Homeస్పెషల్ స్టోరీమరింత తీవ్రమవుతున్న అమిత్‌షా కామెంట్స్ వివాదం- నేడు కాంగ్రెస్‌ దేశవ్యాప్త నిరసనలు

మరింత తీవ్రమవుతున్న అమిత్‌షా కామెంట్స్ వివాదం- నేడు కాంగ్రెస్‌ దేశవ్యాప్త నిరసనలు


Ambedkar Row In Parliament:భార‌తీయ జ‌న‌తా పార్టీ(BJP) నాయ‌కుడు, కేంద్ర హోం శాఖ మంత్రి (Central Home minister) అమిత్‌షా(Amit sha)కు పార్ల‌మెంటులో సెగ త‌గులుతోంది. జాతీయ‌ రాజకీయాల్లోకి అడుగుపెట్టిన పదేళ్ల తర్వాత అమిత్ షాపై విపక్షాలు తొలిసారి మూకుమ్మడి యుద్ధం చేస్తున్నాయి. ఏకంగా ఆయ‌న త‌న ప‌ద‌వికి రాజీనామాచేయాల‌ని.. పార్ల‌మెంటులో క్షమాప‌ణ‌లు కూడా చెప్పాల‌ని డిమాండ్ చేయ‌డం ప్ర‌స్తుతం కేంద్రంలోని అధికార‌, విప‌క్షాల మ‌ధ్య తీవ్ర రాజ‌కీయ యుద్ధానికి(Political Fight) కార‌ణ‌మైంది. ఇదేస‌మ‌యంలో ఎన్డీయే అధికార ప‌క్షం బీజేపీ కూడా విప‌క్ష‌ కాంగ్రెస్ పార్టీపై పూర్తి స్థాయిలో విరుచుకుప‌డుతోంది. ఇలా.. దేశంలోనే తొలిసారి కేంద్రహోం మంత్రిని రాజీనామా చేయాల‌న్న డిమాండ్ రావ‌డం.. క్ష‌మాప‌ణ‌లు చెప్పాల‌ని ప‌ట్టుబ‌ట్ట‌డం వంటివి దేశ‌రాజ‌కీయాల‌ను గ‌త మూడు రోజులుగా కుదిపేస్తున్నాయి.

నేడు దేశ‌వ్యాప్తం నిర‌స‌న‌లు.. 

రాజకీయ చాణక్యుడుగా, కేంద్ర‌ హోంమంత్రిగా, బీజేపీ(BJP) అగ్ర‌నేత‌గా ఉన్న అమిత్ షా ఇప్పుడు విప‌క్షం నుంచి భారీ ఎదురుగాలినే ఎదుర్కొంటున్నార‌ని  పలువురు రాజకీయ విశ్లేష‌కులు అంటున్నారు. దీంతో ఆయన మీడియా సమావేశం పెట్టి ఈ విషయంలో క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. ఇప్ప‌టి వ‌ర‌కు మ‌ణిపూర్ అల్ల‌ర్లు, అదానీపై కేసులు.. అంటూ పార్ల‌మెంటులో వివాదానికి తెరదీసిన ప్ర‌తిప‌క్షాలు.. తాజాగా అమిత్ షా వ్యాఖ్య‌ల‌ను మాత్ర‌మే కార్న‌ర్ చేస్తూ.. ఆయ‌న  క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేయ‌డం గ‌మ‌నార్హం. ఇది ఎంత వ‌ర‌కు వెళ్లిందంటే.. ఇరు ప‌క్షాలు పార్ల‌మెంటు భ‌వ‌నం ముందు నిర‌స‌న‌లు తెలిపే వ‌ర‌కు!

గురువారం, ప్రతిపక్ష పార్టీలు పార్లమెంట్‌కు పాద‌యాత్ర‌గా వ‌చ్చారు. అనంత‌రం ద్వారం వద్ద నిరసన తెలిపాయి. ఈ సందర్భంగా బీజేపీ ఎంపీలు, విపక్ష ఎంపీల మధ్య తోపులాట జరిగింది. ఇందులో ఇద్దరు బీజేపీ ఎంపీలు ప్రతాప్ సారంగి(Patap chandra sarngi), ముఖేష్ రాజ్‌పుత్(Mukhesh rajput)) కిందపడి గాయపడ్డారు. దీంతో ఇద్దరినీ ఆసుపత్రిలో చేర్చాల్సి వచ్చింది. ఈ కేసులో రాహుల్ గాంధీ వారిద్దరినీ నెట్టారని బీజేపీ ఆరోపించింది. అనంత‌రం రాహుల్‌పై బీజేపీ ఫిర్యాదు చేయగా, ఢిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. ఈ వ్య‌వ‌హారాన్ని విడిచి పెట్టేదిలేద‌ని కాంగ్రెస్ చెబుతుండ‌డం గ‌మ‌నార్హం. అమిత్ షా వ్యాఖ్య‌లు.. రాహుల్ గాంధీపై ఎఫ్‌ఐఆర్ న‌మోదుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ శుక్రవారం దేశవ్యాప్తంగా నిరసనల‌కు పిలుపునిచ్చింది.  

అస‌లు.. అమిత్ షా ఏమ‌న్నారు? 

రాజ్యాంగానికి 75 వ‌సంతాలు(75 Years of Constitution) పూర్త‌యిన నేప‌థ్యంలో రాజ్యసభలో రాజ్యాంగంపై చర్చ సందర్భంగా అమిత్ షా(Amit sha) మాట్లాడుతూ.. ‘అది ఇప్పుడు ఫ్యాషన్‌గా మారింది. అంబేద్కర్, అంబేద్కర్, అంబేద్కర్.. అని నామ‌స్మ‌ర‌ణ చేస్తున్నారు. ఈ స‌మ‌యంలో  ఈ భగవంతుని పేరు మ‌న‌నం చేసుకుని ఉంటే మీరు(ప్ర‌తిప‌క్ష కాంగ్రెస్‌) ఏడు జన్మలపాటు స్వర్గానికి వెళ్లి ఉండేవారు“ అని వ్యాఖ్యానించారు. అంతేకాదు..“అంబేద్కర్(Ambedkar) పేరు పెట్టుకోవడం మాకు సంతోషంగా ఉంది. అంబేద్కర్ పేరును 100 రెట్లు ఎక్కువ‌గా గౌర‌విస్తాం. కానీ అదే సమయంలో, అంబేద్కర్  పట్ల మీ(కాంగ్రెస్‌-Congress) భావన ఏమిటో నాకు తెలుసు. దేశ తొలి మంత్రివర్గం నుంచి అంబేద్కర్ ఎందుకు రాజీనామా చేశారు? షెడ్యూల్డ్ కులాలు, తెగల పట్ల తాను అసంతృప్తిగా ఉన్నానని అంబేద్కర్ చాలాసార్లు చెప్పారు. ప్రభుత్వ విదేశాంగ విధానంతో విభేదించారు. జ‌మ్ము క‌శ్మీర్‌(Jammu and kashmir)కు స్వ‌యం ప్ర‌తిప‌త్తి క‌ల్పించే ఆర్టికల్ 370తో విభేదించారు. అందుకే ఆయ‌న న్యాయ శాఖ మంత్రి ప‌ద‌విని కూడా వ‌దులుకున్నారు. 1952 ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న‌ను కుట్ర పూరితంగా ఓడించారు“ అని షా నిప్పులు చెరిగారు. ఇదే వివాదానికి దారి తీసింది. 

మోదీకి కుడి భుజం!

గుజ‌రాత్‌(Gujarth)లో బీజేపీ వ‌రుస విజ‌యాలు సాధించి అధికారంలోకి రావ‌డం.. త‌ర్వాత కేంద్రంలో పాగా వేయ‌డం వ‌ర‌కు అమిత్ షా కీల‌కంగా వ్య‌వ‌హ‌రించారు. ముఖ్యంగా ప్ర‌ధాని మోదీకి అన్నీ తానై వ్య‌వ‌హ‌రించేవారు. బీజేపీ ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చేందుకు కృషి చేస్తున్న అమిత్ షా ప్రభుత్వానికి బలమైన మూలస్తంభం. అమిత్ షా ప్రభుత్వాన్ని నడపడంలో మాత్రమే కాకుండా రాష్ట్రం నుంచి లోక్‌సభ ఎన్నికల వరకు విజయానికి వ్యూహాన్ని రూపొందించడంలో, దానిని అమలు చేయడంలో కూడా ముఖ్యమైన పాత్ర పోషించారు. అయితే.. ఇప్పుడు తొలిసారి అంబేద్క‌ర్ చుట్టూ రాజుకున్న వివాదంలో న‌లిగిపోతున్నార‌నే చెప్పాలి. 

Also Read: అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తికే భార్యను ఇచ్చి పెళ్లి చేసిన భర్త – ఇది సినిమా స్టోరీ కాదు..రియల్ !

మరిన్ని చూడండి



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments