హైదరాబాద్: టాలీవుడ్ నటుడు అల్లు అర్జున్ ఇంటిపై దాడి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. అల్లు అర్జున్ ఇంటిపై టమోటాలు విసిరి, పూలకుండీలు ధ్వంసం చేసి ఆందోళనకు దిగిన కేసులో నిందితులకు బెయిల్ మంజూరైంది. అల్లు అర్జున్ ఇంటిపై దాడి చేసిన ఓయూ జేఏసీ నేతలను వనస్థలిపురంలోని న్యాయమూర్తి నివాసంలో జూబ్లీహిల్స్ పోలీసులు హాజరు పరిచారు. ఆరుగురు నిందితులకు ఒక్కొక్కరు రూ.10వేల చొప్పున రెండు పూచీకత్తులు సమర్పించాలని ఆదేశిస్తూ న్యాయమూర్తి వారికి బెయిల్ మంజూరు చేశారు.
మరిన్ని చూడండి