జనం కోసం

నీ బానిస కాను నేను
తొత్తు కొడుకు నసలే కాదు
నా ఇష్టం వచ్చినట్లు
నా మనసుకు నచ్చినట్టు
మాట్లాడుతా, రాస్తా, ప్రకటిస్తా
నరుడు నేను, నరుడ నేను
మనిషి బ్రతుకు బ్రతుకుతాను
నా మతమును ప్రకటిస్తా
అది నా స్వతసిద్ధమైన హక్కు
జన్మ హక్కు
ఆ మాత్రం లేకుండా
నే బ్రతికెందుకు“

జనం ప్రాథమిక హక్కును గుర్తు చేసిన కవి మన కాళోజి గారు. ఆయనే స్ఫూర్తి గా మేము జనంకోసం అనే తెలుగు వెబ్ న్యూస్ మరియు డైలీ న్యూస్ పేపర్ తో మీ ముందుకు వస్తున్నాము.
సమాజం లోని రుగ్మతలను వేర్లతో పీకివేసి జనానికి ప్రాథమిక హక్కులపట్ల స్పష్టమైన అవగాహ కలిగిస్తూ రాజకీయాల్లోని డొల్ల తనాని తీవ్రంగా ఎండకాడుతుంది మీ జనంకోసం