Homeస్పెషల్ స్టోరీబట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు - గుడివాడలో బెదిరిపోయిన జనం!

బట్టలిప్పేసి నగ్నంగా క్షుద్రపూజలు – గుడివాడలో బెదిరిపోయిన జనం!


AP News: ఏపీలోని గుడివాడలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. స్థానిక రాజేంద్రనగర్‌ ప్రాంతంలో ఇద్దరు తాంత్రిక వ్యక్తులు చేతబడుల తరహాలో ఏవో పూజలు చేశారు. ప్రత్యక్ష సాక్షులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ఆ తాంత్రికులు శుక్రవారం రాత్రి నుంచి శనివారం ఉదయం వరకు నగ్నంగా కూర్చొని క్షుద్ర పూజలు చేశారు. దీంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. రాజేంద్ర నగర్ ప్రాంతంలో ఉన్న విద్యాలయా స్కూలు వెనుక సైడ్ ఈ ఘటనను స్థానికులు గుర్తించారు.

ఆ స్కూలు వెనుక ఉన్న ఓ ఇంటిలో ఇద్దరు తాంత్రికులు క్షుద్రపూజలు చేశారని స్థానికులు తెలిపారు. చూసేందుకు వారు ఆఘోరాలను పోలి ఉన్నట్లు చెప్పారు. వారు ఇద్దరు ఎదురుగా ఓ పెద్ద దీపం పెట్టుకొని బట్టలు లేకుండా పూజలు చేస్తుండడంతో చుట్టుపక్కల వారు ఆందోళనకు గురయ్యారు. స్థానికులు బెదిరిపోయి వన్‌ టౌన్‌ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వెళ్లి హెచ్చరించినట్లు తెలిసింది. క్షద్రపూజలపై సమాచారం రావడంతో పరిశీలిస్తున్నామని ఎస్‌ఐ పి.గౌతమ్‌ కుమార్‌ తెలిపారు. అయితే, వారు పూజలు చేస్తున్న ఆ ఇంట్లో ఉన్నవారి కుమార్తెకు మానసిక ఆరోగ్యం బాగా లేదని పలువురు చెబుతున్నారు. అందుకే ఈ తాంత్రికులను ఇంటి యజమానులు తీసుకొచ్చి క్షుద్ర పూజలు చేయించినట్లు తెలుస్తోంది. 

మరిన్ని చూడండి



Source link

RELATED ARTICLES

Most Popular

Recent Comments