Homeస్పెషల్ స్టోరీయువతకు ఉద్యోగాలే తొలి ప్రాధాన్యం, 10 లక్షలలోపు ఉచిత వైద్యం: ఈటల రాజేందర్

యువతకు ఉద్యోగాలే తొలి ప్రాధాన్యం, 10 లక్షలలోపు ఉచిత వైద్యం: ఈటల రాజేందర్


మక్తల్: దళితులకు మూడు ఎకరాలు ఇవ్వలేదు సరికదా ఎప్పుడో ఇచ్చిన అసైన్డ్ భూములు లాక్కుంటున్నాడని తెలంగాణ సీఎం కేసీఆర్ (Telangana CM KCR) పై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Etela Rajender) ఆరోపణలు చేశారు. మక్తల్ నియోజకవర్గం బిజెపి అభ్యర్థి జలంధర్ రెడ్డికి, నారాయణపేట బీజేపీ అభ్యర్థి రతన్ పాండ్ రెడ్డికి మద్దతుగా మక్తల్ సభలో పాల్గొని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల ప్రసంగించారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడం తమ తొలి ప్రాధాన్యం అన్నారు. 10 లక్షలలోపు ఉచిత వైద్యం అందిస్తామని చెప్పారు. అటుకులు బుక్కి ఉపాసమున్న కేసీఆర్ కి ఇన్ని కోట్లు ఎలా? వచ్చాయని ఈటల రాజేందర్ తెలంగాణ సీఎంను ప్రశ్నించారు. 
దళితబంధు పేరుతో దగా
దళితబంధు పేరుతో దళితులను బీఆర్ఎస్ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ దగా చేస్తున్నారంటూ ఈటల మండిపడ్డారు. గొల్ల కురుమలు డిడిలు కట్టారు కాని గొర్రెలు ఇవ్వడం లేదని విమర్శించారు. సీఎం కేసీఆర్ ఎన్ని డబ్బులు ఇచ్చినా తీసుకోండి.. కానీ బీజేపీకి ఓటు వేయాలని ఓటర్లకు సూచించారు. మన సొమ్ము పక్క రాష్ట్రాల వారికి ఇవ్వడానికి ఎవడబ్బా జాగీరు కాదు కేసీఆర్. ఇక్కడ చనిపోయిన రైతులను ఆదుకొనే సోయి లేని నువ్వు అబ్ కీ సర్కార్ కిసాన్ సర్కార్ అని చెప్పుకుంటున్నావు అని సెటైర్లు వేశారు. 

బీజేపీ అధికారంలోకి వస్తే పేదలకు నాణ్యమైన ఇంగ్లీష్ మీడియం విద్య అందిస్తామని చెప్పారు. 3100 రూపాయలు క్వింటాల్ వరికి మద్దతు ధర అందిస్తాం. ఒక్క ఎకరానికి 25 వేల రూపాయల లాభం జరుగుతుందన్నారు. వ్యవసాయ పనిముట్లకు ఇన్పుట్ సబ్సిడీ అందిస్తామని రైతులకు ఈటల రాజేందర్ భరోసా ఇచ్చారు. కాంగ్రెస్, టీడీపీ, బీఆర్ఎస్ ఒక్క సారి కూడా బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రిని చెయ్యలేదు కానీ, బీసీని సీఎం చేస్తామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రకటించారని ఈటల గుర్తుచేశారు. 

బీజేపీ వస్తే రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేస్తాం. జిఓ no. 69 ఇచ్చి ఎత్తిపోతల పథకం మర్చిపోయారు. బీజేపీ వస్తే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. మాదసి కురువలను ఎస్సీలలో చేరుస్తా అని మాట ఇచ్చి నెరవర్చలేదు. మేము వస్తే వారి సమస్య తీరుస్తాం అని పేర్కొన్నారు. కనుక వచ్చే ఎన్నికల్లో కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే కమలం పువ్వు గుర్తుకే ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు. 

తెలంగాణ అభివృద్ధి బిజెపి తోనే సాధ్యం అని, తెలంగాణ దిశను మార్చే దశసూత్ర ప్రణాళిక బిజెపి తెలంగాణ ఎన్నికల మ్యానిఫెస్టో – 2023 అని ఈటల రాజేందర్ అన్నారు. పుట్టిన నవజాత ఆడపిల్లకు 2 లక్షల రూపాయల ఫిక్సిడ్ డిపాజిట్ చేస్తాం, ఆడపిల్లలకు భరోసా కల్పించిన మన బిజెపి మన మోదీ గ్యారంటీ అని ప్రచారం చేస్తున్నారు. నాలుగు సిలిండర్లు ఏడాదికి ఉచితంగా ఇస్తాం.. కల్యాణ లక్ష్మి, పింఛన్లు ఏవీ ఆగవు అని ప్రజలకు భరోసా ఇచ్చారు. ఇంట్లో ఇద్దరు ముసలోళ్లకు పెన్షన్ ఇస్తాం.. మీ కుటుంబంలో వైద్యం ఖర్చు మీద పడితే పది లక్షల వరకు రూపాయి ఖర్చు లేకుండా వైద్యం అందిస్తామని పేర్కొన్నారు. పండించే వరి ధాన్యాన్ని కిలో తరుగు లేకుండా గింజ వదిలిపెట్టకుండా కొనే జిమ్మేదార్ తీసుకుంటాం.. గట్టిగా ఉండి కేసీఆర్ కు గుణపాఠం చెప్పాలంటే ఓటు హక్కు వినియోగించుకోవాలని ఓటర్లకు సూచించారు.



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments