Homeస్పెషల్ స్టోరీనాంపల్లిలో మజ్లిస్‌కు గట్టిపోటీ - ఫిరోజ్ ఖాన్ చరిత్ర సృష్టిస్తారా?

నాంపల్లిలో మజ్లిస్‌కు గట్టిపోటీ – ఫిరోజ్ ఖాన్ చరిత్ర సృష్టిస్తారా?


Telangana Elections 2023 :  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గట్టిపోటీ జరిగే నియోజకవర్గాలు చాలా ఉన్నాయి. వాటిలో నాంపల్లి ఒకటి. ఇక్కడ  బీఆర్ఎస్ అభ్యర్థి ఉన్నా .. పెద్దగా పోటీ ఇచ్చే పరిస్థితి లేదు. పైగా ఇది మజ్లిస్ సిట్టింగ్ సీటు. కానీ కాంగ్రెస్ మాత్రం గట్టి పోటీ ఇస్తోంది. వరుసగా మూడు సార్లు ఓడిపోయిన ఫిరోజ్ ఖాన్ ఈ సారి గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు. 

మజ్లిస్‌కు గట్టి పోటీ ఇస్తున్న ఫిరోజ్ ఖాన్ 

మజ్లిస్‌ పార్టీకి కంచుకోటగా ఉన్న నాంపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్‌ అభ్యర్థి మహ్మద్‌ ఫిరోజ్‌ఖాన్‌ గట్టి పోటీ ఇస్తున్నారు.   మూడు  సార్లు గట్టి పోటీ ఇచ్చి ఓడిపోయారు.   ఎంఐఎం పార్టీకి నాంపల్లి నియోజకవర్గం అత్యంత ప్రతిష్టాత్మకమైంది. ఉమ్మడి రాష్ట్రంలో 2009లో జరిగిన ఎన్నికల్లో ఎంఐఎంకు నాంపల్లి నియోజకవర్గంలో గెలుపు ఓ సవాల్‌గా మారింది. ఆ పార్టీ అభ్యర్థి మహ్మద్‌ విరాసత్‌ రసూల్‌ ఖాన్‌ ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసిన మహ్మద్‌ ఫిరోజ్‌ ఖాన్‌పై కేవలం 6,799 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. తర్వాత ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనం అయింది. అయితే మజ్లిస్ ఒత్తిడితో కాంగ్రెస్ ఫిరోజ్ ఖాన్ కు టిక్కెట్ ఇవ్వలేదు. దాంతో ఫిరోజ్ ఖాన్ టీడీపీలో చేరారు.   టీడీపీ తరఫున బరిలోకి దిగి మరోసారి గట్టి పోటీ ఇచ్చారు. తర్వాత కాంగ్రెస్ లో చేరారు.  2018లో  పోటీ చేశారు. కానీ మూడో సారి కూడా పరాజయమే ఎదురయింది.  

ఓటర్ల జాబితాలో కీలక మార్పులు                         

ఈ నియోజకవర్గంలో భారీగా బోగస్‌ ఓట్లు ఉన్నాయని  ఫిరోజ్‌ఖాన్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులు పట్టించుకోకపోతే  కోర్టు మెట్లు ఎక్కారు.  ఓటర్‌ కార్డును ఆధార్‌తో లింక్‌ చేసే కార్యక్రమానికి అధికారులు శ్రీకారం చుట్టడడంతో వేల సంఖ్యలో బోగస్‌ ఓట్లు తొలగిపోయాయి.   ఈ సారి నాంపల్లిలో విజయం కష్టమని భావించిన ఎంఐఎం అభ్యర్థిని మార్చి కొత్త ముఖాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఓవైసీ సైతం ఈ నియోజకవర్గంలో ప్రచారం మొదలు పెట్టారు.   కాంగ్రెస్‌ తరఫున మరో మారు బరిలో నిలిచిన ఫిరోజ్‌ఖాన్‌ ఈ సారి విజయం సాధిస్తారని, మొదటి సారి ఎంఐఎంకు ఓటమి తప్పదని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. 

ఫిరోజ్ ఖాన్ పై సానుభూతి                             

వరుసగా మూడు సార్లు ఓడిపోయిన సానుభూతితో పాటు మజ్లిస్ పట్ల వ్యతిరేకత పెరగడం వల్ల ఇక్కడ కాంగ్రెస్ కు మంచి  చాన్స్ ఉందన్న ప్రచారం జరుగుతోంది. అభ్యర్థిపై వ్యతిరేకత ఉన్నట్లుగా స్పష్టం కావడంతో ఓవైసీ .. మరో భ్యర్థికి చాన్సిచ్చారు.   మూడు సార్లుగా విజయం దరిదాపుల్లోకి వచ్చి వెళ్తున్న ఫిరోజ్‌ఖాన్‌పై అక్కడి ఓటర్లలో సానుభూతి ఉండడంతో ఈ సారైన ఆయన విజయం అందుకుంటారా? అని పార్టీ నేతలు ఆసక్తిగా గమనిస్తున్నారు. మజ్లిస్ ను ఓడిస్తే.. పాతబస్తీ రాజకీయాల్లో కొత్త శకం ప్రారంభమవుతుందని అంచనా వేస్తున్నారు.         

ఎలక్షన్ ఫాంటసీ గేమ్ ను ఆడండి. 10వేల రూపాయల విలువైన గాడ్జెట్లు పొందండి. 🏆

*T&C Apply

               



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments