Homeస్పెషల్ స్టోరీరాజమౌళి డైరెక్షన్‌లో డేవిడ్ భాయ్ - ఇదెక్కడి ట్విస్ట్ అయ్యా!

రాజమౌళి డైరెక్షన్‌లో డేవిడ్ భాయ్ – ఇదెక్కడి ట్విస్ట్ అయ్యా!


SS Rajamouli: భారతదేశంలోనే నంబర్ వన్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబు సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. వీలైనంత త్వరగా ఈ సినిమాను పట్టాలెక్కించడానికి ఎంతో పట్టుదలగా కృషి చేస్తున్నారు. కానీ ఈ గ్యాప్‌లో స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్‌‌కు కూడా దర్శకత్వం వహించారు. అయితే నిజంగా కాదండోయ్… క్రెడ్ యాడ్‌లో డేవిడ్ వార్నర్ హీరోగా సినిమాను తెరకెక్కించడానికి రాజమౌళి ఎన్ని కష్టాలు పడ్డారో ఫన్నీగా చూపించారు.

ఈ యాడ్ ప్రారంభంలో ఎస్ఎస్ రాజమౌళి, డేవిడ్ వార్నర్‌కు కాల్ చేసి ‘మీ మ్యాచ్ టికెట్లలో డిస్కౌంట్ కావాలంటే ఏం చేయాలి?’ అని అడుగుతాడు. దానికి డేవిడ్ వార్నర్ ‘మీ దగ్గర క్రెడ్ యూపీఐ ఉంటేనే డిస్కౌంట్ లభిస్తుంది.’ అని చెప్తాడు. దానికి రాజమౌళి ‘ఒకవేళ నా దగ్గర మామూలు యూపీఐ ఉంటే’ అని తిరిగి ప్రశ్నించగా… ‘దానికి మీరు నాకు ఒక ఫేవర్ చేయాల్సి ఉంటుంది.’ అని వార్నర్ రిప్లై ఇస్తాడు.

వెంటనే రాజమౌళి దర్శకత్వంలో వార్నర్ ఒక తెలుగు సినిమాలో నటించడం, దాని షూటింగ్‌లో వార్నర్‌తో రాజమౌళి చాలా ఇబ్బందులు పడటం చూపిస్తారు. ఒక షాట్ దగ్గర ఏకంగా ‘మనకు ఆస్కార్ కూడా వస్తుందిగా’ అని వార్నర్ తిరిగి రాజమౌళిని ప్రశ్నిస్తాడు. ఇదంతా ఊహించుకున్న ఎస్ఎస్ రాజమౌళి చివర్లో సైలెంట్‌గా ‘నేను క్రెడ్ యూపీఐకి అప్‌గ్రేడ్ అవుతాను.’ అనడంతో యాడ్ ఎండ్ అవుతుంది. ఈ యాడ్ ఎలా ఉందో కింద చూసేయండి.

ఈ యాడ్‌కు నెటిజన్ల నుంచి సూపర్ పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. యాడ్ చాలా హిలేరియస్‌గా ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. డేవిడ్ వార్నర్ టాలీవుడ్ హీరోగా సెటిల్ అయిపోవచ్చని ఆయన ఫ్యాన్స్ కామెంట్లు చేస్తున్నారు. మహేష్ బాబు ఫ్యాన్స్‌లో కొందరు SSMB29 గురించి అప్‌డేట్ అడుగుతున్నారు.

మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కనున్న సినిమా కోసం ప్రపంచం మొత్తం ఎదురు చూస్తుంది. 2024 ద్వితీయార్థంలో ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుందని అంచనా. ఈ సినిమా ఓపెనింగ్ కూడా చాలా గ్రాండ్‌గా జరగనుందని తెలుస్తోంది. బాలీవుడ్, హాలీవుడ్‌కు చెందిన స్టార్ నటులు ఈ సినిమాలో నటించనున్నారని వార్తలు వస్తున్నాయి. మార్వెల్ అవెంజర్స్‌లో థోర్ పాత్రలో నటించిన క్రిస్ హెమ్స్‌వర్త్, నిక్ ఫ్యూరీ పాత్రలో నటించిన శామ్యూల్ ఎల్. జాక్సన్ కూడా ఈ సినిమాలో నటించనున్నారని తెలుస్తోంది. ఇండోనేషియాకు చెందిన చెల్సీ ఎలిజబెత్ ఇస్లాన్‌ను మహేష్ బాబు సరసన హీరోయిన్‌గా జక్కన్న సెలక్ట్ చేశారని టాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. ఈ రూమర్స్ అన్నిటికీ చెక్ పడాలంటే జక్కన్న తన మార్కు ప్రెస్ మీట్ పెట్టాల్సిందే. సినిమాలో డిటైల్స్ అన్నీ రివీల్ చేయాల్సిందే. సినిమా ఓపెనింగ్ సమయంలోనే ప్రెస్ మీట్ పెట్టి కథ చెప్పి ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా చేయడం రాజమౌళి స్పెషాలిటీ.

Also Read : ప్రభాస్‌ ‘రాజా సాబ్‌’ కోసం మారుతి భారీ ప్లాన్‌ – ఫస్ట్‌టైం ఆ ప్రయోగం చేయబోతున్న డైరెక్టర్‌ !

మరిన్ని చూడండి





Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments