Keerthy Suresh first public appearance post wedding: హీరోయిన్లకు పెళ్లయితే, ఓ ఇంటి కోడలు అయితే అవకాశాలు రావు అనేది ఒకప్పటి మాట. ఈ జనరేషన్ ఆడియన్స్ వ్యక్తిగత జీవితాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. పెళ్లయిన హీరోయిన్లనూ ఆదరిస్తున్నారు. వారిపై అభిమానం చూపిస్తున్నారు. అయితే… పెళ్లయిన హీరోయిన్లు మెడలో మంగళ సూత్రం, కాలికి మెట్టెలు, నుదట సింధూరం వంటివి ఏవి లేకుండా జాగ్రత్త పడతారు. కానీ కీర్తి సురేష్ మాత్రం బాలీవుడ్ భామలతో కంపేర్ చేస్తే తను డిఫరెంట్ అని ట్రెడిషనల్ అని ప్రూవ్ చేశారు.
మెడలో మంగళ సూత్రంతో బాలీవుడ్ ముందుకు!
Keerthy Suresh with Mangalsutra: డిసెంబర్ 12న కీర్తి సురేష్ పెళ్లి చేసుకున్నారు. చిరకాల ప్రియుడు ఆంటోనీతో కలిసి ఏడు అడుగులు వేశారు. గోవాలో కుటుంబ సభ్యులు, కొంత మంది స్నేహితుల సమక్షంలో, అంగరంగ వైభవంగా ఆ పెళ్లి జరిగింది. పెళ్లై పట్టుమని వారం రోజులు కూడా కాలేదు. ఇంకా హనీమూన్ కూడా వెళ్లలేదు. కానీ కీర్తి సురేష్ పనిలో పడ్డారు. తన తొలి హిందీ సినిమా ‘బేబీ జాన్’ ప్రచార కార్యక్రమానికి హాజరు అయ్యారు.
డిసెంబర్ 25న ‘బేబీ జాన్’ సినిమా థియేటర్లలోకి రానుంది. వరుణ్ ధావన్ హీరోగా నటించిన చిత్రం ఇది. దళపతి విజయ్ హీరోగా అట్లీ దర్శకత్వం వహించిన కోలీవుడ్ సూపర్ హిట్ ‘తెరి’కి హిందీ రీమేక్. ఈ సినిమా ప్రచార కార్యక్రమాల్లో కీర్తి సురేష్ సందడి చేశారు. పెళ్లైన తరువాత ఆమె మీడియా ముందుకు రావడం ఇదే తొలిసారి. ఇక్కడ ఒక విషయం గమనించాలి… కీర్తి సురేష్ మోడ్రన్ డ్రెస్ ధరించినప్పటి మెడలో మంగళ సూత్రం మాత్రం తీయలేదు.
తనకు పెళ్లయిన విషయాన్ని బాలీవుడ్ ఆడియన్స్ ముందు దాచాలని కీర్తి సురేష్ అనుకోలేదు. పసుపు తాడుతో కీర్తి సురేష్ కనిపించి అందరిని ఆశ్చర్యపరిచారు. మెడలో మంగళ సూత్రం ఒక్కటే కాదు… కాళ్లకు రాసిన పారాణి కూడా ఇంకా ఆరలేదు. చేతికి పెట్టిన మెహందీ అలాగే కనబడుతూ ఉంది. మిగతా హీరోయిన్లకు కీర్తి సురేష్ కు మధ్య ఒక్క డిఫరెన్స్ మాత్రం బాలీవుడ్ ఆడియన్స్ అందరికీ అర్థమైంది. ఈ అమ్మాయి మోడ్రన్ గా కనిపించే ట్రెడిషనల్ అని. సోషల్ మీడియాలో కూడా తన పెళ్లి ఫోటోలను కీర్తి సురేష్ ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ తనకు పెళ్లయిన విషయాన్ని అందరికీ చెబుతోంది. తాజాగా దళపతి విజయ్ తన పెళ్లికి హాజరైన ఫోటోలను షేర్ చేశారు.
Also Read: సౌత్ కంటే డబుల్… బాలీవుడ్‌లో రెమ్యూనరేషన్ పెంచేసిన కీర్తి సురేష్
పెళ్లి తర్వాత ఎటువంటి విజయం వస్తుందో!?
పెళ్లయిన తర్వాత, అది రెండు వారాలకు ‘బేబీ జాన్’ విడుదల కానుండడంతో ఆ సినిమా ఫలితం మీద అందరి దృష్టి పడుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు. సినిమా హిట్ అయితే కీర్తికి మ్యారేజ్ లాక్ అంటారు, లేదంటే బ్యాడ్ లక్ అంటారు. ఇది కాకుండా తమిళంలో మరో రెండు సినిమాల్లో కీర్తి సురేష్ నటిస్తున్నారు.
మరిన్ని చూడండి