Naga Chaitanya: టాలీవుడ్ యంగ్ హీరో నాగచైతన్య తాజాగా ‘ధూత’ అనే వెబ్ సిరీస్ లో నటించారు. ఆయన కెరీర్ లో ఇదే తొలి వెబ్ సిరీస్. సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్‌గా ఈ సిరీస్ రూపొందింది. విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ వెబ్ సిరీస్, అమెజాన్ ప్రైమ్ వేదికగా డిసెంబర్ 1 నుంచి అందుబాటులోకి వచ్చింది. ఒకేసారి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఎనిమిది ఎపిసోడ్స్ తో ఈ సిరీస్ రూపొందింది.
చక్కటి నటనతో ఆకట్టుకున్న నాగ చైతన్య
‘ధూత’ సిరీస్ లో గ్రే షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేశాడు నాగ చైతన్య. చక్కటి నటనతో ఆకట్టుకున్నాడు. ఇందులో ఆయన సాగర్ అనే జర్నలిస్టుగా కనిపించాడు. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటించింది. రవీంద్ర విజయ్, చైతన్య గరికపాటి, రోహిణి, ఈశ్వరీ రావు, అనీష్ కురువిల్లా, జీవన్ కుమార్, కామాక్షీ భాస్కర్ల ఇతర పాత్రల్లో కనిపించారు. ‘మనం’ తర్వాత విక్రమ్- నాగచైతన్య కాంబినేషన్‌లో ‘థ్యాంక్ యు’ అనే సినిమా వచ్చింది. తాజాగా వీరిద్దరి కాంబోలో ‘ధూత’ వెబ్ సిరీస్ వచ్చింది. ప్రస్తుతం ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులో ఉంది.
మా తాత మాట నిజం అయ్యింది- నాగ చైతన్య
రీసెంట్ ‘ధూత’ ప్రమోషన్ లో పాల్గొన్న నాగ చైతన్య తన చిన్ననాటి రోజులను గుర్తు చేసుకున్నారు. తాను సినిమాల్లోకి వస్తానని తన తాతగారు ఎప్పుడో చెప్పారని వెల్లడించారు. ఆయన ప్రిడిక్షన్ నిజం అయ్యిందని చెప్పుకొచ్చారు. “నా స్కూల్ డేస్ లో మా తాత నాగేశ్వరరావు గారు, నువ్వు పెద్దయ్యాక ఏం అవుతావని అడిగారు. నేను ఇంజినీర్ అవుతాను, ఆటోమోబైల్ ఇంజినీర్, కంప్యూటర్ ఇంజినీర్ అవుతాను అని చెప్పేవాడిని. కానీ, తను మా నాన్నతో నేను తప్పకుండా సినిమాల్లోకి వస్తానని చెప్పేవారు. ఆయన అప్పట్లో చాలా కచ్చితంగా అదే మాట తరచుగా చెప్పేవారు. ఆయన చెప్పిన మాట నిజం అయ్యింది. నేను సినిమాల్లోకి వచ్చాను” అని వెల్లడించారు.
my grandfather oddly knew well before i found my love for acting! https://t.co/uOidDjIcCU pic.twitter.com/RscrxM1Dpx
— prime video IN (@PrimeVideoIN) December 10, 2023
‘తండేల్’ మూవీతో ఫుల్ బిజీ
ఇక రీసెంట్ గా నాగ చైతన్య ‘కస్టడీ’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. ప్రస్తుతం ‘తండేల్’ అనే సినిమా చేస్తున్నారు. చందు మొండేటి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తోంది. గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ లుక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. సినిమాపై అంచనాలు భారీగా పెంచింది. తాజాగా హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్‌లోని ఈ మూవీ ముహూర్తం వేడుక జరిగింది. డిసెంబర్ 15 నుంచి రెగ్యులర్ షూటింగ్ కొనసాగనుంది. నాగ చైతన్య కెరీర్ లో 23వ సినిమా తెరకెక్కుతున్న‘తండేల్’ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
Read Also: సీరియల్ నటితో కమెడియన్ రెడిన్ వివాహం, నెట్టింట్లో ఫోటోలు వైరల్