Konda Surekha Suffering From Fever: హైదరాబాద్: తెలంగాణ అటవీ, దేవాదాయ ధర్మాదాయ, పర్యావరణ మంత్రి కొండా సురేఖ (Konda Surekha) అస్వస్థతకు గురయ్యారు. గత ఐదు రోజులుగా ఆమె జ్వరంతో బాధ పడుతున్నారు. జ్వరం తగ్గక పోవడంతో వైద్య పరీక్షలు నిర్వహించడంతో డెంగీ పాజిటివ్ (Dengue Fever)గా నిర్ధారణ అయింది. డెంగీ జ్వరంతో బాధపడుతున్న కొండా సురేఖ.. తన మంత్రిత్వ శాఖల కార్యక్రమాలను హైదరాబాద్ లోని తన నివాసం నుంచే పర్యవేక్షిస్తున్నారు.
మరోవైపు ప్రతిష్టాత్మక మేడారం జాతర ప్రారంభం కానుండటంతో ఆ పనులపై ఫోకస్ చేస్తున్నారు. మంత్రి కొండా సురేఖ జ్వరంతో బాధ పడుతూనే మేడారం జాతర పనుల పురోగతిని, ఏర్పాట్ల వివరాలను అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. జాతర ఏర్పాట్లు, భక్తులకు సౌకర్యాలపై అధికారులకు అవసరమైన సలహాలు ఇస్తున్నారు. మరో రెండు, మూడు రోజుల్లో ఆమె పూర్తిగా కోలుకుంటారని వైద్యులు తెలిపారు.
మరిన్ని చూడండి