who is to pay Advance tax: ఎవరు చెల్లించాలి?
ఆదాయ పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 208లో పేర్కొన్న విధంగా, గత సంవత్సరం టీడీఎస్ (TDS) ను లెక్కించిన తర్వాత, రూ. 10,000 లేదా అంతకంటే ఎక్కువ పన్ను చెల్లించాల్సి ఉన్న వ్యక్తులు, అడ్వాన్స్ టాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ అడ్వాన్స్ టాక్స్ చెల్లించని వ్యక్తులపై వడ్డీతో పాటు జరిమానా విధిస్తారు. ఆదాయ పన్ను చట్టంలోని సెక్షన్ 234బీ, 234 సీ ప్రకారం ఈ వడ్డీ నెలకు 1% ఉంటుంది. అయితే, వ్యాపారం లేదా వృత్తి నుంచి ఎలాంటి ఆదాయం లేని సీనియర్ సిటిజన్లు ముందస్తు పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.