Homeస్పెషల్ స్టోరీమంత్రి అంబటి సంక్రాంతి సంబరాలు, అదిరే స్టెప్పులతో మరోసారి వైరల్‌గా

మంత్రి అంబటి సంక్రాంతి సంబరాలు, అదిరే స్టెప్పులతో మరోసారి వైరల్‌గా


Minister Ambati Rambabu Dance: రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు సంక్రాంతి పండుగ సంబరాలను మొదలుపెట్టారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో వైసీపీ ఆధ్వర్యంలో భోగి సంబరాలు నిర్వహించారు. భోగి మంటల దగ్గర మంత్రి అంబటి రాంబాబు వరుసగా ఈ ఏడాది కూడా డాన్సులు చేశారు. బంజారా మహిళలతో కలిసి అంబటి రాంబాబు కాలు కదిపారు. గత ఏడాది సంక్రాంతి కూడా మంత్రి అంబటి రాంబాబు వేసిన స్టెప్పులు సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూడా అదే రీతిలో అంబటి రాంబాబు స్టెప్పులు వేసి అందర్నీ అలరించారు. ఈసారి మ్యాడ్ సినిమాలోని ‘కళ్లజోడు కాలేజీ పాప సూడు..’ అనే పాటకు డాన్సు చేశారు.





Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments