Homeస్పెషల్ స్టోరీబరోజ్ రివ్యూ: యాక్టింగ్‌తో పాటు మోహన్ లాల్ డైరెక్షన్ చేసిన సినిమా - హిట్టా? ఫట్టా?

బరోజ్ రివ్యూ: యాక్టింగ్‌తో పాటు మోహన్ లాల్ డైరెక్షన్ చేసిన సినిమా – హిట్టా? ఫట్టా?


Mohanlal’s Barroz 3D Movie Review In Telugu: కంప్లీట్ యాక్టర్ మోహన్ లాల్ పేరు తెలియని భారతీయ ప్రేక్షకులు ఉండరు. తన మాతృభాష మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీలోనూ నటించారు. నాలుగు వందలకు పైగా సినిమాల్లో నటించిన ఆయన ‘బరోజ్ త్రీడీ’ (Barroz 3d Guardian Of Treasures)తో దర్శకుడిగా మారారు. మొదటిసారి మెగాఫోన్ పట్టారు. ఈ సినిమాలో హీరోగానూ నటించారు. మోహన్ లాల్ డబుల్ డ్యూటీ చేశారన్నమాట. క్రిస్మస్ సందర్భంగా ‘బరోజ్’ను పాన్ ఇండియా భాషల్లో (మలయాళం, తెలుగు, తమిళ్, హిందీ, కన్నడ) విడుదల చేశారు. మరి, ఈ ఫాంటసీ ఫిల్మ్ ఆడియన్స్ అందర్నీ మెప్పించేలా ఉందా? ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది? అంటే… 

కథ (Barroz 3D Movie Story): గోవాలో తమ సామ్రాజ్యాన్ని విస్తరించిన పోర్చుగీసు రాజు డ గామా (ఇగ్నాసియో మతయోస్)కు బరోజ్ (మోహన్ లాల్) నమ్మిన బంటు. నాలుగు వందల ఏళ్లుగా గోవాలోని ఆ రాజ వంశానికి చెందిన నిధిని కాపాడుతూ వస్తున్నాడు. డ గామా వారసులు వస్తే వాళ్లకు అప్పగించాలని ఎదురు చూస్తున్నాడు. ఆ రాజ వంశంలో పదమూడో తరంలో అమ్మాయి ఇసాబెల్లా (మాయా రావు వెస్ట్). తండ్రి రాన్ మాథ్యూ (తుహిన్ మీనన్)తో కలిసి గోవా వస్తుంది.

ఇసాబెల్లాకు డ గామా రాజవంశ నిధిని బరోజ్ అప్పగించాడా? లేదా? ఆ చిన్నారికి తానొక రాజ వంశస్థురాల్ని అనే సంగతి తెలిసిందా? లేదా? నిధిని సంరక్షించే క్రమంలో బరోజ్ ఎన్ని అడ్డంకులు ఎదుర్కొన్నాడు? దుష్టశక్తులు ఆ నిధి కోసం ఎటువంటి ప్రయత్నాలు చేశాయి? ఇసాబెల్లాకు మాత్రమే బరోజ్ ఎందుకు కనిపిస్తున్నాడు? చివరకు ఏమైంది? అనేది సినిమాలో చూడాలి.

విశ్లేషణ (Barroz 3d Review Telugu): హాలీవుడ్ స్ఫూర్తితో సినిమాలు చేయడంలో తప్పు లేదు. కానీ ప్రాంతీయ ప్రేక్షకుల అభిరుచి, ఆసక్తిని దృష్టిలో పెట్టుకోవాలి. హాలీవుడ్ ప్రేక్షకుల కోసం సినిమా తీస్తున్నామా? లేదంటే మన ప్రేక్షకులకు చూపించాలని అనుకుంటున్నామా? అనేది ఆలోచించాలి. లేదంటే రిజల్ట్ రివర్స్ అవుతుంది. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ ‘బరోజ్’.

ఇండియన్ ఆడియన్స్ త్రీడీ సినిమాలపై ఆసక్తి చూపిస్తున్నారు. హాలీవుడ్ నుంచి వచ్చే డిఫరెంట్ కాన్సెప్ట్స్, డిస్నీ ఫిలిమ్స్ చూస్తున్నారు. ఆ కథల్లో మన హీరోలు ఉంటే హ్యాపీగా ఫీలవుతారు. కానీ, మన హీరోలు తీసే సినిమాలు ఆ టైపులో ఉంటే, మన ఎమోషన్స్ / మ్యూజిక్‌ను వెస్ట్రన్ ఇన్‌ఫ్లూయెన్స్ డామినేట్ చేస్తే? విజిల్స్ వేయడం కష్టం. మోహన్ లాల్ వంటి ఇండియన్ హీరో సినిమా చేస్తే… మన జానపదాన్ని తెరపై చూడాలని కోరుకుంటారు. కానీ, మోహన్ లాల్ అందుకు కంప్లీట్ రివర్సులో ‘బరోజ్’ తీశారు.

సినిమాపై ఆసక్తి పెంచడంలో ‘బరోజ్’ ట్రైలర్ ఫెయిల్ అయ్యింది. ‘బాహుబలి’లో కట్టప్ప తరహాలో ఉంది మోహన్ లాల్ గెటప్. క్యారెక్టర్ కూడా అంతే… రాజ వంశానికి అతనొక నమ్మిన బంటు / కట్టు బానిస. అది పక్కన పెట్టి క్యారెక్టర్ సెటప్ చూస్తే… జీనీలా అద్భుతాలు చేసే అవకాశం ఉంది. మంచి వినోదం పండించవచ్చు. టెన్షన్ బిల్డ్ చేయవచ్చు. కానీ, మోహన్ లాల్ ఆ దిశగా కృషి చేయలేదు. సినిమా ప్రారంభం నుంచి దర్శకుడిగా ఆయన మార్క్ చూపించిన సన్నివేశం ఒక్కటంటే ఒక్కటి లేదు.

మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్‌తో ‘బరోజ్ త్రీడీ’ మొదలైంది. ఫాదో గీతంతో ఈ సినిమాను ప్రారంభిద్దామని ఆయన చెబుతారు. ఫాదో గీతం అంటే ఏమిటి? అని ఆలోచనలో పడిన ప్రేక్షకులకు స్క్రీన్ మీద వచ్చే ఫోర్చుగీసు సాంగ్ చిన్నపాటి షాక్ ఇస్తుంది. సినిమా ఎండింగ్ వరకు ఆ షాక్ కంటిన్యూ అవుతుంది. మోహన్ లాల్ (Mohanlal Barroz Review)ను స్క్రీన్ మీద ఎక్కువ సేపు చూడాలని థియేటర్లకు వచ్చిన ప్రేక్షకులకు వెస్ట్రన్ ఆర్టిస్టులు, సింక్ అవ్వని సన్నివేశాలు బ్యాక్ టు బ్యాక్ రావడంతో బోరింగ్ మూమెంట్స్ పెరుగుతూ వెళ్లాయి. క్యారెక్టర్స్ డిమాండ్ మేరకు వెస్ట్రన్ ఆర్టిస్టులను తీసుకోక తప్పదు. కానీ, స్క్రీన్ మీద ఎక్కువ సేపు వాళ్లు కనిపించడంతో పాటు వాళ్ల నటన మన ప్రేక్షకులకు నచ్చేలా లేదు.

రాజ నిధిని కాపాడే ఓ భూతం, కాజేయాలని చూసే దుష్ట శక్తులు… మన జానపదాల్లో ఇటువంటి కథలు ఎన్నో ఉన్నాయి. పోర్చుగీసు వరకు వెళ్లాల్సిన అవసరం లేదు. అందువల్ల, ఈ కథలో నేటివిటీ ఫీల్ మిస్ అయ్యింది తప్ప కొత్తగా వచ్చిన ప్రయోజనం ఏమీ లేదు. నేటివిటీ లేక ఆడియన్స్ డిస్ కనెక్ట్ అయ్యారు. దర్శకుడిగా త్రీడీ షాట్ మేకింగ్ మీద మోహన్ లాల్ పెట్టిన దృష్టి… సన్నివేశంలో కంటెంట్, తన నుంచి ఆడియన్స్ ఏం ఆశిస్తారు? వంటి అంశాలపై పెట్టలేదు. దాంతో సినిమా అటో ఇటో ఎటో అన్నట్టు సాగింది. 

సంతోష్ శివన్ సినిమాటోగ్రఫీ బావుంది. అండర్ వాటర్ సీక్వెన్సులో త్రీడీ విజువల్స్ అప్ టు ద మార్క్ లేవు. సాంగ్స్, రీ రికార్డింగ్ అయితే హాలీవుడ్ సినిమాను తెలుగు డబ్బింగ్‌లో చూసిన ఫీలింగ్ కలిగించాయి. ‘ఇసాబెల్లా…’ సాంగ్ వచ్చినప్పుడు సీట్స్ నుంచి లేచి వెళ్లిపోవాలనే ఫీలింగ్ థియేటర్లలో ప్రేక్షకులకు కలుగుతుంది. ప్రొడక్షన్ వేల్యూస్ బావున్నాయి. ఖర్చు విషయంలో అసలు వెనుకాడలేదు. క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్ డిజైన్ బాగా చేశారు. అది బావుంది.

Also Read: ‘రైఫిల్ క్లబ్’ రివ్యూ: వాణీ విశ్వనాథ్ కీలక పాత్రలో నటించిన మలయాళ సినిమా… ఎందుకంత స్పెషల్?

మోహన్ లాల్ (Mohanlal Barroz Telugu Review)లోని నటుడిని ఆయనలోని దర్శకుడు డామినేట్ చేశాడు. హీరోయిజం చూపించనివ్వలేదు. అలాగని నవ్వించలేదు. మోహన్ లాల్ స్థాయికి తగ్గ నటన చూపించే సన్నివేశాలు రాయలేదు. కథలో కీలక పాత్ర ఇసాబెల్లా చేసిన మాయా రావు వెస్ట్ రూపం బావుంది. కానీ, నటన అంతంత మాత్రమే. మిగతా క్యారెక్టర్లలో వెస్ట్రన్ ఆర్టిస్టులు ఎక్కువ. క్యారెక్టర్లకు తగ్గట్టు చేసుకుంటూ వెళ్లారు.

మోహన్ లాల్ వీరాభిమానులను సైతం ‘బరోజ్’ డిజప్పాయింట్ చేస్తుంది. మన ఇండియన్ ఆడియన్స్ కోసం కాదు… పోర్చుగీసు ప్రజల కోసం తీసినట్టు ఉంది. దర్శకుడిగా, నటుడిగా మోహన్ లాల్ చేసిన డబుల్ డ్యూటీ పోర్చుగీసు బూడిదలో పోసిన పన్నీరు అయ్యింది. టెక్నికల్ అంశాల పరంగా కొన్ని విషయాల్లో మాత్రమే సినిమా మెప్పిస్తుంది.

Also Read‘యూఐ’ రివ్యూ: ఇండియన్ పాలిటిక్స్‌పై ఉపేంద్ర సెటైర్… కామన్ ఆడియన్‌కు అర్థం అవుతుందా?

మరిన్ని చూడండి



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments