Homeస్పెషల్ స్టోరీరాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, హంటర్ 350ల్లో ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? - రెండిట్లో ఏది...

రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్, హంటర్ 350ల్లో ఏది ఎక్కువ మైలేజీని ఇస్తుంది? – రెండిట్లో ఏది బెస్ట్ బ


Royal Enfield Bullet 350 and Royal Enfield Hunter 350 Mileage: రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లు భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. కంపెనీకి చెందిన బుల్లెట్ 350, హంటర్ 350లకు యువతలో మంచి ఆదరణ ఉంది. ఈ రెండు బైక్‌లు బోల్డ్ స్టైల్‌కు ప్రసిద్ధి చెందాయి.

ఈ రెండు బైకుల్లో ఏది బెటర్, ఏది ఎక్కువ మైలేజ్ అనే విషయంపై ప్రజల్లో గందరగోళం నెలకొంది. ఈ రెండు బైక్‌ల మైలేజీ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. తద్వారా ఏ బైక్ కొనడం మంచిదో మీరే నిర్ణయించుకోవచ్చు. 

రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్, బుల్లెట్ బైక్‌ల్లో ఏది ఎక్కువ మైలేజీ ఇస్తుంది?
రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్, బుల్లెట్ మైలేజీ గురించి మాట్లాడినట్లయితే రెండింటి మైలేజీలో స్వల్ప వ్యత్యాసం ఉంది. ఇక బుల్లెట్ మైలేజీ గురించి చెప్పాలంటే లీటరుకు 35 నుంచి 37 కిలోమీటర్ల వరకు మైలేజీని అందిస్తుంది. హంటర్ మైలేజ్ 30 నుంచి 32 కిలోమీటర్ల మధ్యలో ఉంది. అయితే రెండు బైక్‌ల ఇంజన్లు ఒకేలా ఉన్నాయి. 

Also Read: కవాసకి బైక్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు – ఏకంగా రూ.45 వేల వరకు డిస్కౌంట్!

రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ ఫీచర్లు ఇవే…
రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 జే-సిరీస్ ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ బైక్‌లో 349 సీసీ ఎయిర్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజన్ ఉంది. బుల్లెట్ 350లోని ఇంజన్ 6,100 ఆర్‌పీఎం వద్ద 20 బీహెచ్‌పీ పవర్‌ని జనరేట్ చేస్తుంది. 4,000 ఆర్‌పీఎం వద్ద 27 ఎన్ఎం టార్క్‌ను జనరేట్ చేస్తుంది. బెటాలియన్ బ్లాక్ షేడ్‌లో ఉన్న బుల్లెట్ 350 ఎక్స్ షోరూమ్ ధర రూ.1.75 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.

హంటర్ 350 ఫీచర్లు ఇలా…
రాయల్ ఎన్‌ఫీల్డ్ హంటర్ 350… 349 సీసీ సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ ఎయిర్ ఆయిల్ కూల్డ్ ఇంజన్‌ను పొందింది. ఇది ఫ్యూయల్ ఇంజెక్షన్ టెక్నాలజీని కలిగి ఉంది. ఇదే ఇంజన్ మీటియోర్ 350, క్లాసిక్ 350ల్లో కూడా ఉపయోగిస్తున్నారు. ఈ ఇంజన్ 5 స్పీడ్ గేర్‌బాక్స్‌తో పెయిర్ అయింది. ఇది 6100 ఆర్పీఎం వద్ద 20.2 బీహెచ్‌పీ పవర్‌ని, 4,000 ఆర్పీఎం వద్ద 27 ఎన్ఎం పీక్ టార్క్‌ను జనరేట్ చేస్తుంది. ఈ బైక్ గరిష్టంగా గంటకు 114 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోతుంది.

Also Read: రోజువారీ వాడకానికి బెస్ట్ బడ్జెట్ సీఎన్‌జీ కార్లు ఇవే – టాప్-3 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?

మరిన్ని చూడండి





Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments