MG Windsor EV Price: జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్ ఇండియా ఇటీవల తన ఎలక్ట్రిక్ కారును భారత మార్కెట్లో ప్రవేశపెట్టింది. ఎంజీ విండ్సర్ ఈవీ సెప్టెంబర్ 11వ తేదీన భారత మార్కెట్లో లాంచ్ అయింది. ఈ ఎలక్ట్రిక్ కారు ప్రత్యేకత ఏంటంటే మీరు ఈ ఈవీని బ్యాటరీతో పాటు, బ్యాటరీ లేకుండా కూడా పొందవచ్చు. బ్యాటరీ లేకుండా విండ్సర్ ఈవీ ధర రూ. 10 లక్షల రేంజ్‌లో ఉంది. ఇప్పుడు ఎంజీ మోటార్స్ కూడా బ్యాటరీతో కూడిన కారు ధరలను ప్రకటించింది.
ఇటీవలే ఎంజీ విండ్సర్ ఈవీ మార్కెట్లోకి…
ఎంజీ విండ్సర్ ఈవీ ఇటీవలే మార్కెట్లోకి వచ్చింది. ఎంజీ మోటార్స్‌కు చెందిన ఈ ఎలక్ట్రిక్ కారులో బ్యాటరీ ఉండదని, కారు బ్యాటరీకి అయ్యే ఖర్చును ప్రయాణించిన కిలోమీటర్ల దూరం ఆధారంగా చెల్లించాల్సి ఉంటుందని కంపెనీ ఈ కారులో కొత్త ఫీచర్‌ను ఉపయోగించింది. ఎంజీ విండ్సర్ ఈవీ బేస్ వేరియంట్ తీసుకుంటే బ్యాటరీ కోసం ప్రతి కిలోమీటరుకు రూ. 3.5 చెల్లించాలి.
ఎంజీ విండ్సర్ ఈవీ ధర
ఇప్పుడు ఎంజీ మోటార్స్ ఫిక్స్‌డ్ బ్యాటరీతో కూడా కారు ధరను వెల్లడించింది. అంటే కిలోమీటరుకు ఇంత అని కాకుండా పూర్తిగా బ్యాటరీతో పాటు కారును కొనుగోలు చేయవచ్చన్న మాట. బ్యాటరీతో విండ్సర్ ఈవీ ధర రూ.3.5 లక్షలు పెరుగుతుంది. బ్యాటరీ ప్యాక్‌తో కూడిన విండ్సర్ ఈవీ ఎక్స్ షోరూమ్ ధర రూ. 13.50 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. దాని టాప్ వేరియంట్ ధర రూ. 15.50 లక్షల వరకు ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ కారు సర్టిఫైడ్ రేంజ్ సింగిల్ ఛార్జింగ్‌కు 332 కిలోమీటర్లుగా ఉంది.
Also Read: రూ.నాలుగు లక్షల్లో కారు కొనాలనుకుంటున్నారా? – మీకు మంచి ఆప్షన్ ఇదే
విండ్సర్ ఈవీ పోటీ పడేది ఈ వాహనాలతోనే…
విండ్సర్ ఈవీ అనేది సీయూవీ (క్రాస్ఓవర్ యుటిలిటీ వెహికల్) మోడల్ అని ఎంజీ మోటార్స్ చెప్పింది. ఇది ఈ కారు సెడాన్ లాంటి సౌకర్యాన్ని, ఎస్‌యూవీ లాంటి స్థలాన్ని ఇస్తుంది. ఈ ఎలక్ట్రిక్ కారు మూడు వేరియంట్లలో అందుబాటులోకి వచ్చింది. బ్యాటరీ ప్యాక్‌తో కూడిన విండ్సర్ ఈవీ ధర మార్కెట్లో లభించే కార్లకు గట్టి పోటీనిస్తుంది. ఈ కారు టాటా నెక్సాన్ ఈవీ, పంచ్ ఈవీ, మహీంద్రా ఎక్స్‌యూవీ400లతో పోటీ పడనుంది.
విండ్సర్ ఈవీ ఫీచర్లు
ఎంజీ మోటార్స్ లాంచ్ చేసిన ఈ ఎలక్ట్రిక్ కారు 15.6 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్‌ను కలిగి ఉండనుంది. మల్టీఫంక్షనల్ స్టీరింగ్ వీల్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్, ఖరీదైన గాజు పైకప్పును కలిగి ఉండబోతోంది. అదే సమయంలో దాని టాప్ మోడల్‌లో ఏరో లాంగ్ సీట్లు కూడా కనిపిస్తాయి. ఈ కారు నాలుగు కలర్ వేరియంట్లతో మార్కెట్లోకి వచ్చింది. ఇది స్టార్‌బర్స్ట్ బ్లాక్, పెర్ల్ వైట్, క్లే బీజ్, టర్కోయిస్ గ్రీన్ కలర్‌లను కలిగి ఉంది.
Also Read: New Maruti Suzuki Wagon R: మార్కెట్లో కొత్త మారుతి సుజుకి వాగన్ ఆర్ – ధర ఎంత? ఫీచర్లు ఎలా ఉన్నాయి?
మరిన్ని చూడండి