Saif Ali Khan Attack: జనవరి 16న సైఫ్ అలీఖాన్‌పై దాడి ఘటన జరిగింది. అప్పటి నుంచి నిందితుల కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఇప్పటికే చాలా మందిని విచారించారు. ఇంకా విచారిస్తున్నారు. వందల సీసీటీవీ ఫుటేజ్‌లు పరిశీలిస్తున్నారు. అనుమానం ఉన్న ప్రతి చోటుకు ముంబై పోలీసులు వెళ్తున్నారు. అక్కడ జల్లెడ పడుతున్నారు. ఈక్రమంలోనే కీలక పురోగతి సాధించినట్టు సమాచారం అందుతోంది. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన ఓ అనుమానితుడిని అదుపులోకి తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.
రైలులో పారిపోతున్న టైంలో ఆ అనుమాతిడిని అదుపులోకి తీసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. తాము వెతుకుతున్న నిందితుడు ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. అనంతరం స్థానిక పోలీసుల సహాయంతో ప్రయాణికుడిని రైలు నుంచి దింపేశారు. అతని పేరు ఆకాష్ కైలాష్ కన్నౌజియాగా చెబుతున్నారు.
ఆ వ్యక్తి సైఫ్ అలీఖాన్ కేసులో ఇప్పటికే విడుదల చేసిన వీడియోల్లో కనిపించే అనుమానితుడిగా ఉన్నట్టు విచారిస్తున్న వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం పోలీసులు అతడిని ప్రశ్నిస్తున్నారు. రహస్య ప్రాంతంలో విచారిస్తున్నారు. అతనే ఈ పని చేసినట్టు కచ్చితమైన ఆధారాలు మాత్రం లభించలేదని తెలుస్తోంది.
అనుమానితుడిని ఎక్కడ అదుపులోకి తీసుకున్నారు?
ఛత్తీస్‌గఢ్‌లోని దుర్గ్ జిల్లాకు చెందిన నిందితుడిని ముంబై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని విచారించి, కేసులో అతని పాత్రపై దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు పోలీసులు దాదాపు 50 మందిని విచారించారు. ఈ కేసులో 35 బృందాలు రంగంలోకి దిగి నిందితులకు సంబంధించిన ఆధారాలు వెతికే పనిలో నిమగ్నమయ్యాయి.
BREAKING | सूत्रों के अनुसार मंबई पुलिस ने की सैफ के हमलावर की पहचान, औपचारिक बयान का है इंतजार @anchorjiya | @7_ganeshhttps://t.co/smwhXUROiK #SaifAliKhan #Accused #MumbaiPolice #CCTVFootage #Actor #LatestNews pic.twitter.com/BztBAlt4yB
— ABP News (@ABPNews) January 18, 2025
సైఫ్ కేసులో దాడి నిందితుడి గుర్తింపు?
సైఫ్‌పై దాడి జరిగి 60 గంటలకుపైగా అయింది. ఇంత వరకు ఎలాంటి పురోగతి లేదంటున్న టైంలో నిందితుడిని గుర్తించినట్టు తెలుస్తోంది. సీసీటీవీలో నిందితుడిని పోలిన ఫోటో ఒకటి బయటికి వచ్చింది. అయితే అతడే నిందితుడిని పోలీసులు ఇంకా ప్రకటించలేదు. సైఫ్‌పై హత్యాకాండకు పాల్పడింది కూడా అతనే అయి ఉండొచ్చన్న అనుమానం వ్యక్తమవుతోంది.
నిందితుడి నేర చరిత్రపై దర్యాప్తు
నిందితుడిని గుర్తించిన పోలీసులు అతని నేర చరితపై దర్యాప్తు చేస్తున్నారు. సైఫ్‌పై జరిగిన దాడిలో ఇతడే నిందితుడిగా ఉండే అవకాశం ఉందని అంటున్నారు. ముంబైలోని తూర్పు శివారు ప్రాంతంలో డిసెంబర్ 11న ఇలాంటి ఘటనకు పాల్పడుతుండగా ప్రజలు పట్టుకున్నారు. అయితే అతడిని మానసిక రోగిగా భావించి పోలీసులకు అప్పగించకుండా విడిచిపెట్టారు. పట్టుబడిన తర్వాత, నిందితుడు తనను తాను డెలివరీ బాయ్ అని చెప్పుకుంటూ తిరిగాడు. దీనిపై ఆదివారం పోలీసులు ప్రెస్‌మీట్ పెట్టే అవకాశం ఉంది.
మరిన్ని చూడండి