NATO Dating Trend : క్లిష్టమైన సమస్యలకు కూడా సింపుల్ సొలుష్యూన్స్ వెతుక్కోవడంలో Gen-Z కిడ్స్ ఎప్పుడూ ముందుగానే ఉంటారు. ఇలా అన్ని విషయాల్లో తమ మార్క్‌ని చూపిస్తూ ఉంటారు. వాటి వల్ల మంచి జరుగుతుందా? చెడు జరుగుతుందా అనేది పక్కన పెడితే.. వారిలోని క్రియేటివిటీకి మాత్రం మెచ్చుకోక తప్పదు. చేసే అన్ని పనుల్లోనూ కొత్త విధానాలు పాటించే Gen-Z కిడ్స్ రిలేషన్స్‌లో కూడా వాటిని అమలు చేస్తున్నారు. రిలేషన్స్‌తో ఇబ్బంది పడే మిలీనియల్స్ కంటే.. కొత్త పరిష్కారాలతో హ్యాపీగా రిలేషన్స్‌ని ముందుకు తీసుకెళ్లడంలో Gen-Z కిడ్స్ ఓ అడుగు ముందే ఉన్నారని చెప్పాలి. తమకి కన్వినెంట్‌గా కొత్త కొత్త డేటింగ్స్ను తెరపైకి తీసుకొస్తున్నారు.
న్యూ డేటింగ్ ట్రెండ్
రిలేషన్స్కి సంబంధించి Gen-Z కిడ్స్ ఎన్నో డేటింగ్ ట్రెండ్స్ తీసుకొచ్చారు. అయితే 2024లో ఓ Gen-Z డేటింగ్ ట్రెండ్ బాగా వైరల్ అవుతుంది. అదే నాటో డేటింగ్. NATO అర్థం ఏమిటంటే Not Attached To An Outcome. అంటే భవిష్యత్తులో ఏమి జరుగుతుందనే చింత లేకుండా ప్రస్తుత క్షణాన్ని హాయిగా ఆస్వాదించడం. ఎవరైనా రిలేషన్లోకి వెళ్తే అమ్మో మా ఇంట్లో ఒప్పుకోరేమో.. అలా జరుగుతుందేమో.. ఇలా అవుతుందేమో అని ఎక్కువ ఒత్తిడికి గురి అవుతారు. అలాంటి భయాలు లేకుండా ఉన్న క్షణాన్ని హ్యాపీగా గడుపుదాము. ఫ్యూచర్‌ని తలచుకుంటూ హ్యాపీ మూమెంట్స్‌ని వదులుకోకూడదనే విధానాన్ని ఈ NATO డేటింగ్ సూచిస్తుంది.
ఎలాంటి ఒత్తిడి లేకుండా
కొత్తగా వచ్చిన ఈ NATO డేటింగ్ వల్ల ఎలాంటి ఒత్తిడి లేకుండా ఇద్దరు కలిసి హ్యాపీగా ఉండొచ్చు. ముందు చూపు ఉండాలి దేనికైనా అనే వాటికి నో చెప్తూ.. ఉన్న సమయాన్ని హ్యాపీగా నచ్చినవారితో ఎంజాయ్ చేయొచ్చు అని చెప్తుంది ఈ ట్రెండ్. ఈ కాలంలో ఒత్తిడి అనేది దాదాపు అందరూ ఎదుర్కొంటున్న సమస్య. కాబట్టి రిలేషన్లో ఎలాంటి ఒత్తిడి లేకుండా Live in the Moment తరహాలో NATO డేటింగ్‌కు వెల్కమ్ చెప్తున్నారు.
ఇప్పటివరకు ఉన్న డేటింగ్ ట్రెండ్స్లలో ఇది కాస్త భిన్నంగానే ఉంది. ఎందుకంటే ఈ డేటింగ్‌లోకి వెళ్లాలంటే ఇద్దరికీ అదే రేంజ్లో మెచ్యూరిటీ ఉండాలి. అప్పుడే ఫ్యూచర్ గురించి ఫికర్ కాకుండా.. తమ రిలేషన్‌ని ఎంజాయ్ చేయగలుగుతారు. లేదంటే ఫ్యూచర్‌ని తలచుకుంటూ.. ఇంట్లో ఒప్పుకోరు అనుకుంటూ.. నచ్చినవారిని వదులుకోలేక ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఈ జెనరేషన్లో చాలామంది లవ్ మ్యారేజ్‌లకు, రిలేషన్లకు సపోర్ట్ చేస్తున్నారు. అదే తరహాలో కొందరు వాటిని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. దీనివల్ల ఒత్తిడి పెంచుకోవడమో.. ఇంట్లో చెప్పకుండా ప్రాణాలు తీసుకోవడమో జరుగుతున్నాయి. ఆ టైమ్ వస్తే జరగాల్సింది జరుగుతుంది. ఇప్పుడెందుకు దాని గురించి ఆలోచించి.. ఉన్న టైమ్‌ని సంతోషంగా గడపకుండా ఉండాలి అనే ప్రశ్న తలెత్తినప్పుడు ఇలాంటి ట్రెండ్స్ తెరపైకి వస్తుంటాయి.
ఈ ట్రెండ్ ఏమి లస్ట్తో కూడుకున్నది కూడా కాదు. రోటీన్ లవర్స్‌లానే ఉంటారు కానీ.. కేవలం చివరికి ఏమవుతుందనే ఆలోచన లేకుండా ప్రశాంతంగా తమ పార్టనర్‌తో ప్రేమను పంచుకుంటూ ఉంటారు. కాబట్టి ఎటువంటి ఒత్తిడి లేకుండా వ్యక్తిగత ఎదుగదలకు కూడా ప్రాధన్యత ఇవ్వడం జరుగుతుంది. ముందుగానే మాట్లాడుకోవడం వల్ల ఒకరి జీవితంలో ఏమి జరిగినా అది ఇంకో వ్యక్తి ఎలాంటి నష్టం కలిగించదు. కాబట్టి ఈ NATO డేటింగ్ ట్రెండ్‌ని చాలామంది ఆహ్వానిస్తున్నారు. ఇది రిలేషన్‌కు మంచి నాణ్యత ఇస్తుందని భావిస్తున్నారు.
Also Read : మార్కెట్లోకి కొత్త రిలేషన్ షిప్.. దానిపేరే హాలిడే డేటింగ్