Homeవినోదంబూతుల విషయంలో శివాజీపై నాగ్ ఫైర్ - అలాంటి పదాలు బ్యాన్ అంటూ సీరియస్ వార్నింగ్

బూతుల విషయంలో శివాజీపై నాగ్ ఫైర్ – అలాంటి పదాలు బ్యాన్ అంటూ సీరియస్ వార్నింగ్


ఈవారం బిగ్ బాస్ సీజన్ 7లో ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం కంటెస్టెంట్స్ అంతా పోటీపడ్డారు. అది ముగిసిన తర్వాత కెప్టెన్సీ కోసం పోటీ మొదలయ్యింది. కానీ ఈ వారమంతా కంటెస్టెంట్స్ సమానంగా ఆటతీరును చూపించలేకపోయారు. దీంతో నాగార్జున.. వారిపై చాలా సీరియస్ ఉన్నారు. వీకెండ్ ఎపిసోడ్ వచ్చిందంటే ముందుగా కంటెస్టెంట్స్ చేసిన తప్పుల గురించి బయటపెట్టే నాగార్జున.. ఈసారి వారు చేసిన తప్పులకు కాస్త సీరియస్‌గానే రియాక్ట్ అయ్యారు. ఇక నేడు ప్రసారం కానున్న ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో తాజాగా విడుదలయ్యింది. అందులో ఎపిసోడ్ మొదలవ్వగానే కంటెస్టెంట్స్‌ను కనీసం నవ్వుతూ కూడా విష్ చేయలేదు నాగ్.

హౌజ్‌లో వాడే పదాలు కాదు..
ముందుగా నాగార్జున సీరియస్ ఫేస్‌తో ఈ ప్రోమో మొదలయ్యింది. ‘‘సీసా తల మీద బద్దలగొట్టి చెప్పాల్సిన విషయాలు చాలా ఉన్నాయి’’ అంటూ ఒక్కొక్కరి ఫోటోపై సీసా పగలగొడుతూ.. వారు చేసిన తప్పులను చెప్పడం మొదలుపెట్టారు. ముందుగా శివాజీతో ‘‘నాకు కొన్ని చాలా సమస్యలు ఉన్నాయి’’ అన్నారు నాగార్జున. ‘‘అప్పుడప్పుడు వచ్చే బూతులా?’’ అని అడిగాడు శివాజీ. దానికి అవును అని సమాధానమిచ్చారు నాగ్. ‘‘ఈ విషయంలో నీ అనుభవం ఏమైంది? ఈ విషయంలో నీ సహనం ఏమైంది? ఈ విషయంలో నీ సమర్థత ఏమైంది?’’ అని ప్రశ్నించారు. ‘‘ఎర్రి పోహా, పిచ్చి పోహా.. ఇవన్నీ హౌజ్‌లో వాడే పదాల?’’ అని శివాజీపై ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపించారు నాగ్.

ఆ పదాలు బ్యాన్..
శివాజీ తర్వాత రతికతో తన తప్పుల గురించి మాట్లాడారు నాగార్జున. ‘‘ఈ హౌజ్‌లో కొన్ని పదాలు ఇప్పటినుండి నేను బ్యాన్ చేస్తున్నాను. వచ్చేవారం నుండి నేనేంటో చూపిస్తాను. నేను ఇకపై ఆడతాను. ఈ వ్యాఖ్యలన్నీ బ్యాన్ ఇప్పటినుండి’’ అని రతికకు స్పష్టం చేశారు. ఒకసారి ఎలిమినేట్ అయిపోయి, మళ్లీ సెకండ్ ఛాన్స్‌తో హౌజ్‌లోకి అడుగుపెట్టిన తర్వాత రతిక.. ఈ పదాలు ఉపయోగించని రోజు లేదు. అందుకే మాటలు మానేసి.. ఆటలో తన సత్తా చాటమని నాగార్జున.. రతికతో ఇన్‌డైరెక్ట్‌గా చెప్పారు. ఆ తర్వాత అమర్‌దీప్‌తో నాగ్ డిస్కషన్ మొదలయ్యింది. ‘‘నేను విన్నర్ అనుకోకపోతే నువ్వు విన్నర్ ఎలా అవుతావు?’’ అని అమర్‌దీప్‌ను ప్రశ్నించారు.

చేతిపై బాటిల్ పగలగొట్టుకున్న నాగ్..
ఈ వారం గౌతమ్ పర్ఫార్మెన్స్ గురించి కూడా నాగార్జున మాట్లాడారు. ‘‘చెల్లిల్ని గెలిపించుకోవడం తప్పా నువ్వు ఇంకేమైనా చేశావా?’’ అని గౌతమ్‌ను ప్రశ్నించారు. ఆ తర్వాత పల్లవి ప్రశాంత్‌ను కూడా ‘‘ఈవారం అసలు ఏమైనా ఆడావా?’’ అని అడిగారు. ‘‘ఫ్యామిలీ వీక్‌లో అందరూ వచ్చి నీ పేరు పెట్టారు కదా అని నేను నెట్టుకొచ్చేశాను అనుకున్నావా?’’ అన్నారు. ‘‘అంతేనా లేక ఇంకెవరికైనా అవకాశాలు ఇద్దామని ఆగిపోయావా?’’ అని ఇన్‌డైరెక్ట్‌గా తన ఫ్రెండ్స్‌కు హెల్ప్ చేసిన విషయం గురించి మాట్లాడారు నాగ్. ఆ తర్వాత అశ్విని ఫోటోపై కాకుండా తన చేతిపై బాటిల్‌ను పగలగొట్టుకున్నారు నాగార్జున. ‘‘ప్రియాంక నీ తల మీద కొట్టినప్పుడు ఏదో నీ తల పగిలిపోయినట్టు చేశావు. బిగ్ బాస్ ఆ మాత్రం జాగ్రత్త తీసుకోడా?’’ అని అశ్విని అడిగారు. దానికి ‘‘తల మీద కొంచెం గట్టిగా అయితే అనిపించింది’’ అంటూ సమాధానమిచ్చింది అశ్విని. ‘‘ఇప్పుడు నేను పగలగొట్టి చూపించాను. ఇక్కడ జుట్టు లేదు, ఏమీ లేదు’’ అని నాగ్ వివరించారు. ‘‘ఒకవేళ ఆ బాటిల్‌లో ఏమైనా తేడా ఉందేమో నాకైతే అనిపించింది’’ అంటూ తను చెప్పిన మాటలను సమర్థించుకునే ప్రయత్నం చేసింది అశ్విని. అశ్విని చెప్పిన కారణాలు విని నవ్వుకున్నారు నాగార్జున.

Also Read: విజయ్ దేవరకొండ, రష్మిక ప్రేమను బయటపెట్టిన బాలకృష్ణ!



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments