలో గుర్తింపు పొందిన ఎన్‌సీవీటీ/ఎస్‌సీవీటీ సంస్థల నుండి ఐటిఐ సర్టిఫికేట్ కలిగి ఉండాలి. లేదా మెట్రిక్యులేషన్ తో పాటు డిటైల్డ్ నోటిఫికేషన్‌లో పేర్కొన్న ట్రేడ్‌లలో యాక్ట్ అప్రెంటిస్‌షిప్ పూర్తి చేసి ఉండాలి.