Sitara Ghattamaneni On Mahesh Babu dubbing for Mufasa: ‘‘అప్పుడప్పుడూ ఈ చల్లని గాలి. నా ఇంటి నుంచి వచ్చే జ్ఞాపకాలను గుర్తు చేస్తున్నట్టు అనిపిస్తుంది. అంత లోనే మాయమవుతున్నాయి’’ అంటూ ముఫాసా గా సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu) వాయిస్ అభిమానులకే కాదు… చిన్నపిల్లలకూ మంచి కిక్ ఇచ్చింది. ఆయన కుమార్తె సితారకు కూడా ముఫాసా పాత్రకు తండ్రి మహేశ్ చెప్పిన డబ్బింగ్ చాలా నచ్చేసిందట.
నాన్న మా పట్ల కేరింగ్ గా ఉంటారు – సితార
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ‘‘ముఫాసా క్యారెక్టర్ కు మా నాన్న(మహేశ్ బాబు) డబ్బింగ్ చెప్పడం గర్వంగా ఉంది… ‘లయన్ కింగ్’ సినిమాలో ముఫాసా చాలా ఐకానిక్ రోల్. సినిమాలో ముఫాసా కేరక్టర్ లా నాన్న కూడా మా పట్ల కేరింగ్ ఉంటారు. డిస్నీ సంస్థలో ‘ఫ్రోజన్’ అనే సినిమా కోసం డబ్బింగ్ కూడా చెప్పాను’’ అని సూపర్ స్టార్ మహేశ్ బాబు కుమార్తె సితార అన్నారు.
వాల్ట్ డిస్నీ సంస్థ నిర్మించిన హాలీవుడ్ మూవీ ‘ముఫాసా: ద లయన్ కింగ్’ (Mufasa: The Lion King). డిసెంబర్ 20న ఈ సినిమా విడుదల కానుంది. అడవిలో తప్పిపోయిన ముఫాసాకి రాజ కుటుంబానికి టాకా పరిచయమవుతాడు. అయితే ముఫాసా రాకను ఆ కుటుంబంలో ఎవరికి పెద్ద ఇష్టం ఉండదు. నిజమైన అన్నదమ్ములన్నంత బలంగా టాకా, ముఫాసా ల మధ్య బంధం మరింత బలపడుతుంది. తర్వాత ముఫాసా ఎలా రాజయ్యాడన్నది కథ. ‘‘ఈ క్లాసిక్ కు నేను పెద్ద అభిమానిని. మనకు బాగా ఇష్టమైన పాత్రకు ఓ కొత్త ఆరంభం ఇది. తెలుగు లో ముఫాసా పాత్రకు డబ్బింగ్ చెప్పినందకు చాలా సంతోషంగా ఉంది’’ అని మహేశ్ బాబు అన్నారు. 2019 లో విడుదలైన ‘లయన్ కింగ్’ సినిమా ప్రీక్వెల్ గా ఈ సినిమా తెరకెక్కింది. బ్యారీ జెన్కిన్స్(Barry Jenkins) దర్శకుడు. 2017 లో ఆయన దర్శకత్వంలో వహించిన ‘మూన్ లైట్ ’ చిత్రానికి రెండు ఆస్కార్లు దక్కాయి. ఇప్పటికే ‘ముఫాసా’ సినిమా కు సంబంధించిన టీజర్లు, టైలర్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ కామిక్ లో పుంబా, టిమోన్, టకా వంటి ముఖ్య పాత్రలూ ఉన్నాయి. అలీ, బ్రహ్మానందం, సత్యదేవ్, అయ్యప్ప పి శర్మ లు ఇందులోని కీలక పాత్రలకు డబ్బింగ్ చెప్పారు.
Also Read: బిగ్ బాస్ 8 విజేత నిఖిల్… అతని కంటే ముందు విన్నర్స్ ఎవరో గుర్తు ఉన్నారా? ఓ లుక్ వేయండి
వచ్చే ఏడాది ప్రారంభం!
‘ముఫాసా’ హిందీ వెర్షన్ లోని ముఫాసా పాత్రకు బాలీవుడ్ స్టార్ హీరో షారూఖ్ ఖాన్, ముఫాసా చిన్నప్పటి పాత్రకు ఆయన చిన్న కుమారుడు అబ్రం డబ్బింగ్ చెప్పారు. మహేశ్ బాబు సినిమాల విషయానికొస్తే, ఫ్యాన్స్ అందరూ మహేశ్ బాబు సినిమా అప్ డేట్స్ కోసం ఎంతో ఆసక్తి గా ఎదురుచూస్తున్నారు. రాజమౌళి సినిమా ఇంకా మొదలే కాలేదు. విడుదల ఇప్పట్లో లేదు. కనీసం వెండితెరపై మహేశ్ బాబు వాయిస్ అయినా విందామని ఫ్యాన్స్ ఆశ. త్వరలోనే రాజమౌళి సినిమా ప్రారంభమవుతుందని టాక్. రెండు భాగాలు గా విడుదల కానున్న ఈ సినిమా కు సంబంధించిన సెట్స్ ను రామోజీ ఫిలిం సిటీలో నిర్మిస్తున్నారట. వచ్చే జనవరిలో ఈ సినిమా ప్రకటన ఉంటుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
మరిన్ని చూడండి