Homeస్పెషల్ స్టోరీ'సప్త సముద్రాల అవతల ఉన్నా పట్టుకుంటాం' - సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారికి అనిత...

‘సప్త సముద్రాల అవతల ఉన్నా పట్టుకుంటాం’ – సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే వారికి అనిత వార్నింగ్


Home Minister Vangalapudi Anitha Strong Warning: రాష్ట్ర ప్రభుత్వంపై అసభ్యకరంగా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోస్టులు పెట్టే వారికి రాష్ట్ర హోంమంత్రి అనిత (Vangalapudi Anitha) స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సచివాలయంలో గురువారం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. గత వైసీపీ నేతలపై మండిపడ్డారు. సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు పోస్టులు పెడుతున్న వైసీపీ (Ysrcp) కార్యకర్తలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్లు సప్త సముద్రాల అవతల ఉన్నా పట్టుకుంటామని అన్నారు. ‘రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయాలంటే.. చేయండి. మేం ఎదుర్కొంటాం. బాధ్యతగా సమాధానం ఇస్తాం. అంతే కానీ అసభ్యంగా పోస్టులు పెట్టే వారిని, క్రిమినల్స్‌ను వెనకేసుకు రావడమేంటి.?. మేమేదో వారిని అక్రమంగా అరెస్ట్ చేస్తున్నామంటూ మాట్లాడుతున్నారు. ఇలాంటి పిచ్చి పనులు చేసే వారికి బెయిల్ ఇప్పించేందుకు జగన్ వార్ రూం ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడం అంటే ఏంటో జగన్‌కు తెలుసా.?’ అంటూ ప్రశ్నించారు.

‘ఐదేళ్ల విధ్వంస పాలన’

గత ఐదేళ్ల విధ్వంస పాలనలో జగన్ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారని మంత్రి అనిత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘రాజకీయ ముసుగులో వైసీపీ నేతలు అనేక దారుణాలు చేశారు. రాష్ట్రం పరువు తీసే విధంగా పాలన సాగించారు. ఈ 5 నెలల కాలంలో ఏవేవో జరిగిపోయాయంటూ జగన్ అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. శాంతి భద్రతలు, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంటే విడ్డూరంగా ఉంది. ఐదేళ్లలో రాష్ట్ర ప్రజలకు జగన్ ఏం చేశారు.?. వైసీపీ హయాంలో ఎన్ని నేరాలు జరిగాయో లెక్కలు తీయండి. రాష్ట్రంలో ఎన్ని నేరాలు జరిగినా ఐదేళ్లపాటు జగన్ మాట్లాడలేదు. మహిళలు అత్యాచారాలు, హత్యలు జరిగినా ఆయన పట్టించుకోలేదు. అలాంటి వ్యక్తి ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారు. వైసీపీ పాలనలో గంజాయి, డ్రగ్స్ విచ్చలవిడిగా పెరిగాయి. వైసీపీ హయాంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించారనే అనేక మందిపై కేసులు పెట్టారు. అమరావతి మహిళా రైతుల గురించి నీచంగా మాట్లాడారు. డీజీపీ ఆఫీస్ పక్కనున్న టీడీపీ కార్యాలయంపై దాడి చేశారు. జగన్ హయాంలో పరదాలు కట్టుకొని సమావేశాలు పెట్టుకున్నారు. పెన్నులు, నల్లబట్టలు వేసుకున్నా సభలకు రానీయలేదు.’ అంటూ మండిపడ్డారు.

Also Read: Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్, హోంమంత్రి అనిత భేటీ – తన వ్యాఖ్యలపై పవన్ ఏమన్నారంటే?

మరిన్ని చూడండి



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments