Homeస్పెషల్ స్టోరీమనదేశంలో బెస్ట్ మైలేజీలు ఇచ్చే ఐదు కార్లు ఇవే - డామినేషన్ ఆ కంపెనీదే!

మనదేశంలో బెస్ట్ మైలేజీలు ఇచ్చే ఐదు కార్లు ఇవే – డామినేషన్ ఆ కంపెనీదే!


Best 5 Cars with High Mileage: మనం ఎప్పుడు కారు కొన్నా ముందుగా గుర్తుకు వచ్చేది ఈ కారు మైలేజీ ఎంత? మీరు కూడా మంచి మైలేజీ ఇచ్చే కొత్త కారు కొనాలని ప్లాన్ చేసుకుంటున్నట్లయితే అలాంటి కొన్ని కార్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ లిస్టులో ఉన్న ఐదు కార్లలో నాలుగు కార్లు మారుతి కంపెనీకే చెందినవి కావడం విశేషం.

మారుతీ సుజుకి సెలెరియో (Maruti Suzuki Celerio)
ఈ లిస్టులో మొదటి కారు మారుతి సుజుకి సెలెరియో. ఇది మంచి మైలేజీని ఇచ్చే పెట్రోల్ కారు. సెలెరియో మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్ 25.24 కిలోమీటర్లు, ఏఎంటీ వేరియంట్ 26.68 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. దీని అధిక మైలేజీకి కారణం దీని డ్యూయల్ జెట్ ఇంజన్. దీని ప్రారంభ ఎక్స్ షోరూమ్ ధర రూ.5.45 లక్షలుగా ఉంది.

మారుతి సుజుకి వ్యాగన్ఆర్ (Maruti Suzuki WagonR)
రెండో కారు మారుతి సుజుకి వ్యాగన్ ఆర్. ఇది 1.0 లీటర్ పెట్రోల్ ఇంజన్‌ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో 24.35 కిలోమీటర్ల, ఏఎంటీ ఇంజిన్‌తో 25.19 కిలోమీటర్ల మైలేజీని ఇవ్వగలదు. దాని 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో 23.56 కిలోమీటర్లు, ఏఎంటీ వేరియంట్‌తో 24.43 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. 

Also Read: రోజువారీ వాడకానికి బెస్ట్ బడ్జెట్ సీఎన్‌జీ కార్లు ఇవే – టాప్-3 లిస్ట్‌లో ఏం ఉన్నాయి?

హోండా సిటీ (Honda City)
ఇవి కాకుండా ఐదో తరం హోండా సిటీ స్టైలిష్ డిజైన్ మీట్స్ కంఫర్ట్ ఫీచర్‌తో లీటర్‌కు 24.1 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. ఇది 1.5 లీటర్ ఐ-వీటెక్ పెట్రోల్ ఇంజన్‌తో 5 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్, 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌ను కలిగి ఉంది. దీంతో పాటు అనేక అధునాతన, లగ్జరీ ఫీచర్లు ఇందులో అందుబాటులో ఉన్నాయి.

మారుతీ సుజుకి ఎస్-ప్రెస్సో (Maruti Suzuki S-Presso)
మారుతి సెలెరియో లాగానే మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో కూడా అదే అప్‌డేటెడ్ ఇంజిన్‌ను పొందుతుంది. ఈ హ్యాచ్‌బ్యాక్ కారు 24.12 కిలోమీటర్ల నుంచి 25.30 కిలోమీటర్ల మైలేజీని ఇస్తుంది. ఇది ఒక ఆదర్శవంతమైన సిటీ కారు. ఈ కారు హిల్ హోల్డ్ అసిస్ట్ ఫంక్షన్, ప్యాసింజర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్‌తో ఈఎస్‌పీని పొందుతుంది.

మారుతి డిజైర్ (Maruti Dzire)
మారుతి సుజుకి డిజైర్ బోల్డ్ లుక్, గొప్ప ఫీచర్లతో వస్తుంది. ఇది 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌లో 22.41 కిలోమీటర్లు, ఏఎంటీతో 22.61 కిలోమీటర్ల మైలేజీని కలిగి ఉంది. డిజైర్ భారతదేశంలో ఉన్న అత్యంత ఫ్యూయల్ ఎఫీషియంట్ కాంపాక్ట్ సెడాన్ కారు. ఇందులో క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

Also Read: కవాసకి బైక్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు – ఏకంగా రూ.45 వేల వరకు డిస్కౌంట్!

మరిన్ని చూడండి





Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments