శ్రీరామ జన్మభూమి అయోధ్యలోని మర్యాదా పురుషోత్తముడు రాముని మందిరం ప్రారంభోత్సవానికి మెగాస్టార్ చిరంజీవి, ఆయన తనయుడు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆహ్వానాలు అందుకున్నారు. సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి అయోధ్య వెళ్లనున్నారు. వాళ్లకు సెండాఫ్ ఇవ్వడానికి ఆదివారం రాత్రి మెగాస్టార్ ఇంటికి భారీ ఎత్తున అభిమానులు చేరుకున్నారు. తమ అభిమాన హీరోలు, తండ్రి తనయులను చూసి మురిసిపోయారు.